ఆలియా భట్ నా మొదటి భార్య కాదు.. రణ్ బీర్ సంచలన వ్యాఖ్యలు..
బాలీవుడ్ లో మోస్ట్ రొమాంటిక్ లవర్ బాయ్ గా స్టార్ యాక్టర్ రణ్ బీర్ కపూర్ గుర్తింపు సంపాదించాడు. కత్రినా కైఫ్, దీపికా పదుకొణెలతో ప్రేమాయణం సాగించినా పెళ్లి వరకు ఈ వ్యవహారాన్ని తీసుకురాలేదు. ఆ తర్వాత 2018 నుంచి ఆలియా భట్, రణ్ బీర్ కపూర్ లు ప్రేమలో ఉన్నారు. వీరి వివాహం 2022, ఏప్రిల్ 14న జరిగింది. ఈ జంటకు 2022 నవంబర్ 6న ఓ బిడ్డ జన్మించింది. ఆమెకు రాహా అని నామకరణం చేశారు.
అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన రణ్ బీర్ కపూర్.. ఆలియా భట్ తన మొదటి భార్య కాదని సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అయ్యాయి. ఈ ఇంటర్వ్యూలో తనకు అంతకుముందే వివాహం జరిగిందని.. కానీ అది ఎవరూ ఊహించని విధంగా జరిగిందని చెప్పుకొచ్చాడు. తాను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో పరిచయం ఏర్పడిన ఓ అమ్మాయి గురించి ఈ ఇంటర్వ్యూలో వెల్లడించాడు రణ్ బీర్.

" ఈ విషయాన్ని నెగెటివ్ పద్ధతిలో తీసుకోవద్దు. నేను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో నాకు గుర్తుంది. ఓ అమ్మాయి ఒక పురోహితుడితో నా ఇంటి ముందుకు వచ్చి నా గేట్ ను పెళ్లిచేసుకుంది. గేటుకు తిలకం దిద్ది.. పూలమాల వేసింది. నేను అప్పుడు వేరే ప్రేస్ లో ఉన్నాను. ఇదో క్రేజీ ఐడియా అని నాకు అనిపిస్తుంది. ఆ తర్వాత నాకు వాచ్ మెన్ ఈ విషయాన్ని చెప్పాడు. నేను ఆమెను ఇప్పటివరకూ చూడలేదు. ఆమె నా ఫస్ట్ వైఫ్ లా అనిపించింది. త్వరలో ఆమెను చూస్తానేమో" అని రణ్ బీర్ కపూర్ వెల్లడించాడు. ఆ ఆగంతకురాలిని రణ్ బీర్ ఇప్పటికీ కలవకపోయినా.. ఆమెనే తన ఫస్ట్ వైఫ్ అని ఫన్నీగా చెప్తున్నాడు. దీంతో ఈ వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి.
ఇక రణ్ బీర్ కపూర్ యానిమల్ మూవీతో పెద్ద హిట్ కొట్టాడు. టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ప్రస్తుతం నీతిశ్ కుమార్ డైరెక్షన్ లో రామాయణం మూవీ చేస్తున్నారు. అంతేకాక బ్రహ్మాస్త్ర 2 లోనూ నటిస్తున్నారు.












Click it and Unblock the Notifications