రామ్ చరణ్ 'పెద్ది' క్రికెట్ షాట్ రీ క్రియేట్.. ఢిల్లీ క్యాపిటల్స్ అదరగొట్టారుగా !
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం 'పెద్ది' సినిమా చేస్తున్నారు. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా.. జగపతిబాబు, కన్నడ స్టార్ శివ రాజ్‌కుమార్, బాలీవుడ్ నటుడు దివ్యేండు సహా పలువురు నటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఆస్కార్ అవార్డు గ్రహీత మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. రత్నవేలు ఈ సినిమాకు సినిమాటోగ్రాఫర్ గా ఉన్నారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంస్థలు నిర్మిస్తున్నాయి. వచ్చే ఏడాది మార్చి 27 న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతీయ భాషల్లో విడుదల కాబోతుంది.
రామ్ చరణ్ గత చిత్రం గేమ్ ఛేంజర్ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలవడంతో ఈ సినిమాపైనే మెగా అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. గ్రామీణ వాతావరణంలో జరిగే స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో పెద్ది సినిమాను తెరకెక్కిస్తున్నట్లుగా టాక్ నడుస్తుంది. ఈ క్రమంలోనే శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ సినిమా నుంచి ఫస్ట్ షాట్ గ్లింప్స్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ గ్లింప్స్ లో ఫుల్ గా జుట్టు, గడ్డంతో చరణ్ రా అండ్ రస్టిక్ లుక్ లో అదరగొట్టారు.

అదరగొట్టిన గ్లింప్స్..
ఏదైనా నేలమీద ఉన్నప్పుడే చేసేయ్యాలి.. పుడాతామా ఏంటి మళ్లీ.. అంటూ ఉత్తరాంధ్ర యాసలో డైలాగ్ చెప్పి అదరగొట్టాడు చరణ్. వీడియో చివరలో క్రికెట్ షాట్ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. అయితే ఇప్పుడు ఈ షాట్ ను ఢిల్లీ క్యాపిటల్స్ టీం రీ క్రియేట్ చేసింది. టీం మెంబర్స్ ఒక్కొక్కరుగా ఈ వీడియోలో ఉన్నట్టే ఎంట్రీ ఇస్తూ హిందీలో డైలాగ్స్ చెప్పారు. చివరగా సేమ్ చరణ్ స్టైల్ లోనే షాట్ కొట్టారు. ఇక ఈ వీడియోను సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో ఫుల్ వైరల్ గా మారింది.
సన్ రైజర్స్ తో మ్యాచ్..
ఇక నేడు ఐపీఎల్ 2025లో భాగంగా సన్‌రైజర్స్ మరో పోరుకు సిద్ధమైంది ఢిల్లీ జట్టు. హైదరాబాద్ వేదికగా ఉప్పల్ స్టేడియంలో రాత్రి 7.30 నిమిషాలకు ఈ మ్యాచ్ జరగనుంది. ఈ సీజన్‌లో 10 మ్యాచ్‌ల్లో మూడింట్లో గెలిచి 9వ స్థానంలో ఢిల్లీ ఉండగా.. 10 మ్యాచ్‌లలో 6 విజయం సాధించి 5వ స్థానంలో ఉంది హైదరాబాద్ టీం. ఐపీఎల్ టోర్నీ చరిత్రలో ఇప్పటివరకు సన్‌రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య 25 మ్యాచ్‌లు జరిగాయి. ఇందులో 13 మ్యాచ్‌ల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ గెలవగా.. 12 మ్యాచ్‌ల్లో ఢిల్లీ క్యాపిటల్స్ విజయం సాధించింది.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications