రామ్ చరణ్ హీరోయిన్ సీక్రెట్ పెళ్లి.. అతనితో 5 ఏళ్లు డేటింగ్..?
ఆరెంజ్ సినిమా మనందరికి గుర్తుంది కదా.. మగధీర లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చేసిన సినిమా ఇది. భారీ అంచనాలతో రిలీజైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ప్లాఫ్ గా నిలిచింది. కానీ ఈ సినిమా పాటలు ఇప్పటికీ ఓ ట్రెండ్ సెట్టర్. రామ్ చరణ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచాయి పాటలు. బొమ్మరిల్లు భాస్కర్ తెరకెక్కించిన ఈ మూవీ లవ్ స్టోరీ ఎందుకో అప్పట్లో యువతకు ఎక్కలేదు.
ఈ మూవీలో రామ్ చరణ్ సరసన జెనీలియా నటించింది. అయితే ఈ మూవీలో రామ్ చరణ్ సరసన మరో హీరోయిన్ కూడా నటించింది. సెకండ్ హాఫ్ లో వచ్చే ఈ హీరోయిన్ అయితే అప్పట్లో ఆడియన్స్ కు పిచ్చెక్కించింది. ఆమెనే షాజన్ పదమ్సీ. చెర్రీతో కలిసి ఈ బ్యూటీ చేసిన మ్యేజిక్ అంతా ఇంతా కాదు. అప్పట్లో ఈమెకు స్పెషల్ ఫాలోయింగ్ ఉండేది. ఈ మూవీ తర్వాత ఎనర్జిటిక్ స్టార్ హీరో రామ్ తో మసాలా సినిమా కూడా చేసింది. కాకపోతే తెలుగులో పెద్దగా ఫేమ్ రాక.. వచ్చిన దారినే యూ టర్న్ తీసుకుని బాలీవుడ్ వెళ్లిపోయింది.

అయితే తాజాగా షాజన్ పదమ్సీ పెళ్లి చేసుకున్న ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ఈ ముద్దుగుమ్మ.. మూవీ మాక్స్ సినిమా సీఈఓ ఆశిష్ కనకియాను వివాహం చేసుకుంది. వీరిద్దరూ చాలా కాలంగా డేటింగ్ ఉన్నట్లు సమాచారం. ఓ ఫ్రెండ్ ద్వారా షాజన్ పదమ్సీకు ఆశిష్ పరిచయం కాగా కొన్నాళ్లకు అది ప్రేమగా మారింది. ఆ తర్వాత చాలా కాలం పాటు ఇద్దరూ రిలేషన్ లో ఉన్నారు.
తాజాగా ఇంట్లో వారిని ఇద్దరూ ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. ముంబైలో మూడు రోజుల పాటు వీరి పెళ్లి వేడుకలు జరిగాయి. ఇక గురువారం(05 జూన్) రాత్రి వీరి పెళ్లి జరిగింది. త్వరలో రిసెప్షన్ జరగనుంది. ఈ విషయం తెలిసిన మెగా ఫ్యాన్స్ ఈ ముద్దుగుమ్మకు కంగ్రాట్స్ చెబుతున్నారు.












Click it and Unblock the Notifications