ఓటీటీలోకి రవితేజ సూపర్ హిట్ మూవీ.. కిక్కు ప్రాప్తిరస్తు..
టాలీవుడ్ స్టార్ హీరో, మాస్ మాహారాజ రవితేజ హీరోగా లేటెస్ట్ గా వచ్చిన చిత్రం 'భర్త మహాశయులకు విజ్ఞప్తి'. కిషోర్ తిరుమల దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ ఈ ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదల అయింది. ఈ మూవీలో డింపుల్ హయాతి, అషికా రంగనాథ్ హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రానికి మంచి పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ.. బాక్స్ ఆఫీస్ వద్ద ఫ్లాప్ గానే మిగిలింది.
ఇక సంక్రాంతి రేసులోకి వచ్చిన పెద్ద సినిమాల్లో ఓటీటీ విడుదల తేదీని ఖరారు చేసుకున్న మొదటి చిత్రం ఇదే. ప్రముఖ ఓటీటీ సంస్థ జీ 5 ఈ చిత్ర డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను భారీ ధరకు సొంతం చేసుకుంది. కానీ పలు కారణాల వల్ల ఈ మూవీ స్ట్రీమింగ్ వాయిదా పడుతూ వచ్చింది. ఇక ఈ మూవీ రిలీజై 50 రోజులు కావొస్తోంది. అయితే ఎట్టకేలకు ఈ మూవీ ఓటీటీ విడుదలకు మోక్షం లభించింది.
ఈ మూవీ మార్చి 13, 2026 నుండి స్ట్రీమింగ్ కానున్నట్లు ప్రస్తుతం సమాచారం అందుతోంది. దీనిపై అధికారిక ప్రకటన త్వరలోనే విడుదల కానుంది. అయితే ఈ మూవీ కేవలం ఒక్క తెలుగులో మాత్రమే కాదు. హిందీ, కన్నడ, మలయాళం, తమిళ భాషల్లో కూడా స్ట్రీమింగ్ కానుంది. సంక్రాంతి పండగ తర్వాత దాదాపు 2 నెలల గ్యాప్ తో ఈ సినిమా ఓటీటీలోకి వస్తున్న నేపథ్యంలో అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.

ఈ మూవీని థియేటర్లలో ప్రేక్షకులు పట్టించుకోలేదు. పాజిటివ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ ఈ మూవీని పక్కన పెట్టేశారు. దాంతో ఈ సినిమాకు ఓటీటీలో సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు. ఇక ఈ మూవీకి కిషోర్ తిరుమల దర్శకత్వం వహించాడు. ఇందులో డింపుల్ హయాతి , ఆశికా రంగనాథ్ హీరోయిన్స్ గా నటించారు . అలాగే వెన్నెల కిషోర్ , సునీల్ , సత్య తదితరులు కీలక పాత్రలు పోషించారు.
-
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
ఉస్తాద్ భగత్ సింగ్ ట్విట్టర్ రివ్యూ: బొమ్మ బ్లాక్ బస్టర్..!! -
ఉగాది పండగ వేళ చిరంజీవి సంచలన నిర్ణయం.. -
సమంత, రాజ్ నిడిమోరు క్యూట్ వీడియో వైరల్..! -
అన్న మళ్లీ హిట్ కొట్టాడోచ్.. పవన్ కళ్యాణ్ "ఉస్తాద్ భగత్ సింగ్" మూవీ రివ్యూ..! -
తెలంగాణ గద్దర్ అవార్డుకు ఎంపికైన తొలి బయోపిక్ ఇదే.. స్పెషాలిటీ అదే !! -
అనుష్క పెళ్లి ట్విస్ట్: ఆ విషయాన్ని ఎందుకు హైలైట్ చేస్తున్నారు? -
రామ్ చరణ్ 'పెద్ది'లో క్రేజీ ఐటమ్ సాంగ్.. ముగ్గురు స్టార్ హీరోయిన్లతో మాస్ స్టెప్పులు -
ధురంధర్2, ఉస్తాద్ భగత్ సింగ్.. వీటిల్లో ఏ సినిమాకు వెళ్లాలి? -
‘ధురంధర్2’లో హైలైట్స్ ఇవే.. దద్ధరిల్లుతున్న థియేటర్లు -
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే!












Click it and Unblock the Notifications