రాజకీయ వారసురాలు.. గ్లామర్ తార.. రామ్‌చరణ్ బ్యూటీని చుట్టుముట్టిన వివాదం!
మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ సరసన 'చిరుత' చిత్రంతో టాలీవుడ్‌కు పరిచయమైన నేహా శర్మ.. తాజాగా ఓ విభిన్నమైన కారణంతో వార్తల్లో నిలిచింది. సినిమాల్లో అవకాశాలు తగ్గినప్పటికీ.. సోషల్ మీడియాలో తనదైన ముద్ర వేస్తూ మిలియన్ల కొద్దీ ఫాలోవర్లను సంపాదించుకున్న ఈ నటి ఇటీవల ఇన్‌స్టాగ్రామ్ వంటి ప్లాట్‌ఫామ్‌లలో 'పెయిడ్ సబ్‌స్క్రిప్షన్' మోడల్‌ను ప్రారంభించింది. ఈ నిర్ణయం ఆమెకు భారీ ఆదాయాన్ని తెచ్చిపెడుతున్నప్పటికీ.. అదే స్థాయిలో నెటిజన్ల నుంచి తీవ్రమైన ట్రోలింగ్‌కు దారితీసింది.
సబ్‌స్క్రిప్షన్ నిర్ణయించిన నేహా శర్మ
నేహా శర్మ తన ఎక్స్‌క్లూజివ్ ఫోటోలు, వీడియోలను చూసేందుకు నెలకు సుమారు రూ.290 సబ్‌స్క్రిప్షన్ ఫీజును నిర్ణయించారు. తాజా నివేదికల ప్రకారం.. ఇప్పటికే సుమారు 2,454 మంది వినియోగదారులు ఈ ప్లాన్‌ను తీసుకున్నట్లు సమాచారం. దీని ద్వారా నేహా శర్మకు నెలకు దాదాపు రూ.7 లక్షల వరకు ఆదాయం లభిస్తోంది. ఓ నటిగా తనకున్న పాపులారిటిని డిజిటల్ ఆదాయంగా మార్చుకోవడంలో నేహా శర్మ విజయం సాధించినప్పటికీ.. కొంతమంది దీనిని కేవలం డబ్బు కోసమే చేస్తున్న పనిగా అభివర్ణిస్తూ విమర్శలు చేస్తున్నారు.

వ్యక్తిగత విమర్శలు
ఈ వివాదం కేవలం నేహా శర్మ వృత్తిపరమైన నిర్ణయానికే పరిమితం కాలేదు. కొందరు నెటిజన్లు నేహా రాజకీయ నేపథ్యాన్ని కూడా ఇందులోకి లాగుతున్నారు. బీహార్‌కు చెందిన ఓ ప్రముఖ కాంగ్రెస్ నేత కూతురైన నేహా శర్మ.. ఇలాంటి పెయిడ్ కంటెంట్ ప్లాట్‌ఫామ్స్ నిర్వహించడం సరికాదంటూ వ్యక్తిగత దాడులకు దిగుతున్నారు. ఆమె కుటుంబ గౌరవానికి ఇది భంగం కలిగిస్తోందంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఏ సంబంధం లేని రాజకీయాలను ఆమె వ్యక్తిగత కెరీర్ నిర్ణయాలను ముడిపెట్టడంపై విశ్లేషకులు మండిపడుతున్నారు.
Neha Sharma
— Wizard 🐉 (@Quantum_143) March 24, 2026
>Daughter of a Congress politician who lost the election in Bihar this time.
>Neha Sharma flops in Bollywood..
>Then she comes to OTT with shows like Illegal (multiple seasons), but those also flop..
>Then she starts offering exclusive content on Instagram for ₹290… pic.twitter.com/9jju9VjzYE
అసభ్యకర కంటెంట్ ఉందంటూ..
అత్యంత బాధాకరమైన విషయం ఏమిటంటే.. నేహాశర్మ షేర్ చేసే కంటెంట్ గురించి ఎటువంటి సమాచారం లేకపోయినా కొందరు కావాలనే ఆమె అసభ్యకర ఫోటోలు షేర్ చేస్తోందని విమర్శలు గుప్పిస్తున్నారు. ఆ పెయిడ్ సబ్‌స్క్రిప్షన్‌లో అసభ్యకరమైన కంటెంట్ ఉంటుందంటూ దుష్ప్రచారం చేస్తున్నారు. అయితే అందులో కేవలం ఆమె గ్లామరస్ ఫోటో షూట్స్, బ్రాండ్ ప్రమోషన్స్, ఫ్యాషన్ వీడియోలు మాత్రమే ఉన్నాయని ఆమె ప్యాన్స్ స్ఫష్టం చేస్తున్నారు. ఇన్‌ఫ్లుయెన్సర్లందరూ చేసే పనే నేహా శర్మ చేస్తున్నప్పటికీ.. ఆమెను ప్రత్యేకంగా లక్ష్యంగా చేసుకోవడం వెనుక ఆన్ లైన్ వేధింపుల ధోరణి కనిపిస్తోందని మండిపడుతున్నారు.
అది వృత్తిపరమైన హక్కు
డిజిటల్ యుగంలో కంటెంట్ క్రియేటర్లు తమ కంటెంట్ ద్వారా ఆదాయం పొందడం అనేది అంతర్జాతీయంగా చట్టబద్ధమైన, సాధారణమైన ప్రక్రియ. ఓ నటిగా తన గ్లామర్‌ను లేదా టాలెంట్‌ను మానిటైజ్ చేసుకోవడం నేహా శర్మ వ్యక్తిగత, వృత్తిపరమైన హక్కు. కంటెంట్ నచ్చని వారు దానిని సబ్‌స్క్రైబ్ చేసుకోకుడా ఉండే స్వేచ్ఛ ఉన్నప్పటికీ.. ఓ మహిళపై అసభ్యకరమైన పదజాలంతో దాడి చేయడం సామాజిక మాధ్యమాలలోని అంధకారాన్ని సూచిస్తుంది. ఈ ఘటన ఆన్ లైన్ గౌరవ మర్యాదలు, వ్యక్తిగత స్వేచ్ఛపై మరోసారి చర్చను రేకెత్తించింది.












Click it and Unblock the Notifications