Rana Daggubati: ఆ స్టార్ హీరోలతో రానాకు విబేధాలు..?
సాధారణంగా ఫిల్మ్ ఇండస్ట్రీలో హీరోల మధ్య కొద్ది పాటి విబేధాలు ఉండటం సహజమే. ఒక హీరోకు సంబంధించిన అభిమానులు మరో హీరోకు సంబంధించిన అభిమానుల మధ్య ఎప్పుడూ ఫ్యాన్ వార్ నడుస్తూనే ఉంటుంది. ఇది కొత్త కాదు.అయితే టాలీవుడ్‌లో హీరోలు పైకి కలిసే ఉన్నామని కలరింగ్ ఇస్తున్నప్పటికీ వాళ్లలో కూడా విబేధాలు తారాస్థాయిలో ఉంటాయనేది ఫిల్మ్‌నగర్ టాక్. తాజాగా రానా దగ్గుబాటి-రాంచరణ్-అల్లు అర్జున్‌ల మధ్య ఈగో క్లాష్ వచ్చిందనే వార్త ప్రచారంలో ఉంది. ఇది ఎంతవరకు నిజమో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.
రానా దగ్గుబాటి.. సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఏర్పరచుకున్నాడు. తను ఎలాంటి నటుడో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. తాను చేసిన సినిమాలు అందులోని పాత్రలే రానా యాక్టింగ్ స్కిల్స్ గురించి చెబుతాయి. అంతేకాదు చాలామంది ప్రేక్షకులు రానా నటనకు ఫిదా అయ్యారు కూడా. 2010లో రానా డెబ్యూ మూవీ లీడర్ చిత్రం ఎలాంటి సంచలనాలు క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఇప్పటికీ ఆ చిత్రం గురించి వింటూనే ఉంటాం. తెలుగు సినిమా చరిత్రలో లీడర్ చిత్రం అలా నిలిచిపోతుందంతే.

ఇక రానా వ్యక్తిగత విషయానికి వస్తే తాను సినిమా ఇండస్ట్రీలో ఉన్న ఇతర హీరోలతో చాలా సన్నిహితంగా కనినిస్తారు. మంచి రిలేషన్ మెయిన్‌టెయిన్ చేస్తాడు. ముఖ్యంగా పాన్ ఇండియా స్టార్స్‌గా పిలువబడే రాంచరణ్, అల్లు అర్జున్‌తో రానా బాండింగే వేరు.అంతేకాదు ఒకరి సినిమాలను ఒకరు ప్రమోట్ చేసేందుకు ఈ త్రయం ఎప్పుడూ ముందుంటుంది.అయితే తొలినాళ్లలో రానా-రాంచరణ్-అల్లు అర్జున్‌ల మధ్య విబేధాలు ఉండేవనే విషయం తెలుసా..
ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రానా దగ్గుబాటిని అక్కడి హోస్ట్ ఓ ప్రశ్న అడిగారు. అల్లు అర్జున్, రాంచరణ్‌లతో ఏమైనా ఈగో క్లాషెస్ లేదా అభద్రతా భావం మీలో ఉందా అని రానాను ప్రశ్నించారు. ఇందుకు రానా చిరునవ్వుతో సమాధానం చెప్పాడు. "ముగ్గురం ఒకేలా ఉండలేం. ఒకే సినిమా లేదా ఒకే కాన్సెప్ట్ పై సినిమాలు చేయడం లేదు. ఎవరికి వారం డిఫరెంట్ జార్నర్‌లో సినిమాలు ఎంపిక చేసుకుని చేస్తున్నాం.ఎవరి సక్సెస్ వారికుంది.అయితే కేవలం బాక్సాఫీస్ వద్ద వచ్చే నెంబర్ల ఆధారంగా ముగ్గురిని పోల్చి చూడటం తగదు.అయితే మిగితా అంశాల కూడా బేరీజు వేయాల్సిందే " అని రానా అన్నారు.
ఇక ఒక సినిమా రిలీజ్ అయిన తర్వాత 30 -40 రోజులకు ఆ సినిమా మేకింగ్ గురించి చర్చ జరుగుతుంది. ఇది చాలా ఉపయోగపడుతుందని రానా అన్నారు. ఏ హీరో సినిమా అయినా సరే దానిపై చర్చ జరుగుతుంది. అందులోని లోటుపాట్లను సైతం చర్చించడం జరుగుతుందని అంత మాత్రానా మా మధ్య విబేధాలున్నట్లు కాదని రానా తేల్చి చెప్పారు.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications