జూనియర్ ఎన్టీఆర్ సినిమా పేరుతో రామ్ చరణ్ కొత్త సినిమా
సినీ పరిశ్రమలో జూనియర్ ఎన్టీఆర్ తనతోటి స్టార్ హీరోలందరితో సఖ్యతగా మెలుగుతారు. అందరితో మంచి స్నేహాన్ని కలిగివుంటారు. ఆ స్నేహంతోనే రామ్ చరణ్ తో కలిసి ఆర్ఆర్ఆర్ సినిమా చేశారు. అందులో తన పాత్రకన్నా రామ్ చరణ్ పాత్రకే ప్రాముఖ్యత ఎక్కువగా ఉంటుందని తెలిసినప్పటికీ అందులో నటించేందుకు ఒప్పుకోవడం అతనిలోని స్నేహభావానికి నిదర్శనమని అభిమానులు కొనియాడుతుంటారు. గతంలో తాను బిజీగా ఉన్న సమయంలో కూడా కొన్ని సినిమా కథలను రామ్ చరణ్ వద్దకు పంపించి ఒప్పించేవాడు.
ఇలా ఒప్పించిన చిత్రాన్నే రామ్ చరణ్ ప్రస్తుతం చేస్తున్నాడు. బుచ్చిబాబు దర్శకత్వంలో రూపుదిద్దుకోబోతున్న ఈ చిత్రం కథ ముందుగా తారక్ కు చెప్పాడు. అయితే చేద్దామనుకున్నప్పటికీ కొంతకాలం గడిచిన తర్వాత దేవర చిత్రం ఆలస్యమవుతుండటంతోపాటు రెండు భాగాలుగా రానుండటంవల్ల అప్పటివరకు ఎదురుచూడొద్దని దర్శకుడికి చెప్పారు. తానే రామ్ చరణ్ తో మాట్లాడి కథ విని ఓకే చేయాలని కోరగా తారక్ కోరిక మేరకు రామ్ చరణ్ కథ విని వెంటనే సినిమా చేయడానికి ఒప్పుకున్నాడు.

తారక్ తో చేద్దామనుకున్న బుచ్చిబాబు ఈ కథకు పెద్ది అనే టైటిల్ ను ఖరారు చేసుకున్నారు. ఇప్పుడు రామ్ చరణ్ హీరో కావడంతో అదేపేరును దీనికి ఖరారు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. జూనియర్ ఎన్టీఆర్ మరోసారి మంచి స్నేహభావంతో వ్యవహరించారని, అదే టైటిల్ ను ఈ సినిమాకు వాడుకుంటున్నామని దర్శకుడు తారక్ కు చెప్పారు. ఏదేమైనప్పటికీ స్నేహ భావంతోపాటు నలుగురి మంచిని కోరకునే మనస్తత్వం ఉంటే మనచుట్టూ మన మంచిని కోరుకునే మనుషులు దగ్గరవుతారని ఎన్టీఆర్ మరోసారి నిరూపించాడంటూ ప్రశంసలు దక్కుతున్నాయి.












Click it and Unblock the Notifications