బిగ్ ట్విస్ట్..మెగా కుటుంబంలోకి రష్మిక ఎంట్రీ..?

ప్రస్తుతం టాలీవుడ్ నెంబర్ వన్ హీరోయిన్ ఎవరంటే రష్మిక మందన్నా అనే చెప్పాలి. ఈ మధ్య శ్రీలీల కాస్తా హడావిడి చేసినప్పటికీ...ఆమె నటించిన సినిమాలన్నీ కూడా బాక్సాఫీస్ వద్ద ఫెయిల్ కావడంతో శ్రీలీలపై ఫ్లాప్ హీరోయిన్ ముద్ర పడింది. దీంతో తెలుగులో స్టార్ హీరోయిన్‌ ఎవరంటే మాత్రం రష్మిక మందన్నా అని అందరూ చెబుతున్నారు. ప్రస్తుతం రష్మిక మందన్నానే టాప్ ప్లేస్‌లో కొనసాగుతున్నారు.

రష్మిక మందన్నా నటించిన సినిమాలు బాక్సాఫీస్ సూపర్ హిట్ కావడంతో ఆమె నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతుంది. గతేడాది పుప్ప, సీతరామం, యానిమల్ వంటి సూపర్ హిట్లను తన ఖాతాలో వేసుకుంది. ఇక రష్మిక మందన్నా రాబోవు సినిమాల లిస్ట్‌ కూడా చాలా పెద్దగానే ఉంది. తెలుగులో అల్లు అర్జున్ పుష్ప-2తో పాటు నితిన్‌తో మరో సినిమా చేస్తోన్న హాట్ బ్యూటీ బాలీవుడ్‌లో షాహిద్ కపూర్, విక్కి కౌషల్‌తో వరుస సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా మారింది.

Rashmika Mandanna act with mega heroes movies

తాజాగా రష్మిక మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న విశ్వంభర సినిమాలో రష్మిక కనిపించనుందని సమాచారం. అయితే ఇప్పటికే ఈ సినిమాలో త్రిష హీరోయిన్‌గా తీసుకున్నారు. ప్రత్యేక పాత్ర కోసం నేషనల్ క్రష్ రష్మికను అప్రోచ్ అయ్యారట దర్శక, నిర్మాతలు. అయితే ఈ పాత్రకు రష్మిక పేరును సూచించింది మెగాస్టార్ చిరంజీవేనట.

ఆ ఇచ్చిన సలహాతోనే రష్మికను కలవడం, ఆమె చిరంజీవితో యాక్ట్ చేయడానికి ఓకే చేయడం అన్ని కూడా చక చక జరిగిపోయాయి. ఇక మెగాస్టార్ చిరంజీవితో పాటు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌తో కూడా రష్మిక నటించనుంది. బుచ్చిబాబు.. రామ్ చరణ్ కలయికలో తెరకెక్కనున్న చిత్రంలో కూడా రష్మికనే కథానాయికగా సెలక్ట్ చేసుకున్నారు. దీనిపై అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడనుంది.

పుష్ప-2, విశ్వంభర, రామ్ చరణ్ కొత్త సినిమాల్లో నటిస్తూ మెగా హీరోయిన్‌గా రష్మిక మారిపోయింది. గతంలో కాజల్ అగర్వాల్ ఇలా మెగా హీరోలతో నటించింది. రష్మిక కూడా అదే లిస్ట్‌లోకి యాడ్ అవ్వడానికే ప్రయత్నాలు మొదలుపెట్టింది. అయితే గతంలో ఇలా మెగా హీరోలతో నటించిన లావణ్య త్రిపాఠి మెగా ఇంటి కోడలు అయిన సంగతి తెలిసిందే. రష్మిక కూడా ఇలా మెగా హీరోలతో నటించి మెగా ఇంటి కోడలు అవుతుందనే అనుమానం మెగా అభిమానులు వ్యక్తం చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+