పిల్లల్ని కనడంపై రాశి ఖన్నా హాట్ కామెంట్స్
హీరోయిన్ రాశి ఖన్నా క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఊహలు గుసగుసలాడే సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచియమైన ఈ భామ..జోరు, జిల్, బెంగాల్ టైగర్, శివం, సుప్రీం, హైపర్, జై లవ కుశ, రాజా ది గ్రేట్, టచ్ చేసి చూడు, తొలిప్రేమ, శ్రీనివాస కళ్యాణం తదితర సినిమాల్లో నటించారు. అందానికి అందం , టాలెంట్‌కు టాలెంట్ రాశి ఖన్నా సొంతం. అయినప్పటికీ రాశి ఖన్నాకు ఇప్పటి వరకు సరైన బ్రేక్ రాలేదనే చెప్పాలి. కెరీర్ స్టార్ చేసి పుష్కరకాలం అయినప్పటికీ అమ్మడు కెరీర్‌లో పెద్దగా హిట్లు లేవు.
కారణాలు తెలియదు కానీ స్టార్ హీరోలతో నటించే అవకాశం రాశి ఖన్నాకు దక్కలేదనే చెప్పాలి. ఎన్టీఆర్ మినయిస్తే మిగిలిన హీరోలెవ్వరూ కూడా రాశి ఖన్నా వైపు కన్నెత్తి చూడలేదు. ఇక సెకండ్ గ్రేడ్ హీరోలతో రాశి ఖన్నా నటించిన సినిమాలన్నీ కూడా బాక్సాఫీస్ వద్ద బొల్తా కొట్టాయి. దీంతో బాలీవుడ్ బాట పట్టిన ఈ అమ్మడుకు అక్కడ కూడా నిరాశే ఎదురైంది. బాలీవుడ్‌లో బికిని, లిప్‌లాక్ వంటి సన్నివేశాల్లో నటించినప్పటికీ పెద్దగా లాభం లేకుండా పోయింది. అయితే హిందీ మేకర్స్ మాత్రం రాశి ఖన్నాకు వరుస అవకాశాలిస్తూ ప్రొత్సహిస్తున్నారు.

రాశి ఖన్నా ప్రస్తుతం 'సబర్మతి రిపోర్ట్' అనే సినిమాలో నటిస్తోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ విడుదలైంది. సినిమా వచ్చే నెలలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈక్రమంలో సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొన్న రాశి ఖన్నా పెళ్లి , పిల్లల గురించి మాట్లాడింది. పెళ్లి అనేది నా పర్సనల్ విషయం కాబట్టి దాని గురించి ఇప్పుడు దాని గురించి వివరించాల్సిన అవసరం లేదు.నాకూ పెళ్లి చేసుకుని పిల్లల్ని కనాలనే ఉంది కానీ దానికి ఇంకా టైమ్ ఉంది. అది నా పర్సనల్ విషయం నా వృత్తితో దాన్ని కలపాల్సిన అవసరం లేదు. పెళ్లి చేసుకుంటే నేను ప్రకటిస్తా. కానీ రూమర్స్ క్రియేట్ చేయకండని తెలిపింది. పెళ్లిపై రాశి ఖన్నా చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.












Click it and Unblock the Notifications