ఉపాసన ఎమోషనల్ పోస్ట్... మురిసిపోతున్న మెగా ఫ్యామిలీ
రామ్ చరణ్ - ఉపాసన దంపతుల గురించి అందరికీ తెలిసిందే. మెగా హీరో వారసత్వాన్ని నిలబెడుతూ గ్లోబల్ స్టార్ గా, పాన్ ఇండియా స్థాయిలో సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు చెర్రీ. ప్రస్తుతం బుచ్చిబాబు దర్శకత్వంలో పెద్ది సినిమా చేస్తున్నారు. అలాగే ఉపాసన అపోలో ఆసుపత్రి డైరెక్టర్ గా, ఒక మ్యాగజైన్ నిర్వాహకురాలిగా, యూట్యూబ్ ఛానెల్ యజమానిగా వివిధ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇద్దరూ పలురకాల ఈవెంట్స్ కు హాజరవుతుంటారు. ఉపాసన సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉంటుంటారు. ఎప్పటికప్పుడు వివిధ విషయాలను అప్ డేట్ చేస్తూ తన ఫాలోవర్స్ తో టచ్ లో ఉంటారు. తన కుటుంబానికి సంబంధించిన అనేక విషయాలను వారితో పంచుకుంటుంటారు.
ట్విటర్ లో షేర్ చేసిన ఉపాసన
తాజాగా ఓ ఆసక్తికరమైన పోస్ట్ ను ఉపాసన షేర్ చేశారు. ఈనెల 27వ తేదీన రామ్ చరణ్ పుట్టినరోజు వేడుక జరిగిన సంగతి అందరికీ తెలిసిందే. హీరోలంతా శుభాకాంక్షలు తెలియజేస్తూ పోస్టులు పెట్టారు. అల్లు అర్జున్ మాత్రం పెట్టలేదు. మెగా కుటుంబ సభ్యులతోపాటు అభిమానులంతా చెర్రీకి శుభాకాంక్షలు తెలియజేశారు. పలుచోట్ల రక్తదానాలు, అన్నదానాలు చేయడంతోపాటు కేకులు కట్ చేసి ఆనందోత్సాహలతో చెర్రీ పుట్టినరోజు వేడుకలను నిర్వహించారు. చెర్రీని కలిసిన సెలబ్రిటీలకు సంబంధించిన ఫొటోలను ట్విటర్ లో షేర్ చేసింది.

భావోద్వేగంతో కూడి ఎమోజీని...
మార్చి 27వ తేదీన ఇంత ప్రత్యేకమైన రోజుగా చేసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసింది. వారందరికీ ఎప్పటికీ కృతజ్ఞతలతో ఉంటామంటూ భావోద్వేగానికి సంబంధించిన ఎమోజీని షేర్ చేసింది. ప్రస్తుతం ఉపాసన చేసిన పోస్టు సోషల్ మీడియాలో వైరలవుతోంది. మెగాస్టార్ చిరంజీవి కుటుంబ సభ్యులంతా తమ కోడలిని చూసి గర్వపడుతున్నారు. అందరితో కలివిడిగా ఉండటమే కాకుండా ఆపదలో ఉన్నవారందరికీ సాయం చేస్తుందంటూ మురిసిపోతున్నారు. రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా పెద్ది చిత్రం నుంచి విడుదల చేసిన పోస్టర్ విపరీతంగా అభిమానులను ఆకట్టుకుంటోంది. భారీగా గెడ్డం పెంచి, నోట్లో చుట్టతో చాలా రఫ్ గా ఉన్న రామ్ చరణ్ ను చూసిన అభిమానులంతా తమకు ఇలాంటిదే కావాలని, ఈ తరహా సినిమాలే తమకు కావాలంటూ కామెంట్లు పెడుతున్నారు. వచ్చే ఏడాది ఈ సినిమాను విడుదల చేయనున్నారు. మైత్రీ మూవీస్ పతాకంపై ఈ సినిమా నిర్మితమవుతోంది. సుకుమార్ రైటింగ్స్ కూడా ఓ భాగస్వామిగా వ్యవహరిస్తోంది. సుకుమార్ శిష్యుడు సానా బుచ్చిబాబు దర్శకత్వం వహిస్తుండగా, ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని అందిస్తున్నారు.












Click it and Unblock the Notifications