పబ్లిక్ గానే అలా అనేసిన రామ్ చరణ్.. క్షమించమంటూ పోస్ట్ !!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ - సెన్సేషనల్ దర్శకుడు బుచ్చిబాబు సానా కాంబోలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక పాన్ ఇండియా చిత్రం "పెద్ది". ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, కన్నడ స్టార్ శివ రాజ్‌కుమార్, సీనియర్ నటుడు జగపతిబాబు, బాలీవుడ్ నటుడు దివ్యేండు శర్మ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ముఖ్యంగా ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండటం సినిమాపై మరింత హైప్ తీసుకొచ్చింది. ఇప్పటికే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, సాంగ్స్ విషయంలో ఇండస్ట్రీలో భారీ అంచనాలు ఉన్నాయి.

గ్రామీణ నేపథ్యంలో క్రికెట్ ఎమోషన్స్‌ను కలగలిపి తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్, ట్రైలర్ ప్రేక్షకుల్లో సినిమాపై ఆసక్తిని మరింత పెంచేశాయి. జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ సినిమా కోసం చిత్రబృందం భారీ స్థాయిలో ప్రమోషన్స్ నిర్వహిస్తోంది. ముంబైలో జరిగిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జాతీయ స్థాయిలో సంచలనం సృష్టించింది. ఈ క్రమంలోనే శనివారం మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో పెద్ది మూవీ టీం లైవ్ కాన్సర్ట్ నిర్వహించింది. అయితే ఈ కార్యక్రమంలో రామ్‌చరణ్ పబ్లిక్ గా చేసిన పొరపాటు కారణంగా ట్రోలింగ్‌కి గురవుతుండడం హాట్ టాపిక్ గా మారింది.

ram-charan-saying-sorry-to-cricketer-bumrah-that-his-mistakenly-said-him-as-football-player-in-peddi

ఏం జరిగిందంటే..

వేడుకలో భాగంగా హోస్ట్ అడిగిన ప్రశ్నలకు రామ్ చరణ్ సమాధానాలు చెప్పారు. అందులో భారతీయ ప్రముఖ క్రికెటర్ల పేర్లను ప్రస్తావిస్తూ, వారి గురించి ఒక్క మాటలో చెప్పాల్సిందిగా హోస్ట్ కోరారు. ఈ క్రమంలో సచిన్ టెండూల్కర్, మహేంద్ర సింగ్ ధోని, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వంటి స్టార్ ఆటగాళ్ల గురించి చరణ్ తనదైన శైలిలో రియాక్ట్ అయ్యారు. అయితే చివరగా టీమిండియా స్టార్ ఫాస్ట్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా పేరు ప్రస్తావించగా చరణ్ తడబడ్డారు. తాను బుమ్రాకు పెద్ద అభిమానిని అంటూ ఆయన ఫుట్‌బాల్ ఎంతో అద్భుతంగా ఆడుతూ దేశ కీర్తిని ముందుకు తీసుకెళ్తున్నారని చెప్పారు.

అయితే ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉన్న క్రికెట్ పేసర్‌ను ఫుట్‌బాల్ ఆటగాడిగా పేర్కొనడం అందరికీ షాక్ ఇచ్చింది. అలానే తన ప్రసంగం మధ్యలో భోపాల్ అనబోయి బీహార్ అని కూడా వ్యాఖ్యానించారు. దాంతో చరణ్ మాట్లాడిన వీడియో క్లిప్స్ నెట్టింట విపరీతంగా వైరల్ అయ్యాయి. ఈ వివాదం నెట్టింట పెద్ద ఎత్తున చర్చనీయాంశం కావడంతో రామ్ చరణ్ తక్షణమే స్పందించారు. తన అధికారిక ఎక్స్ (ట్విట్టర్) ఖాతా ద్వారా క్షమాపణలు చెబుతూ పోస్ట్ పెట్టారు. బుమ్రాను ట్యాగ్ చేస్తూ.. ఆయన సాధించిన విజయాలు ప్రతి భారతీయుడు గర్వపడేలా ఉన్నాయని, మైదానంలో ఆయన ఆటకు తాను వీరాభిమానిని అని చరణ్ స్పష్టం చేశారు. బుమ్రా పట్ల తనకు ఎంతో గౌరవం ఉందని పేర్కొంటూ పోస్ట్ పెట్టారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+