గుండెల్ని పిండేసిన రానా

ఇటీవల కొంతకాలం అనారోగ్యంతో సినిమాలకు విరామం ప్రకటించిన రానా ఇప్పుడిప్పుడే బిజీ అవుతున్నాడు. ప్రస్తుతానికి ఏ సినిమాలోను నటించనప్పటికీ నిర్మాతగా సినిమాలను ప్రమోట్ చేస్తున్నాడు. అందరు హీరోల్లా కాకుండా భిన్నంగా ఉండే కథలను ఎంచుకుంటూ విభిన్నంగా నటిస్తుంటాడు రానా. రెండు సంవత్సరాల క్రితం విడుదలైన విరాటపర్వం సినిమా తర్వాత తిరిగి వెండితెరపై కనిపించలేదు. తర్వాత తన బాబాయి వెంకటేష్ తో కలిసి రానా నాయుడు అనే వెబ్ సిరీస్ చేశారు. ప్రస్తుతానికి నిర్మాతగా బిజీ అయ్యాడు.

అమెరికాలో ఎంజాయ్ చేస్తూ..
వ్యక్తిగతంగా రానా చాలా సరదాగా ఉంటాడని అతడి సన్నిహితులు, దగ్గరివారు చెబుతుంటారు. అందుకు అద్దంపట్లే మరో సంఘటన జరిగింది. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరలవుతోంది. దీన్ని వీక్షించినవారంతా రానా మరోసారి అభిమానుల గుండెల్ని పిండేశాడంటూ మాట్లాడుకుంటున్నారు. సెలవులు గడపడానికి అమెరికా వెళ్లిన రానా అక్కడ అందమైన ప్రదేశాలను తిలకిస్తున్నారు. చికాగోకు కారులో వెళుతుండగా ఓ అభిమాని కూడా కారులో వెళుతూ రానాను చూశాడు. వెంటనే సంతోషంగా హాయ్ చెప్పగా.. రానా కూడా తిరిగి హాయ్ చెప్పాడు.

rana daggubati latest news on trending in Social media

గట్టిగా కౌగిలించుకొని ఆనందం
కారులో నుంచే ఆ అభిమాని తనకు ఆటోగ్రాఫ్ కావాలని రానాను కోరాడు. దీంతో రానా వెంటనే కారును పక్కనే ఆపి అభిమానికి, అతడి కుటుంబానికి అందరికీ ఆటోగ్రాఫ్స్ ఇచ్చాడు. ఆ అభిమాని రానాను గట్టిగా కౌగిలించుకొని ఆనందాన్ని వ్యక్తం చేశాడు. తాను వేసుకున్న చొక్కా ఎడమ భాగంపై ఆటోగ్రాఫ్ చేయించుకున్నాడు. దీంతోపాటు కారుపై కూడా ఆటోగ్రాఫ్ ఇవ్వాలని కోరగా రానా అలాగే చేశాడు. అభిమానితోపాటు అతడి కుటుంబ సభ్యులందరితో కలిసి ఫొటో దిగాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో నెటిజన్లంతా అభిమానుల మనసును మరోసారి దోచుకున్నావని, గుండెల్ని పిండేశావంటూ పోస్టులు పెడుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+