ఆస్కార్స్ యాక్టర్స్ బ్రాంచ్‌లో రామ్‌చ‌ర‌ణ్‌.. పండ‌గ చేసుకుంటున్న అభిమానులు...

ఆర్ఆర్ఆర్ సినిమాతో టాలీవుడ్ అగ్ర‌న‌టుడు రామ్‌చ‌ర‌ణ్ ప్రపంచస్థాయికి ఎదిగాడు. ఈ సినిమా హాలీవుడ్ లో ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసిందో అంద‌రికి తెలిసిందే. ఈ సినిమాతో జూనియ‌ర్ ఎన్‌టిఆర్, రామ్ చరణ్ చేసిన ప్ర‌పంచ‌స్థాయి గుర్తింపును పొందారు. ఈ సినిమాలోని 'నాటు నాటు'కు ఒరిజినల్ స్కోర్ విభాగంలో ఆస్కార్ దక్కిన విషయం అంద‌రికి తెలిసిందే. అలాగే అకాడమీ నుంచి ప్రైడ్ ఆఫ్ తెలుగు, మ్యాన్ ఆఫ్ మాసెస్ వంటి ఘ‌న‌త‌లు ఎన్‌టిఆర్‌ను వ‌రించాయి. దీ అకాడమీలోని ప్రతిష్టాత్మకైన యాక్టర్స్ బ్రాంచ్‌లో మెంబ‌ర్‌గా జూనియ‌ర్ ఎన్‌టిఆర్ చేరిపోయారు. ఇప్పుడు అకాడమీ నుంచి లేటెస్ట్ గా విడుదలైన యాక్టర్స్ బ్రాంచ్ కొత్త జాబితాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పేరును కూడా అనౌన్స్ చేసింది. ఇది రామ్‌చ‌ర‌ణ్ అభిమానుల‌కు ఒక పండ‌గ‌లాంటి వార్త అనే చెప్పుకోవాలి.

ది అకాడ‌మీలో రామ్‌చ‌ర‌ణ్‌ పేరు : టాలీవుడ్ అగ్రనటుడు రామ్ చరణ్ ఖాతాలో మరో ఘనత చేరింది. ఆస్కార్ అకాడమీ విడుదల చేసిన నటుల జాబితాలో రామ్‌చ‌ర‌ణ్‌కు చోటు లభించింది. దీంతో ఆయన అభిమానులు సంతోషంలో మునిగిపోతూ ఎక్స్‌లో పోస్ట్‌లు పెడుతున్నారు. నటనలో అంకితభావం, ప్రామాణికతతో ఈ నటులు మన హృదయాలపై చెరగని ముద్ర వేశారని ది అకాడ‌మీ పేర్కొంది. నటనలో వారి నైపుణ్యం సాధారణ క్షణాలను అసాధార అనుభవంగా మారుస్తుందని ఈ సంద‌ర్భంగా ది అకాడ‌మీ ప్రశంసించింది. అకాడమీలోకి మరికొందరు నటులను సాదరంగా ఆహ్వానిస్తున్నట్టు పేర్కొంది.

Ramcharan in the Oscars Actors Branch...Celebrating fans...

ది అకాడమీ విడుదల చేసిన జాబితాలో లషన లించ్, రామ్ చరణ్, విక్కీ క్రీప్స్, లూయిస్ కో టిన్ లోక్, కేకే పామెర్, చాంగ్ చెన్, సకురా అండో, రాబర్ట్ డావి ఉన్నారు. అకాడమీ బ్రాంచ్‌లోకి వీరిని ఆహ్వానిస్తున్నందుకు సంతోషంగా ఉందని చెప్పింది. ఈ జాబితాలో పలువురు హాలీవుడ్ యాక్టర్స్ పేర్లు కూడా ఉండటం విశేషం. ప్ర‌స్తుతం రామ్ చరణ్ కుటుంబంతో ఇటలీలో ఉన్నారు. వరుణ్ తేజ్ - లావణ్య త్రిపాఠి పెళ్లి సంద‌ర్భంగా మెగా కుటుంబ‌స‌భ్యలంతా ఇట‌లీకి వెళ్లారు. రామ్‌చ‌ర‌ణ్ ప్ర‌స్తుతం 'గేమ్ ఛేంజర్'సినిమా లో నటిస్తున్నారు. ఈ సినిమా ఫ‌స్ట్ సింగిల్ దీపావళి కానుకగా రాబోతున్న‌ట్లు ఇప్ప‌టికే మూవీ మేక‌ర్స్ ప్ర‌క‌టించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+