అతనితో పిల్లల్ని కనాలని ట్రై చేశా..నా ప్లాన్ వర్కౌట్ కాలేదు - స్టార్ హీరోయిన్
సినీ నటుల జీవితాలు పైకి బాగానే కనిపిస్తాయి. కానీ తెర వెనుక వారి జీవితాల్లో కూడా ఎన్నో కష్టాలు,సమస్యలు ఉంటాయనే విషయం చాలామందికి తెలియదు. బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా వెలిగిన రాణి ముఖర్జీ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తన జీవితంలో ఉన్న విషాదం గురించి వెల్లడించింది. 1990ల్లో బాలీవుడ్‌లో రాణి ముఖర్జీ స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగారు. సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్ వంటి స్టార్ హీరోస్ సరసన నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. కెరీర్ పిక్ టైంలో ఉండగానే నిర్మాత ఆదిత్య చోప్రాను పెళ్లాడింది. పెళ్లి తర్వాత రాణి ముఖర్జీ సినిమాలకు దూరంగా ఉంటోంది.
రాణి ముఖర్జీ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఏడేళ్లుగా తాను మనసులో ఉన్న విషాదాన్ని చెప్పుకుని బాధపడింది. దాదాపు ఏడేళ్లుగా తాను రెండవ బిడ్డ కోసం ప్రయత్నిస్తున్నానని.. కానీ ఇప్పటికీ అది సాధ్యం కావడం లేదని ఆమె తెలిపింది. నా కుమార్తెకు ఇప్పుడు ఎనిమిదేళ్లు. ఆమెకు ఒకటిన్నర వయసు ఉన్నప్పుడు నుంచి రెండవ బిడ్డ కోసం ప్రయత్నించాను.. కానీ కుదరలేదు. గతంలో మరోసారి ప్రెగ్నెంట్ అయ్యాను. కానీ ఆ సంతోషం ఎక్కువ రోజులు ఉండలేదు. నాకు గర్భస్రావం జరిగింది. దీంతో కడుపులోనే రెండో బిడ్డను కోల్పోయానంటూ బాధపడింది.

ఇప్పుడు నా వయసు 46 సంవత్సరాలు. ఇప్పుడు నేను బిడ్డను కనే పరిస్థితిలో లేను. నా కుమార్తెకు.. చెల్లిని, లేదా తమ్ముడిని ఇవ్వలేకపోయాననే బాధ ఇప్పటికీ వేధిస్తుంది. కానీ మనకు లభించిన దానితో మనం ఎప్పుడూ సంతోషంగా ఉండాలనే విషయాన్ని తెలుసుకున్నాను. నా కూతురుతో నేను చాలా సంతోషంగా ఉన్నాను. బిడ్డను కనే వయసు దాటిపోయాను. ఇప్పుడు నాకు నా కూతురు అధిర ఒక్కరు చాలు అంటూ చెప్పుకొచ్చింది. కానీ తన మొదటి బిడ్డకు తోబుట్టువులను ఇవ్వలేకపోయాయనే బాధ ఎప్పటికీ ఉంటుందని రాణి ముఖర్జీ తెలిపింది
-
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
భారీగా ఆస్తులు కూడబెట్టిన త్రిష.. తమిళనాడు ఎన్నికల నేపథ్యంలో వీటిపై తీవ్ర చర్చ -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్‌పోర్ట్‌లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
విజయ్ పార్టీకి త్రిష శాపం? రెండు చోట్ల ఓటమి ఖాయం! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా?












Click it and Unblock the Notifications