ఉపాసన పేరుమీద ఉన్న ఆస్తుల విలువ తెలుసా?
ఉపాసన అనే పేరు గురించి తెలుగువారికి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అపోలో గ్రూపు ఆసుపత్రి చైర్మన్ ప్రతాప్ సి.రెడ్డికి మనవరాలు అవుతుంది. మెగాస్టార్ చిరంజీవికి కోడలు అవుతుంది. మెగా పవర్ స్టార్ రామచరణ్ భార్య అయిన ఉపాసన సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటారు. అందరికీ సేవ చేయాలి అనే మనస్తత్వం ఎక్కువ. సాధ్యమైనంత వరకు తరుచుగా సేవా కార్యక్రమాలను నిర్వహిస్తుంటుంది.
మెగా ఇంటిలో ఏ పండగ ఉన్నా, వేడుక జరిగినా అన్నీ దగ్గరుండి చూసుకుంటారు. క్లీంకార పుట్టిన తర్వాతే చిరంజీవికి పద్మవిభూషణ్ వచ్చిందని, అలాగే వరుణ్ తేజ్ - లావణ్య త్రిపాఠి పెళ్లి జరిగిందని, రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ గా కీర్తిప్రతిష్టలు కలుగుతున్నాయంటారు. ఉపాసన కొణిదెల పేరు మీద ఎన్ని వేల కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయో తెలిస్తే అందరూ షాకవ్వాల్సిందే. తాజాగా ఓ సంస్థ నివేదిక ప్రకారం ఆమె పేరుపై రూ.1,130 కోట్ల ఆస్తులు ఉన్నాయి. ఒకవైపు తన బాధ్యతలు నిర్వహిస్తూనే మరోవైపు తన వ్యాపారాలను కూడా చూసుకుంటోంది.

ఇటీవలే రామ్ చరణ్ - ఉపాసన దంపతులు ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ వివాహ వేడుకకు హాజరయ్యారు. తెలుగు పరిశ్రమ నుంచి రామ్ చరణ్ ఒక్కడికే ఆహ్వానం అందించింది. ప్రైవేట్ జెట్ లో భార్యాభర్తలిద్దరూ వేడుకలకు హాజరయ్యారు. ఈ వేడుకల్లోనే సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్, షారుక్ ఖాన్ తో కలిసి నాటు నాటు పాటకు చెర్రీ స్టెప్పులేశారు. అలా స్టెప్పులేసినందుకు ముఖేష్ అంబానీ నుంచి రెమ్యునరేషన్ అందుకున్నారంటూ సోషల్ మీడియాలో వార్త వైరల్ గా మారగా అది సరికాదంటూ అభిమానులు ఆ వార్తను కొట్టేశారు. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ ఓ సినిమా చేస్తున్నారు. మరోవైపు బుచ్చిబాబు దర్శకత్వంలో చేయబోతున్న సినిమాకు సంబంధించి పనులన్నీ పూర్తవుతున్నాయి. అధికారికంగా ఈ సినిమా షూటింగ్ అతి త్వరలోనే ప్రారంభం కాబోతోంది.












Click it and Unblock the Notifications