స్వామియే శరణం అయ్యప్ప.. కొత్త మూవీలో రవితేజ న్యూ అవతార్ !!

హిట్, ఫ్లాపు లతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకుపోయే హీరో అంటే "మాస్ మహరాజా రవితేజ" అనే చెప్పాలి. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలి అనేందుకు సరైన ఉదాహరణగా నిలుస్తుంటారు. అందుకే ఫామ్ లో ఉండగానే వరుసగా సినిమాలు చేసేస్తూ ప్రేక్షకులను అలరించేందుకు చూస్తుంటారు. చివరగా ఆయన నటించిన క్రాక్, ధమాకా చిత్రాలు మాత్రమే హిట్ కొట్టగా మిగతా చిత్రాలు అన్నీ ఫ్లాపులుగా మిగిలాయి. ఈ క్రమంలోనే రీసెంట్ గానే "భర్త మహాశయులకు విజ్ఞప్తి" సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి పాజిటివ్ రెస్పాన్స్ దక్కించుకొని మళ్లీ బౌన్స్ బ్యాక్ అయ్యారు.

ఇప్పుడు అదే జోష్‌తో తన తదుపరి ప్రాజెక్ట్‌పై ఫోకస్ పెట్టారు. తన కెరీర్‌లో ఓ విభిన్నమైన సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఎమోషనల్ కథలకు పేరుగాంచిన దర్శకుడు శివ నిర్వాణతో ఆయన చేస్తున్న #RT77 అనే వర్కింగ్ టైటిల్ తో ఓ కొత్త సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈరోజు ( జనవరి 26 ) రవితేజ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన కీలక అప్‌డేట్‌ను మేకర్స్ ప్రకటించారు.

raviteja-new-movie-irumudi-first-look-poster-released-by-movie-makers-as-birthday-surprise-of-star-h

ఈ చిత్రానికి 'ఇరుముడి' (Irumudi) అనే టైటిల్‌ను ఖరారు చేస్తూ.. ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. పోస్టర్‌ను షేర్ చేస్తూ చిత్రబృందం రవితేజకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసింది. ఈ పోస్టర్లో రవితేజ అయ్యప్ప మాలధారణలో, తలపై ఇరుముడి పెట్టుకుని కనిపించారు. భజనల మధ్య నృత్యం చేస్తూ, ఒక చేతిలో తన పాపను ఎత్తుకుని చిరునవ్వుతో కనిపించారు. ఈ లుక్ చూస్తే, ఈ సినిమా అయ్యప్ప స్వామి దీక్ష నేపథ్యంతో పాటు తండ్రీకూతుళ్ల మధ్య బలమైన భావోద్వేగ బంధాన్ని ప్రతిబింబించేలా ఉండబోతోందని స్పష్టమవుతోంది.

రవితేజ ఎమోషనల్ పోస్ట్..

ఈ సందర్భంగా రవితేజ సోషల్ మీడియా వేదికగా ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. అందులో.. జీవితంలో కొన్ని కథలు సరైన సమయంలో మనల్ని ఎంచుకుంటాయి. అలాంటి ఓ కథలో భాగం కావడం అదృష్టంగా భావిస్తున్నాను. నమ్మకాన్ని మార్గదర్శకంగా చేసుకుని, శివ నిర్వాణ, మైత్రీ మూవీ మేకర్స్‌తో కలిసి 'ఇరుముడి' అనే ఈ కొత్త ప్రయాణాన్ని ప్రారంభించడానికి ఉత్సాహంగా ఉన్నాను. స్వామియే శరణం అయ్యప్ప అంటూ రాసుకొచ్చారు.

ఇన్నాళ్లు మాస్ అంటూ ఒకరకమైన మూస ధోరణి సినిమాలు చేస్తూ వచ్చిన రవితేజ.. ఇప్పుడు కెరీర్‌లో ఇంతకుముందెన్నడూ చేయని విధంగా విభిన్నమైన పాత్రలో ఆయన కనిపించనుండడం టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. ఈ పాత్ర కోసం రవితేజ పూర్తిగా మేకోవర్ అవుతున్నారని కూడా తెలుస్తోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. ఇందులో కథానాయికగా ప్రియా భవానీ శంకర్ నటిస్తుండగా.. జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతాన్ని అందిస్తున్నారు. ప్రస్తుతం సినిమా షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. మొత్తానికి ఫస్ట్ లుక్‌తోనే సినిమాపై పాజిటివ్ బజ్ క్రియేట్ అయిందని రవితేజ ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+