విజయ్ కోసం రష్మిక ఇంతకు దిగజారిందా..?
టాలీవుడ్ లో అలనాటి చిత్రాల నుంచి నేటి వరకూ చాలా హిట్ పెయిర్స్ ఉన్నాయి. వాటిల్లో రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందాన్న ఒకటి. గతంలో వీళ్లు గీతా గోవిందం, డియర్ కామ్రేడ్ లాంటి చిత్రాలు చేశారు. అయితే 'టాక్సీవాలా', 'శ్యామ్ సింగరాయ్' చిత్రాల ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు రాహుల్ సాంకృత్యాయన్.. విజయ్ దేవరకొండతో కొత్త సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. 'వీడీ 14' పేరుతో ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. ఈ మూవీలో రష్మిక కీలక పాత్రలో నటిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. దీనిపై అధికారికంగా క్లారిటీ రావాల్సి ఉంది.
I know how much this means to you and all those who love you 🥹❤️@TheDeverakonda !!
— Rashmika Mandanna (@iamRashmika) July 31, 2025
“MANAM KOTTINAM”🔥#Kingdom
అయితే తాజాగా విజయ్ దేవరకొండ లేటెస్ట్ మూవీ 'కింగ్డమ్'. జులై 31 న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలైంది. జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్ తో దూసుకెళ్తోంది. ఈ మూవీలో భాగ్య శ్రీ బోర్సే కథానాయికగా నటించింది. సత్యదేవ్ కీలక పాత్రలో నటించారు. విజయ్ యాక్షన్, అనిరుధ్ మ్యూజిక్, మూవీ సెటప్ ఇవన్నీ హాలీవుడ్ రేంజ్ లో ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. దీంతో చాలా ఏళ్ల తర్వాత కొండన్నకు హిట్ పడిందని ఫ్యాన్స్ ఫుల్ ఖుషీలో ఉన్నారు. ఇక ఈ మూవీని చూడాలన్న ఆత్రుతతో నేషనల్ క్రష్ రష్మిక ఏం చేసిందో తెలిస్తే షాక్ అవుతారు.
ఈ మూవీని చూడాలన్న కోరికతో రష్మిక.. హైదరాబాద్ లోని శ్రీ రాములు థియేటర్ కు వెళ్లింది. అయితే థియేటర్ సిబ్బంది ఆమె నిర్ణయాన్ని సున్నితంగా తిరస్కరించారు. రష్మిక వచ్చిందని తెలిస్తే ఫ్యాన్స్ ను కంట్రోల్ చేయడం కష్టమని.. చెప్పారు. అయినా విజయ్ దేవరకొండ మీద ఇష్టంతో సినిమా చూడాలన్న కోరికతో భ్రమరాంబ థియేటర్ కు మారు వేషంలో వెళ్లి సినిమా చూసిందట. ఈ విషయాన్ని కింగ్డమ్ ప్రొడ్యూసర్ నాగవంశీ ఇటీవల తెలిపారు.

ఇక మూవీ రిలీజ్ అయినప్పుడు కూడా.. రష్మిక చేసిన ట్వీట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. "నాకు తెలుసు.. ఈ సినిమా నీకు.. నిన్ను ప్రేమించేవారికి ఎంత ముఖ్యమైనదో అని. ఒక మంచి హిట్ కోసం ఎంతగా ఎదురుచూశావో.. నిన్ను అభిమానించేవారికి కూడా తెలుసు. మనం కొట్టినమ్" అంటూ రష్మిక విష్ చేసింది. అయితే ఈ ట్వీట్ కు విజయ్ దేవరకొండ.. రిప్లై ఇచ్చాడు. 'మనం కొట్టినమ్' అంటూ ఓ హార్ట్ సింబల్ యాడ్ చేశాడు. దీంతో దీంతో కొండన్న , రష్మిక ఫ్యాన్స్ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. విజయ్ దేవరకొండ- రష్మిక ల మ్యారేజ్ డేట్ ఎప్పుడు..? ఇంకా ఎంత కాలం ఉంటారు.. అని సామాజిక మాధ్యమాల్లో కామెంట్స్ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications