ఆ తెలుగు హీరో కామ పిశాచి.. హీరోయిన్ సంచలన కామెంట్స్
ప్రతి ఇండస్ట్రీల్లోనూ మహిళలకు వేధింపులు తప్పడం లేదు. పని చేసే ప్రతిచోట అమ్మాయిలు అభద్రతా భావంతో ఉన్నారని ఇటీవల ఓ సర్వేలో తేలింది. ఇక
సినిమా ఇండస్ట్రీలో లైంగిక వేధింపుల గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఉందని చాలామంది బహిరంగంగానే వెల్లడించారు. తమకు ఎదురైన లైంగిక వేధింపులు ,కాస్టింగ్ కౌచ్, కమింట్మెంట్‌ల గురించి హీరోయిన్లు, క్యారెక్టర్ ఆర్టిస్టులు ఇటీవల పలు సందర్భాల్లో వెల్లడిస్తున్నారు. తాజాగా ఓ హీరోయిన్ తనకు ఎదురైన లైంగిక వేధింపులు గురించి బహిరంగంగా వెల్లడించారు.
'రంగం' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడైన తమిళ నటుడు అజ్మల్ అమీర్ ప్రస్తుతం తమిళ సినీ పరిశ్రమలో సంచలనాలకు కేంద్ర బిందువుగా మారారు.తమిళ నటి నర్విని దేవి రంగంలోకి దిగి అజ్మల్‌పై సంచలన ఆరోపణలు చేసింది. అజ్మల్‌లో దుర్మార్గమైన ఆలోచనలు ఉన్నాయని, గతంలో తాను ఆయన దురాగతాలను బహిరంగంగా వెల్లడించానని ఆమె ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.

నర్విని దేవి 2018లో జరిగిన ఒక భయంకరమైన అనుభవాన్ని పంచుకున్నారు. అప్పట్లో తాను ఒక సినిమాలో నటిస్తున్నప్పుడు చెన్నైలోని ఒక మాల్‌లో అజ్మల్‌ను కలిశానని, తన స్నేహితుడి ద్వారా పరిచయం పెరిగిందని ఆమె తెలిపారు. అజ్మల్ తన తదుపరి సినిమాకు హీరోయిన్ కోసం చూస్తున్నట్లు చెప్పడంతో, కొద్ది రోజులు వీరి మధ్య ఫోన్ సంభాషణలు నడిచాయి.
ఒకరోజు అజ్మల్ ఆమెను ఆడిషన్ కోసం పిలవగా, తాను వెంటనే డెన్మార్క్ వెళ్లాల్సి ఉందని నర్విని చెప్పారు. ఆడిషన్, నిర్ణయం ఒకే రోజులో జరిగిపోతుందని అజ్మల్ హామీ ఇవ్వడంతో ఆమె ఒంటరిగానే ఆడిషన్‌కు వెళ్లారు.కాసేపు నర్విని వాష్‌రూమ్‌లో ఉండగా, బయటకు రాగానే అజ్మల్ సంగీతం పెట్టి, ఆమె చేయి పట్టుకుని "మనం డ్యాన్స్ చేద్దాం" అని బలవంతం చేశాడట. ఆమె అతడిని దూరంగా నెట్టివేయడంతో, అజ్మల్ "నువ్వు చాలా అందంగా ఉన్నావు, నా కోసం ఎంతమంది అమ్మాయిలు పడి చస్తారో తెలుసా?" అంటూ అసభ్యంగా మాట్లాడాడు. అదృష్టవశాత్తూ, ఆ సమయంలో రూమ్ బాయ్ వచ్చి డోర్ తీయడంతో నర్విని వెంటనే అక్కడి నుంచి పారిపోగలిగింది.
ఈ షాకింగ్ ఘటన తర్వాత కూడా అజ్మల్ తనకు మెసేజ్‌లు పంపించాడని, అయితే తన చదువు, కెరీర్ ముఖ్యమని భావించి అప్పట్లో కేసు పెట్టలేదని నర్విని దేవి పేర్కొన్నారు. ఈ నటి సంచలన ఆరోపణలతో అజ్మల్ అమీర్ వ్యవహారం ఇప్పుడు తమిళ, తెలుగు సినీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది.












Click it and Unblock the Notifications