'రావు బహదూర్' మూవీ రివ్యూ.. గుర్తుండిపోయే సినిమా గురూ !!

విభిన్న కథలతో తెలుగు ప్రేక్షకుల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు వెంకటేష్ మహా.. ప్రతి సినిమాతో తన నటనకు కొత్త కోణాలు చూపించే సత్యదేవ్ కాంబినేషన్‌లో తెరకెక్కిన తాజా చిత్రం 'రావు బహదూర్'. ఈ సినిమాకు సూపర్ స్టార్ మహేష్ బాబు సమర్పకుడిగా వ్యవహరించడం.. విడుదలకు ముందే టీజర్, ట్రైలర్ మంచి స్పందన అందుకోవడంతో సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇక దర్శకుడు సుకుమార్ వంటి ప్రముఖులు కూడా సినిమాపై ప్రశంసలు కురిపించడంతో ఆసక్తి మరింత పెరిగింది. మరి ప్రేక్షకుల అంచనాలను ఈ సినిమా అందుకుందా? వెంకటేష్ మహా మరోసారి తనదైన ముద్ర వేసారా? సత్యదేవ్ నటన ఎలా ఉంది? తెలుసుకుందాం.

సినిమా కథ..

1969 నుంచి 1991 మధ్య కాలంలో జరిగే కథ ఇది. ఒక సంస్థానానికి చెందిన రాజు రామప్ప అలియాస్ రావు బహదూర్ (సత్యదేవ్) వయసు పైబడిన తర్వాత తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ ఉంటాడు. వైద్యులు లివర్ క్యాన్సర్ చివరి దశలో ఉన్నాడని చెప్పినా, అతడు మాత్రం అసాధారణంగా బతుకుతూనే ఉంటాడు. అయితే అతన్ని బతికిస్తున్నది మందులు కాదు... అతని మనసులో ఎన్నేళ్లుగా మంటలా మండుతున్న ఒక అనుమానం.

rao-bahadur-movie-review-in-telugu-and-rating-starring-satyadev-under-venkatesh-maha-direction

తన చిన్న కుమారుడు కుసుమప్ప నిజంగా తన సొంత కొడుకేనా? అనే సందేహం అతన్ని క్షణం కూడా ప్రశాంతంగా ఉండనివ్వదు. ఈ విషయాన్ని తన అత్యంత సన్నిహితుడు, వైద్యుడు అయిన ఆచారి (వికాస్ ముప్పాల)తో పంచుకుంటాడు. ఆ తర్వాత DNA పరీక్ష కోసం ఇద్దరూ కలిసి ఒక పెద్ద నాటకం ఆడాల్సి వస్తుంది. అసలు రామప్పకు ఈ అనుమానం ఎందుకు వచ్చింది? అతని భార్య రేణుక (దీపా థామస్)తో ప్రేమ ఎలా మొదలైంది? పెళ్లి తర్వాత ఇద్దరి మధ్య దూరం ఎందుకు పెరిగింది? ఒకే ఇంట్లో ఉంటూ కూడా ఎందుకు మాట్లాడుకోరు? చివరకు DNA పరీక్షలో నిజం ఏంటి? రామప్ప జీవితాన్ని వెంటాడిన అనుమానానికి ముగింపు దొరికిందా? అనేదే మిగతా కథ.

మూవీ విశ్లేషణ..

"అనుమానం పెనుభూతం" అనే సామెతను దర్శకుడు వెంకటేష్ మహా రెండు గంటలకు పైగా నిడివి ఉన్న సినిమాగా మలిచారు. సాధారణంగా మనిషిని బతికించేది గాలి, నీరు, ఆహారం అని అంటారు. కానీ ఈ సినిమాలో మాత్రం ఒక అనుమానం కూడా మనిషిని ఎలా బతికిస్తుందో, అదే సమయంలో లోపల నుంచి ఎలా నెమ్మదిగా చంపేస్తుందో దర్శకుడు చాలా లోతుగా చూపించాడు. వంశం, రక్త సంబంధం, కులం, చర్మరంగు, రాజరికపు అహంకారం, పురుషాధిక్య భావజాలం, వారసత్వంపై సమాజంలో ఉన్న మానసిక బలహీనతలను కథలో చాలా సహజంగా అల్లారు. ఇప్పటికీ పత్రికలు, టీవీలు, సోషల్ మీడియాలో ఎక్కువగా కనిపించే అక్రమ సంబంధాలు, వాటి చుట్టూ తిరిగే అనుమానాలు, కుటుంబాల్లో జరిగే విషాదాలు వంటి అంశాలను గుర్తుకు తెచ్చేలా కథ ఉంటుంది. సినిమా మొదటి భాగం చాలా నెమ్మదిగా సాగుతుంది. దర్శకుడు ప్రేక్షకుడిని కథలోకి వెంటనే తీసుకెళ్లే ప్రయత్నం చేయలేదు. పాత్రలు, కాలం, వారి మానసిక స్థితిని అర్థం చేసుకునేలా సమయం తీసుకున్నాడు.

