రామ్ పోతినేనితో డేటింగ్? రింగ్ తో హీరోయిన్ క్లారిటీ.. ఇద్దరూ ఒకే గదిలో.. ఏం జరుగుతోంది?

రామ్ పోతినేని.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ లో ఒకరు. ఇప్పటికీ హీరో రామ్ అంటే అమ్మాయిలు పిచ్చెక్కిపోతారు. అయితే ఈ హాండ్సమ్ హీరో ఇప్పుడు డేటింగ్ లో ఉన్నట్లు సమాచారం. ఓ హీరోయిన్ తో పీకల్లోతు ప్రేమలో ఉన్నట్లు సామాజిక మాధ్యమాలు కోడై కూస్తున్నాయి. అంతేకాక ఇద్దరూ సీక్రెట్ గా ఎంగేజ్ మెంట్ చేసుకున్నట్లూ కథనాలు వస్తున్నాయి. మరి ఈ హీరోయిన్ ఎవరో తెలుసా..?

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని, హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే రిలేషన్ లో ఉన్నట్లు సామాజిక మాధ్యమాల్లో వార్త హల్ చల్ చేస్తోంది. ప్రస్తుతం రామ్ తో భాగ్యశ్రీ ఓ సినిమా చేస్తోంది. అయితే వీళ్లిద్దరూ వాళ్ల అధికారిక ఎకౌంట్స్ లో తాజాగా ఫొటోస్ షేర్ చేశారు. వీటిని చూస్తే ఇద్దరూ ఒకే రూమ్ లో ఉన్నట్లు కనిపిస్తోంది. దీంతో వీళ్ల రిలేషన్ రూమర్స్ కాస్త బలపడ్డాయి. ఇద్దరూ డేటింగ్ ఉన్నారని అంతా అనుకుంటున్నారు.

అయితే తాజాగా హీరోయిన్ భాగ్యశ్రీ ఇన్ స్టా వేదికగా తన ఫ్యాన్స్ తో చిట్ చాట్ చేసింది. ఈ చాటింగ్ లో ఓ నెటిజెన్ మీ చేతికి ఉన్న రింగ్ ఎవరు తొడిగారు అని క్వశ్చన్ వేశాడు దీంతో ఆమె ఆ రింగ్ తానే కొనుకున్నానని తెలిపింది. అలా తాను ఎవరితో రిలేషన్ లో లేనని పరోక్షంగా క్లారిటీ ఇచ్చింది. కానీ నెట్టింట మాత్రం వీళ్లిద్దరూ రిలేషన్ లో ఉన్నారని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

Ram Pothineni Sparks Dating Rumors with Actress Bhagyashree

ఇక ప్రస్తుతం రామ్ పోతినేని ఓ లవ్ స్టోరీ చేస్తున్నాడు. ఇందులో సాగర్ పాత్రలో రామ్ నటిస్తుండగా.. మహాలక్ష్మి పాత్రలో భాగ్యశ్రీ నటిస్తోంది. మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి మూవీతో మంచి హిట్ అందుకున్న పి. మహేష్ బాబు ఈ మూవీకి దర్శకత్వం చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా సాగుతోంది. ఈ ఏడాదిలోనే ఈ మూవీ రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇక రామ్ పోతినేని లాస్ట్ మూవీస్ లో స్కంద, డబుల్ ఇస్మార్ట్ బాక్సాఫీస్ ముందు నిరాశ పరిచాయి. దీంతో ఎలాగైనా హిట్ కొట్టి కమ్ బ్యాక్ ఇవ్వాలని హీరో రామ్ కసిగా ఉన్నాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+