పబ్లిక్‌గ్గా రష్మికను అలా చూడగానే రెచ్చిపోయిన కుర్రాళ్లు (వీడియో)
తెలుగులో స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగింది రష్మిక మందన్నా. ఈ మధ్య శ్రీలీల కాస్తా హడావిడి చేసినప్పటికీ...ఆమె నటించిన సినిమాలన్నీ కూడా బాక్సాఫీస్ వద్ద ఫెయిల్ కావడంతో శ్రీలీలపై ఫ్లాప్ హీరోయిన్ ముద్ర పడింది. ఇక పొడుగు కాళ్ల సుందరి పూజా హెగ్దెకు తెలుగులో పెద్దగా అవకాశాలు లేకపోవడంతో ప్రస్తుతం రష్మిక మందన్నానే టాప్ ప్లేస్‌లో కొనసాగుతున్నారు.
రష్మిక మందన్నా నటించిన సినిమాలు బాక్సాఫీస్ సూపర్ హిట్ కావడంతో ఆమె నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతుంది. గతేడాది పుప్ప, సీతరామం, యానిమల్ వంటి సూపర్ హిట్లను తన ఖాతాలో వేసుకుంది. రష్మిక ఉంటే చాలు సినిమా హిట్ అన్నట్టుగా పరిస్థితి మారిపోయింది. ఇక రష్మిక మందన్నా రాబోవు సినిమాల లిస్ట్ కూడా చాలా పెద్దగానే ఉంది. తెలుగులో అల్లు అర్జున్ పుష్ప-2తో పాటు నితిన్‌తో మరో సినిమా చేస్తోన్న హాట్ బ్యూటీ బాలీవుడ్‌లో షాహిద్ కపూర్, విక్కి కౌషల్‌తో వరుస సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా మారింది.

తమిళంలో కూడా రెండు సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా హీరోయిన్‌గా మారిపోయింది. రష్మిక ఫుల్ యాక్టివ్‌గా ఉంటారనే విషయం తెలిసిందే. సోషల్ మీడియాలో రష్మికకు చాలా ఫ్యాన్ పేజీలున్నాయి. ఇదే సమయంలో సోషల్ మీడియాలో ఆమె ఫాలోయింగ్ కూడా విపరీతంగా పెరిగిపోయింది. ఇదిలా ఉంటే రష్మిక చేసిన ఓ పని ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
#RashmikaMandanna #Ranjithame 🥳
— Daemon (@AmeerKhan_ARK) July 25, 2024
Rashmika for an event in Kerala Today ❤️🔥#Kerala pic.twitter.com/ttXIJPUyg9
కేరళలో రీసెంట్‌గా జరిగిన ఓ ఈవెంట్ కు గెస్ట్‌గా వెళ్లింది రష్మిక. స్లీవ్ లెస్ బ్లౌజ్, గ్రీన్ శారీతో తనదైన గ్లామర్ ట్రీట్‌తో అదరగొట్టింది. ఇక్కడ వరకు బాగానే ఉన్నప్పటికి, రష్మికను అలా చూడగానే కుర్రాళ్లు రెచ్చిపోయారు. దీంతో ఆమెను డ్యాన్స్ వేయాలని కోరారు. అభిమానుల కోరికను కాలేదనకపోయిన రష్మిక వారి కోరిక మేరకు స్టేజ్ మీద డ్యాన్స్ వేసింది. తాను నటించిన వారసుడు మూవీలోని రంజితమే సాంగ్ కు డ్యాన్స్ చేసింది. అందుకు సంబంధించిన పిక్స్ అండ్ వీడియోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మరాయి.












Click it and Unblock the Notifications