పచ్చళ్ల పాప "రమ్య మోక్ష" వీడియో వైరల్..!
సోషల్ మీడియా పుణ్యమా అని ఇటీవల కాలంలో బాగా పాపులర్ అయిన పేరు "అలేఖ్య చిట్టి పికిల్స్". కాంచర్ల అలేఖ్య అనే యువతి నిర్వహిస్తున్న పికిల్స్ వ్యాపారం గురించి అందరికీ తెలిసిందే. వీళ్లు వివిధ రకాల పచ్చళ్లను తయారుచేసి ఆన్ లైన్ లో విక్రయిస్తుంటారు. ఇన్ స్టా వేదికగా ముగ్గురు అక్కా చెల్లెళ్లు కలిసి ప్రారంభించిన ఈ పికిల్స్ వ్యాపారం బాగా సక్సెస్ అయి అందరికీ రీచ్ అయింది. అయితే కస్టమర్స్ తో దురుసుగా మాట్లాడిన ఆడియో వైరల్ కావడం తెలిసిందే. దాంతో వ్యాపారం కుదేలు అవ్వడం.. ఆ తర్వాత ఎట్టకేలకు సద్దుమణిగింది. దీంతో మళ్లీ ఈ అక్కా చెల్లెళ్లు పికిల్స్ వ్యాపారం ప్రారంభించారు.
ఇక ఈ ముగ్గురిలో హీరోయిన్ లుక్స్ కు ఏమాత్రం తక్కువ కాకుండా ఉండే రమ్య గురించి కూడా కొత్తగా పరిచయం అక్కర్లేదు. బిగ్ బాస్ ద్వారా ప్రేక్షకులకు పరిచయమైన Ramya Moksha తక్కువ కాలంలోనే సోషల్ మీడియాలో భారీ క్రేజ్ సంపాదించుకుంది. Bigg Boss Telugu వేదికపై తన స్ట్రెయిట్ ఫార్వర్డ్ నేచర్, ఎమోషనల్ ఎక్స్‌ప్రెషన్స్, ధైర్యవంతమైన వ్యాఖ్యలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. షోలో ఆమె ప్రవర్తన, తాను అనుకున్నది బహిరంగంగా చెప్పే తత్వం ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. అయితే తక్కువ రోజుల్లోనే షో నుంచి ఎలిమినేట్ అయ్యింది.

కాగా బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత రమ్య మోక్ష సోషల్ మీడియాలో మరింత యాక్టివ్ అయ్యింది. ఇన్‌స్టాగ్రామ్, రీల్స్, షార్ట్ వీడియోల ద్వారా ఆమె తన ఫాలోవర్స్‌తో నిరంతరం టచ్‌లో ఉంటోంది. స్టైలిష్ ఫోటోషూట్స్, లైఫ్ స్టైల్ పోస్టులు.. ఇలా విభిన్నమైన కంటెంట్‌ను పంచుకుంటూ యువతలో మంచి ఫాలోయింగ్ సంపాదించింది. ఆమె పోస్ట్ చేసే ప్రతి ఫోటో, వీడియోకి వేలల్లో లైక్స్, కామెంట్స్ వస్తుండటం ఆమె క్రేజ్‌కు నిదర్శనం.
ఇప్పుడు లేటెస్ట్ గా మరో అమ్మాయితో కలిసి ఈమె చేసిన డాన్స్ వీడియో ఫుల్ వైరల్ అవుతోంది. చీర కట్టులోనే ఉన్నా కానీ అందాలను ఆరబోస్తూ అదిరిపోయే స్టెప్పులతొ అలరించారు. దాంతో ఈ వీడియో నెట్టింట ఫుల్ ట్రెండ్ అవుతోంది. కొందరు ఈ వీడియోకి సూపర్ అంటూ కామెంట్స్ చేస్తుంటే మరికొందరు మాత్రం నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు.
That backstep was 🌚👀👀 pic.twitter.com/clLa79q6zS
— 𝗦𝗮𝗸𝘁𝗵𝗶𝘃𝗲𝗹 (@SakthivelBca) March 3, 2026












Click it and Unblock the Notifications