Johnny Master: పరారీలో జానీ మాస్టర్.. గాలింపు చేపట్టిన పోలీసులు..

తనపై ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక వేధింపులకు పాల్పడినట్లు లేడి కొరియోగ్రాఫర్ పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసింది. దీనిపై పోలీసులు జానీ మాస్టర్ కింది 376 అత్యాచారం అలాగే పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. పోలీసులు బాధితురాలి స్టేట్ మెంట్ ను రికార్డ్ చేశారు. జానీ మాస్టర్ నోటీసులు జారీ చేస్తామంటే ఆయన అందుబాటులో లేరు. దీంతో ఆయన కోసం పోలీసుల గాలిస్తున్నారు.

జానీ మాస్టర్ ప్రస్తుతం నెల్లూరు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో నార్సింగ్ పోలీసులు వెంటనే నెల్లూరు పోలీసులతో మాట్లాడారు. జానీ మాస్టర్ అక్కడే ఉన్నట్లయితే పోలీసులు అక్కడికెళ్లి అరెస్ట్ చేసే అవకాశం ఉంది. మరోవైపు బాధితురాలికి తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండగా నిలిచింది. ఇదే విషయమై తమ కమిటీ విచారణ చేస్తోందని పేర్కొంది. సినీ ఇండస్ట్రీలో వేధింపులు ఎదుర్కొంటున్న ఎవరైనా తమకు ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు.

Rayadurgam police are on the lookout for the absconding Johnny Master

కాగా బాధితురాలికి ప్రముఖ హీరో అండగా నిలిచిన నటి, యాంకర్ ఝాన్సీ తెలిపారు. ఆ హీరో ఎవరని ఇప్పుడు చర్చలు కొనసాగుతోన్నాయి. ఆ బడా హీరో ఎవరో కాదని అల్లు అర్జునని సోషల్ మీడియాలో వార్తలు చెక్కర్లు కొడుతున్నాయి. జానీ మాస్టర్ కేసులో బాధితురాలిగా ఉన్న మహిళా కొరియోగ్రాఫర్‌కు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అండగా నిలిచారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. బాధితురాలు ఇప్పటికే ఆమె పుష్ప 2: ది రూల్ చిత్రానికి పని చేస్తున్నారని చెబుతున్నారు.

తను భవిష్యత్ లో నటించబోయే చిత్రాల్లో అవకాశం కల్పిస్తానని ఐకాన్ స్టార్ తన మేజర్ ద్వారా బాధితురాలికి చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. ఏది ఏమైనా సినీ పరిశ్రమలో వేధింపులు కొత్త కాదు.. గతంలో కూడా వేధింపులు జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. అయితే ఈ వేధింపులు కేవలం టాలీవుడ్ కే పరిమితం కాలేదు.. తమిళ, మలయాళం, కన్నడలో మహిళ నటులు వేధింపులు ఎదుర్కొన్నట్లు వార్తలు వచ్చాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+