హనుమాన్ సినిమాపై ప్రశంసల వర్షం కురిపించిన రామ్‌గోపాల్‌వర్మ..
టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జ హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా హనుమాన్. సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ సినిమా థియేటర్లలో మంచి టాక్‌నే సొంతం చేసుకుంది. ఈ సినిమాకు ప్రశాంత్‌వర్మ దర్శకత్వం వహించారు. ఈ సినిమా జనవరి 12 న థియేటర్లలో విడుదలైంది. భారీ అంచనాల మధ్య విడుదలయిన ఈ సినిమా ప్రేక్షకుల్లో మంచి టాక్‌నే సొంతం చేసుకుంది.
ప్రస్తుతం ఎక్కడ చూసిన ఈ సినిమా గురించే వినిపిస్తోంది. తక్కువ బడ్జెట్‌తో అద్భుతమైన సినిమాని రూపొందించారని అభిమానులు అంటున్నారు. టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మసినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా వచ్చిన సూపర్ హీరో సినిమా ఇది. ఇప్పటికే ఈ సినిమాపై చాలామంది సెలబ్రిటీలు స్పందించారు. ఇప్పడు తాజాగా హనుమాన్ సినిమాపై సంచలనదర్శకుడు రామ్‌గోపాల్ వర్మ స్పందించారు. కేవలం రూ.75 కోట్ల బడ్జెట్ తో ఇంత అద్భుతమైన సినిమా ఎలా సాధ్యమైంది అంటూ ప్రశాంత్ వర్మపై రామ్‌గోపాల్ వర్మ ప్రశంసల వర్షం కురిపించారు.

హనుమాన్ సినిమా యునానిమస్ బ్లాక్ బస్టర్ హిట్ :టాలీవుడ్‌లోని టాప్ స్టార్స్ అంతా హనుమాన్ సినిమాపై సోషల్‌మీడియాలో శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఆర్జీవీ సైతం హనుమాన్ దర్శకుడు ప్రశాంత్ వర్మను ప్రశంసలతో ముంచెత్తారు. కథా, కథనం, గ్రాఫిక్స్,ఎమోషన్స్,ఎలివేషన్స్ ఇలా ప్రతీ పాయింట్ లోనూ సినిమా నెక్స్ట్ లెవల్లో ఉందంటూ కామెంట్స్ చేయడం మొదలుపెట్టారు. హనుమాన్ మూవీపై సంచలన దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ తన అభిప్రాయాన్ని సోషల్‌మీడియా వేదికగా నెటిజన్స్‌తో పంచుకున్నారు. ముందుగా దర్శకుడు ప్రశాంత్ వర్మ, హీరో తేజ సజ్జకు నా అభినందనలు. హనుమాన్ సినిమా యునానిమస్ బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకుంది.. జై హనుమాన్ రామ్‌గోపాల్‌వర్మ సోషల్‌మీడియాలోని తన ఖాతాలో పోస్ట్ చేయడం జరిగింది. రామ్ గోపాల్ వర్మ పెట్టిన పోస్టుకు దర్శకుడు ప్రశాంత్ వర్మ స్పందించారు. థ్యాంక్యూ సర్.. అంటూ రిప్లయ్ ఇచ్చాడు.
Hey @PrasanthVarma and @tejasajja123 CONGRATULATIONS on the unanimous BLOCKBUSTER TALK ..Jai HANU-MAN 💪💪💪
— Ram Gopal Varma (@RGVzoomin) January 12, 2024












Click it and Unblock the Notifications