ఇప్పుడే స్టార్ట్ అయింది..9 నెలలకు గుడ్ న్యూస్ చెప్తా: రష్మిక
నేషనల్ క్రష్ రష్మిక మందానా ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకెళ్తోంది. పుష్ప, యానిమల్, ఛావా సినిమాలతో పాన్ ఇండియాలోనే మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారింది రష్మిక. ఆమె సినిమాలో యాక్ట్ చేస్తే చాలు బ్లాక్ బస్టర్ అన్నట్లుగా ఇప్పుడు మారిపోయింది. ప్రస్తుతం ఆమె సల్మాన్ ఖాన్ తో కలిసి నటించిన సికందర్ చిత్రం ఈ నెల 30న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

అయితే తాజాగా తన ఇన్ స్టాలో అభిమానులతో చిట్ చాట్ నిర్వహించింది రష్మిక. ఫ్యాన్స్ అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు చెప్పుకుంటూ వచ్చింది. ఇటీవల తన కాలుకు గాయం కావడం పైనా రష్మిక మాట్లాడింది. తాను ఇప్పుడిప్పుడే ఆ గాయం నుంచి కోలుకుంటున్నానని పేర్కొంది. గాయం మానడం ఇప్పుడే ప్రారంభమైందని చెప్పింది.'కాలు ఇప్పుడిప్పుడే నయం అవుతోంది. కానీ పూర్తిగా సెట్ అవ్వడానికి ఇంకా 9నెలల సమయం పడుతుంది. కాకపోతే ఇప్పుడు పరిస్థితి మెరుగ్గానే ఉంది. వర్క్ లైఫ్‌లో ఫుల్ బిజీ అయిపోయా' అని ఇన్ స్టాలో ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు బదులిచ్చింది రష్మిక. గతంలో ఆమె జిమ్ లో వర్కౌట్ చేస్తూ గాయపడ్డ విషయం తెలిసిందే.
ఇక రష్మిక నటించిన కుబేర చిత్రం జూన్ 20న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. శేఖర్ కమ్ముల ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. కింగ్ నాగార్జున, ధనుష్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అంతేకాక రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో 'ది గర్ల్‌ఫ్రైడ్'లోనూ రష్మిక సందడి చేయనుంది. ఇక హిందీలో ఆయుష్మాన్ ఖురానాతో కలిసి 'థామా'లో నటిస్తోంది. ఈ మూవీ ఈ ఏడాది దీపావళికి రిలీజ్ కానుంది.












Click it and Unblock the Notifications