దీంతో ఫస్ట్ హాఫ్ కొంతమందికి సాగదీసినట్లు అనిపించే అవకాశం ఉంది. అయితే ఇంటర్వెల్ తర్వాత కథ అసలు రూపం దాల్చుతుంది. ఒక్కో సన్నివేశానికి అర్థం తెలుస్తూ, ఫస్ట్ హాఫ్‌లో చూపించిన ప్రతి సంఘటనకు రెండో భాగంలో సమాధానాలు దొరుకుతాయి. ముఖ్యంగా చివరి 45 నిమిషాలు సినిమాకు ప్రధాన బలం. DNA పరీక్ష చుట్టూ జరిగే నాటకీయ పరిణామాలు, రామప్ప మానసిక సంఘర్షణ, చివర్లో వచ్చే ట్విస్ట్ ప్రేక్షకుడిని బలంగా తాకుతుంది. అయితే కొడుకు సమాధి వరకు సొరంగం తవ్వడం, అస్థిపంజరం తీసుకుని DNA పరీక్షలు చేయడం వంటి కొన్ని సన్నివేశాలు సహజత్వానికి కాస్త దూరంగా, సినిమాటిక్ లిబర్టీ తీసుకున్నట్లు అనిపిస్తాయి.

నటీనటుల పనితీరు..

సత్యదేవ్ మరోసారి నటుడిగా తన స్థాయిని నిరూపించాడు. యువకుడిగా ప్రేమలో పడే వ్యక్తిగా, భార్యపై అనుమానం పెంచుకునే భర్తగా, చివరికి మానసికంగా కుంగిపోయిన వృద్ధుడిగా మూడు వేర్వేరు దశల్లో అద్భుతమైన నటన కనబరిచాడు. ముఖ్యంగా కళ్లతోనే బాధ, అనుమానం, కోపం, పశ్చాత్తాపాన్ని వ్యక్తపరిచిన తీరు ప్రశంసనీయం.

దీపా థామస్ స్క్రీన్ టైమ్ తక్కువే అయినా తన పాత్రలో చాలా సహజంగా కనిపించింది. అందం, అమాయకత్వం, భావోద్వేగాలు అన్నింటినీ సమతుల్యంగా చూపించింది.

వికాస్ ముప్పాల సినిమాకు మరో ప్రధాన బలం. సత్యదేవ్ తర్వాత ఎక్కువగా గుర్తుండిపోయే పాత్ర ఇదే. డాక్టర్‌గా, స్నేహితుడిగా కథను ముందుకు తీసుకెళ్లే బాధ్యతను చక్కగా నిర్వర్తించాడు.

హీరో కుమారుల పాత్రల్లో నటించిన ఇద్దరు బాల నటులు కూడా ఆకట్టుకుంటారు.

పనిమనిషి పాత్రతో పాటు మిగతా సహాయ నటీనటులు తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.

సాంకేతిక విభాగం..

వెంకటేష్ మహా మార్క్..

వెంకటేష్ మహా సినిమాల్లో ఉండే రియలిజం, సంభాషణలు, పాత్రల నిర్మాణం ఈ సినిమాలోనూ కనిపిస్తాయి. 1960లలో ఉన్న కుల వివక్ష, వంశం కోసం ఉండే ఆరాటం, రాజరికపు అహంకారం వంటి అంశాలను ప్రస్తుత కాలంతో పోలుస్తూ చెప్పిన డైలాగ్స్ ఆలోచింపజేస్తాయి. "1960ల్లో ఎలా ఉందో... 2020 వచ్చినా పరిస్థితి పెద్దగా మారలేదు" అనే భావాన్ని చెప్పే సన్నివేశాలు సినిమాకు బలం.

కార్తీక్ పర్మార్ సినిమాటోగ్రఫీ ప్రత్యేకంగా చెప్పుకోవాలి. 1960ల నుంచి 1990ల మధ్య కాలాన్ని చాలా సహజంగా తెరపై ఆవిష్కరించారు. ప్రతి ఫ్రేమ్ ఒక పెయింటింగ్‌లా కనిపిస్తుంది.

స్మరణ్ సాయి అందించిన నేపథ్య సంగీతం కథలోని భావోద్వేగాలను మరింత బలపరిచింది. పాటల కంటే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఎక్కువ ప్రభావం చూపుతుంది.

ఆర్ట్ డైరెక్షన్, సెట్స్, కాస్ట్యూమ్స్ అన్నీ ఆ కాలాన్ని గుర్తు చేస్తాయి.

నిర్మాణ విలువలు కూడా చాలా రిచ్‌గా ఉన్నాయి.

అయితే ఎడిటింగ్ విషయంలో కాస్త కత్తెర వేసి ఉంటే సినిమా మరింత ఎంగేజింగ్‌గా ఉండేదనిపిస్తుంది. ఫైట్లు, కామెడీ, పాటలు, హీరోయిజం కోసం వెళ్తే నిరాశపడే అవకాశం ఉంది. కానీ పాత్రల మానసిక ప్రపంచాన్ని అర్థం చేసుకుంటూ సినిమా చూస్తే మాత్రం మంచి అనుభూతి కలుగుతుంది.

ప్లస్ పాయింట్స్..

  • సత్యదేవ్ అద్భుతమైన నటన
  • వెంకటేష్ మహా రచన, దర్శకత్వం
  • క్లైమాక్స్ ట్విస్ట్
  • బలమైన భావోద్వేగాలు
  • కులం, వంశం, అనుమానం వంటి అంశాలపై లోతైన చర్చ
  • సినిమాటోగ్రఫీ
  • నేపథ్య సంగీతం
  • నిర్మాణ విలువలు

మైనస్ పాయింట్స్..

  • నెమ్మదిగా సాగే ఫస్ట్ హాఫ్
  • కమర్షియల్ ఎలిమెంట్స్ లేకపోవడం
  • DNA పరీక్షలకు సంబంధించిన కొన్ని సన్నివేశాలు సినిమాటిక్‌గా అనిపించడం
  • సాధారణ ప్రేక్షకులకు పూర్తిగా కనెక్ట్ కాకపోవచ్చు
  • కొంత నిడివి ఎక్కువగా అనిపిస్తుంది

రేటింగ్: 3.25/5

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+