Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

''వ్యూహం'' రివ్యూ : పవన్ కల్యాణ్‌పై వర్మ మార్క్ సెటైర్లు

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అంటే వివాదాలకు మారుపేరు. కానీ ఒకప్పుడు అతడి నుంచి వచ్చిన సినిమాలు సినీ పరిశ్రమల్లో ఒక ట్రెండ్ ను సృష్టించాయి. ఎంతోమందిని ఆయన బాటలోనే నడిచారు.. నడుస్తున్నారు. వర్మ నుంచి సినిమా వస్తోందంటే కచ్చితంగా ఎంతో విభిన్నంగా ఉంటుంది. థియేటర్లకు కూడా అదే ఉద్దేశంతో ప్రేక్షకులు వెళ్లేవారు.

ఒకప్పుడు శివ, సత్య, సర్కార్ లాంటి గొప్ప సినిమాలు తీశారు. మళ్లీ అలాంటి సినిమాలు తీయవచ్చుకదా అని అభిమానులు అడిగితే ఇప్పటికే ఆ సినిమాలన్నీ తీశానుకదా అనే సమాధానం ఇస్తాడు. తాజాగా ఆయన దర్శకత్వం వహించిన 'వ్యూహం' సినిమా విడుదలైంది. డిసెంబరు 29 నుంచి వాయిదాలు పడుతూ పడుతూ వస్తోన్న ఈ సినిమా ఎట్టకేలకు శనివారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. థియోటర్లలో సందడి చేసిన ఈ సినిమా ఎలా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

Ram Gopal Varma vyuham movie review and rating

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన దగ్గర నుంచి వ్యూహం కథ మొదలవుతుంది. దాంతో అతని కుమారుడు మదన్ రెడ్డి (అజ్మల్ అమీర్)ని సీఎం చేయాలని సదరు పార్టీకి చెందిన 150 మంది ఎమ్మెల్యేలు సంతకం చేస్తారు. కానీ, అదంతా పక్కన పెట్టి పార్టీ అధిష్టానం కాశయ్యకు సీఎం పదవి అప్పగిస్తుంది. అనంతరం తండ్రి మరణ వార్త విని చనిపోయిన ప్రజల కోసం మదన్ యాత్రలు చేస్తుంటాడు. అది ఇష్టం లేని ప్రతిపక్షాలు, హై కమాండ్ వాటిని ఆపేందుకు ప్రయత్నిస్తాయి.

హైకమాండ్, భారత్ పార్టీని లెక్క చేయకుండా మదన్ ప్రజల ముందుకు వెళతాడు. వీసీపీ పార్టీ స్థాపించి ప్రజల్లోకి వెళతాడు. దాంతో అతని మీద కేసులు, ఇన్వెస్టిగేషన్లు మొదలవుతాయి. వాటిని ఎదురించి ఎలా నిలిచాడనేది మిగిలిన కథ. 'వ్యూహం' సినిమా ప్రారంభంలో కల్పిత కథ, పాత్రలతో తీశామని చెప్పినా సరే... కథ ఏమిటనేది తెలుగు రాష్ట్రాల ప్రజలు అందరికీ తెలుసు. వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం నుంచి ఆయన తనయుడు జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యే వరకు ఏపీ రాజకీయాల్లో ఏం జరిగిందనేది చిత్ర కథాంశం.

Ram Gopal Varma vyuham movie review and rating

నారా లోకేష్ పాత్రను ఒక స్ఫూఫ్ లాగా, కామెడీ తరహాలో చూపించే ప్రయత్నం చేశారు. అందులో సీరియస్‌నెస్ లేదు. మెగా బ్రదర్స్ మధ్య సాగే సన్నివేశాలు నెగెటివిటీ తెచ్చుకునే విధంగా ఉంది. .జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై వర్మ మార్క్ సెటైర్లు పడ్డాయి. పవన్ కల్యాణ్ పుస్తకాలు చదవడంపై సెటైర్లు పడ్డాయి. నిజానికి ప్రతి పాత్ర రియల్ లైఫ్ పాత్రలకు బాగా సెట్ అయ్యాయి. వాళ్ల నటన కూడా దాదాపు అలాగే నటించేందుకు ప్రయత్నించారు. ఓవరాల్‌గా చెప్పాలంటే వైసీపీ అభిమానులు ఫుల్‌గా ఎంజాయ్ చేసే సినిమా ఇది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+