బాలీవుడ్ మూవీకి బిగ్ షాక్.. ఆరు దేశాల్లో బ్యాన్ !!!
బాలీవుడ్ స్టార్ హీరో రణ్ వీర్ సింగ్ హీరోగా.. నాన్న మూవీ ఛైల్డ్ ఆర్టిస్ట్ సారా అర్జున్ హీరోయిన్ గా వచ్చిన మూవీ "ధురంధర్". ఆదిత్యధర్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో మాధవన్, అక్షయ్ ఖన్నా కీలక పాత్రల్లో నటించారు. రణ్‌వీర్ సింగ్ కెరీర్‌లో మరో భారీ హిట్ గా నిలిచిన ఈ చిత్రం.. థియేటర్లలో కలెక్షన్లు కుమ్మరిస్తుంది. డిసెంబర్ 5న విడుదలైన ఈ మూవీ మొదటి రోజు నుంచే మాస్ ఆడియన్స్‌ను మెప్పిస్తూ పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది.
కేవలం ఆరు రోజుల్లోనే రూ.180 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు సాధించి రూ.200 కోట్ల క్లబ్‌లోకి ప్రవేశించేందుకు రెడీగా ఉంది. రణ్‌వీర్ ఎనర్జిటిక్ పర్ఫామెన్స్ కి తోడు.. మాధవన్, అక్షయ్ ఖన్నా స్క్రీన్ ప్రెజెన్స్‌తో సినిమాను బ్లాక్‌బస్టర్ గా నిలిపాయని అంటున్నారు. అయితే ప్రేక్షకుల్లో ఒక వర్గం ఈ చిత్రంపై ప్రశంసలు కురిపిస్తుంటే.. మరో వర్గం మాత్రం హింసాత్మక ట్రీట్‌మెంట్‌పై విమర్శలు చేస్తున్నారు. గత కొంతకాలంగా హిందీలో సినిమాలు ఆశించిన స్థాయిలో సాకేశ్ కాలేకపోతున్నాయి.

ఈ తరుణంలోనే ఈ సినిమా మంచి హిట్ కొట్టడం అందరికీ మంచి శుభ పరిణామం లాగా అనిపిస్తుంది. మొత్తంగా ఈ మూవీ విజయం బాలీవుడ్‌కి మళ్లీ ఊపిరి పోసిందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కానీ ఇప్పుడు అనూహ్యంగా ఈ మూవీకి బిగ్ షాక్ తగిలింది. ఈ చిత్రాన్ని ఆరు గల్ఫ్ దేశాల్లో పూర్తిగా బ్యాన్ చేసినట్లు సమాచారం అందుతోంది.
బహ్రెయిన్, కువైట్, ఒమన్, ఖతార్, సౌదీ అరేబియా, యూఏఈ.. ఇలా ఆరు దేశాల్లో సినిమా ప్రదర్శనకు బ్రేక్ పడిందని అంటున్నారు. ఇందుకు సంబంధించి పలువురు సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెట్టడంతో విషయం హాట్ టాపిక్ గా మారింది. నిర్మాతలు తమ వంతుగా చేసిన ప్రయత్నాలు సైతం ఫలించలేదని తెలుస్తోంది. మూవీ మంచి విజయాన్ని దక్కించుకుంటున్న సమయంలో ఈ షాకింగ్ ఘటన బయటకు రావడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
కారణం అదేనా..?
కాగా ఈ బ్యాన్‌కి ప్రధాన కారణం సినిమాలో చూపించిన పాకిస్థాన్ వ్యతిరేక ప్రెజెంటేషన్ అని అభిప్రాయం వ్యక్తం అవుతోంది. పాకిస్థాన్, టెర్రరిజం సహా పలు యాక్షన్ ఎపిసోడ్స్‌లో రాజకీయ సంకేతాలు గల్ఫ్ దేశాల్లో సినిమా పూర్తిగా ఆగిపోవడానికి కారణాలుగా బాలీవుడ్ ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. హిందీ సినిమాలకు గల్ఫ్ దేశాల్లో మంచి క్రేజ్ ఉంటుంది. అందుకు తగ్గట్టే కలెక్షన్స్ కూడా ఉంటాయి. ఈ ఎఫెక్ట్ తో కలెక్షన్స్ కి బ్రేక్ పడే అవకాశం కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications