రవితేజ కొత్త సినిమా ట్రైలర్ వచ్చేసింది.. సంక్రాంతికి రచ్చ రంబోలా..!
టాలీవుడ్ మాస్ మహారాజ్ రవితేజ హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' ట్రైలర్ రిలీజ్ అయింది. ఈ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 13 న గ్రాండ్ గా విడుదలకు సిద్దమైంది. ట్రైలర్ ఫుల్ ఫ్యామిలీ ఎమోషన్స్, రవితేజ మార్క్ ఎంటర్ టైన్ మెంట్, డైలాగ్స్ తో సరదాగా సాగిపోయింది. ఇప్పటికే మూవీపై పాజిటివ్ బజ్ ఏర్పడిన విషయం తెలిసిందే.
మాస్ మాహారాజ రవితేజ హీరోగా నటించిన 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' మూవీ నుంచి ట్రైలర్ రిలీజ్ అయింది. టాలీవుడ్ దర్శకుడు కిషోర్ తిరుమల దర్శకత్వం వహించిన ఈ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 13 న విడుదలకు సిద్ధం అయింది. ట్రైలర్ చాలా సరదాగా రవన్న మార్క్ ఎంటర్ టైన్ మెంట్ తో సాగి పోయింది. ఈ సంక్రాంతికి రవితేజ కమ్ బ్యాక్ గ్యారంటీ అని ట్రైలర్ చూస్తే తెలుస్తోంది. భార్య , ప్రేయసి మధ్య నలిగిపోయే వ్యక్తిగా రవితేజ క్యారెక్టర్ ను డిజైన్ చేసినట్లు తెలుస్తోంది.

ఈ మధ్య బ్యాక్ టూ బ్యాక్ గన్ లు, కత్తులు, ఫైట్స్ తెగచేసేశాను. అందుకే మా ఫ్యామిలీ డాక్టర్ చిన్న గ్యాప్ ఇవ్వమని చెప్పాడు అంటూ రవితేజ చెప్పిన డైలాగ్ ఆసక్తికరంగా ఉంది. రవితేజ మాస్ పంచ్ లు, వెన్నెల కిషోర్, సత్య కామెడీ టైమింగ్ అదిరిపోయాయి. దీంతో ఈసారి హిట్ కొట్టడం పక్కా అంటూ ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు. ఇక ఈ మూవీలో రవితేజ సరసన డింపుల్ హయాతి, అషికా రంగనాథ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.
అయితే ఈ సంక్రాంతికి కూడా చాలా పెద్ద సినిమాలు రిలీజ్ కు రెడీ అయ్యాయి. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ 'రాజాసాబ్', మెగాస్టార్ చిరంజీవి 'మన శంకరవరప్రసాద్ గారు'.. అలాగే యంగ్ హీరో నవీన్ పొలిశెట్టి 'అనగనగా ఒక రాజు', శర్వానంద్ 'నారీనారీ నడుమ మురారీ' చిత్రాలు కూడా పండక్కే రిలీజ్ అవుతున్నాయి. మరి వీటిలో సంక్రాంతి విన్నర్ ఏ మూవీ అవుతుందో చూడాలి..












Click it and Unblock the Notifications