కూతురితో తొలిసారి విదేశాల‌కు బ‌య‌ల్దేరిన రామ్‌చ‌ర‌ణ్ దంప‌తులు..

ఆర్ఆర్ఆర్ లాంటి బ్లాక్ బస్టర్ సినిమా త‌ర్వాత రామ్‌చ‌ర‌ణ్ గ్లోబ‌ల్ స్టార్‌గా మారిపోయాడు. ఇక త‌న నెక్ట్స్ సినిమా ఏంటా అని ప్రేక్ష‌కులు ఎంత‌గానో ఎదురుచూస్తున్నారు. ఆర్ఆర్ఆర్ హిట్ తర్వాత రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్' అనే సినిమాలో న‌టిస్తున్నార‌నే విష‌యం అంద‌రికే తెలిసిందే. ఈ సినిమాకు శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించనున్నారు. ఈ సినిమా పొలిటికల్ డ్రామాగా తెర‌పైకి రానుంది. ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలనే పెట్టుకున్నారు.

ప్ర‌స్తుతం గేమ్‌చేంజ‌ర్ సినిమా షూటింగ్ జ‌రుగుతున్న‌ప్ప‌టికీ రామ్‌చ‌ర‌ణ్ మాత్రం విదేశీ ట్రిప్‌కి బ‌య‌లుదేరారు. భార్య ఉపాసన, కూతురు క్లీంకారతో కలిసి హాలీడేకు ఇట‌లీ బ‌య‌లుదేరారు. అయితే తొలిసారి కూతురుతో క‌లిసి రామ్‌చ‌ర‌ణ్, ఉపాస‌న విదేశాల‌కు బ‌య‌ల్దేరుతున్నారు. ఈ వెకేషన్ కు వెళ్తూ, హైదరాబాద్ విమానాశ్రయంలో వీరిద్ద‌రూ కూతురితో క‌లిసి మీడియాకు కనిపించారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

Ramcharan couple went abroad for the first time with their daughter

ఫ్యామిలీ ట్రిప్‌కు ఇట‌లీ: రామ్ చరణ్ వీలైనంత ఎక్కువగా ఫ్యామిలీతో గడిపేందుకు ఎక్కువ‌గా ఇష్టపడతారు. సమయం దొరికితే చాలు కుటుంబంతో కలిసి విహారయాత్రలకు వెళ్లడం ఆయ‌నకు అల‌వాటు. తాజాగా రామ్ చరణ్ మరోసారి ఫారిన్ వెకేషన్‌కు బ‌య‌ల్దేరారు. ఈ సంద‌ర్భంగా హైద‌రాబాద్ విమానాశ్ర‌యంలో మీడియాకు క‌నిపించారు. అయితే, రామ్ చరణ్ చేతిలో వారి పెట్ డాగ్ రైమ్ కనిపించిగా, ఉపాసన ఒడిలో కూతురు క్లీంకార ఉంది. చరణ్, ఉపాసన ఇద్దరూ క్యాజువల్ లుక్‌లోనే మీడియాకు ఫోజులిచ్చారు.

అయితే, తన పాప క్లీంకార ముఖం కనిపించకుండా ఉపాసన చేతిని అడ్డుగా పెట్టారు. అయితే, ఇప్పడు ఈ ఫోటోలు కాస్త సోష‌ల్‌మీడియాలో తెగ హ‌ల్చ‌ల్ చేస్తున్నాయి. గేమ్ ఛేంజ‌ర్ సినిమాను దిల్‌రాజు భారీ బ‌డ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ సినిమా కోసం అభిమానులు ఎంత‌గానో ఎదురుచూస్తున్నారు. పలు కారణాలతో ఈ సినిమా షూటింగ్ ఆల‌స్యం అవుతుంది. అయితే, విజయ దశమి కానుకగా మెగా అభిమానుల కోసం ఈ సినిమా యూనిట్ ఓ స‌ర్‌ప్రైజ్‌ను ఇవ్వ‌నున్న‌ట్లు తెలుస్తోంది.

'గేమ్ ఛేంజర్స‌లోని తొలి పాటను దసరాకు విడుదల చేసేందుకు ఈ మూవీ మేక‌ర్స్ ఆలోచిస్తున్నట్లు స‌మాచారం. ఇప్పటి వరకు ఆ విషయాన్ని అధికారికంగా ఎవ‌రూ అనౌన్స్ చేయలేదు. విజయ దశమికి అభిమానుల‌కు ఇది ఒక సర్‌ప్రైజ్ అని సినీ వ‌ర్గాల్లో వినిపిస్తోన్న టాక్‌. ఇప్పటికే సంగీత దర్శకుడు తమన్ ఆల్రెడీ సాంగ్ వర్క్ ఫినిష్ కూడా చేశార‌ని తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+