తన భర్త చూస్తుండగానే.. కియారాకు రామ్ చరణ్ లిప్ కిస్
మెగాస్టార్ చిరంజీవి తనయుడిగా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన రామ్ చరణ్, నేడు ఛిరంజీవినే మించిపోయిన సంగతి తెలిసిందే. ఒక్కో సినిమాతో తనని తాను మార్చుకుంటూ విలక్షణ నటుడిగా మంచి క్రేజ్ ని సొంతం చేసుకుంటున్నాడు. RRR చిత్రం తో గ్లోబల్ స్టార్ గా పేరు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం ఆయన సౌత్ ఇండియన్ సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ తో 'గేమ్ చేంజర్' అనే సినిమా చేస్తున్నారు.
ఈ సినిమా షూటింగ్ RRR షూటింగ్ అయిపోయిన వెంటనే మొదలైంది. మూడు షెడ్యూల్స్ ని కూడా పూర్తి చేసుకుంది. ఇప్పటికీ షూటింగ్ జరుగుతూనే ఉంది. వచ్చే సంవత్సరం కూడా ఈ సినిమా విడుదలవుతుందా? లేదా? అనే సందిగ్ధత వెంటాడుతోంది. ఈ చిత్రం లో హీరోయిన్ గా కియారా అద్వానీ నటిస్తోన్న సంగతి తెలిసిందే.

ప్రస్తుతం బాలీవుడ్ లో మోస్ట్ క్రేజీ హీరోయిన్స్ లో ఒకరిగా కియారా వెలుగొందుతోంది. తెలుగు లో ఈమె 'భరత్ అనే నేను', 'వినయ విధేయ రామ' సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. ఒక పక్క స్టార్ హీరోయిన్ గా కొనసాగుతూ సిద్దార్థ్ మల్హోత్రా అనే బాలీవుడ్ స్టార్ హీరోని ప్రేమించి పెళ్లాడింది. ఇటీవలే ఆయన కియారా తో కలిసి 'గేమ్ చేంజర్' మూవీ షూటింగ్ కి వచ్చాడంట.
ఆ రోజు కియారా తో రామ్ చరణ్ కి లిప్ కిస్ ఇవ్వాల్సిన సన్నివేశాన్ని చిత్రీకరించబోతున్నారు. మీ ఆయన ముందు అలాంటి సన్నివేశాలు చేస్తే ఫర్వాలేదా నీకు అని కియారాను రామ్ చరణ్ అడిగాడంట. ఇలాంటి సన్నివేశం లో నేను తడబడితే సిద్దార్థ్ నన్ను ప్రోత్సహించి ధైర్యం గా చెయ్యమంటాడని చెప్పింది. అప్పుడు ఆరోజు సిద్దార్థ్ ముందే రామ్ చరణ్ - కియారా అద్వానీ లిప్ కిస్ సన్నివేశాన్ని షూట్ చేశారు.












Click it and Unblock the Notifications