ప్రభాస్ రిలేషన్ షిప్ సీక్రెట్ రివీల్.. ఆమెతోనేనా ?
తెలుగు చిత్ర పరిశ్రమలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అంటే ముందు గుర్తొచ్చే పేరు రెబల్ స్టార్ ప్రభాస్. ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్న ఈ హీరో ఎప్పుడు పెళ్లి చేసుకుంటారా అని ఆయన ఫ్యామిలితో పాటు ఫ్యాన్స్ సైతం ఎంతగానో ఎదురు చేస్తున్నారు. గత కొన్నేళ్లుగా ప్రభాస్ స్టార్ హీరోయిన్ అనుష్కతో రిలేషన్ షిప్ లో ఉన్నారని వార్తలు వస్తున్నాయి. అయితే ఇంత వరకు ప్రభాస్ కానీ, అనుష్క కానీ ఎవరు స్పందించలేదు.
కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రభాస్ ఓ అమ్మాయిని ముద్దు పెట్టుకుంటున్న ఫోటోలు హల్ చల్ చేస్తున్నాయి. సాధారణంగా పర్సనల్ లైఫ్ లో ఇంట్రోవర్ట్ లాగా ఉండే ప్రభాస్.. పలు కార్యక్రమాల్లో, ఇంటర్వ్యూ లలో సైతం ఎక్కువగా సిగ్గు పడుతూ అమ్మాయిలకు దూరంగా ఉంటూ ఉంటారు. ప్రభాస్ తన ఫ్రెండ్స్ ను, ఫ్యాన్స్ ను ఎలా చూసుకుంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటిది ప్రభాస్ ముద్దు కోవడం ఏంటి ? ఇంతకీ ఎవరు ఆ అమ్మాయి అని నెటిజన్లు తెగ వెతికేస్తున్నారు.

అయితే వైరల్ అవుతున్న ఫొటోలు ఇప్పటివి కాదని పాత ఫోటోలు అని అర్దం అవుతోంది. అది బాహుబలి సినిమా సమయంలో ఫోటో అని క్లారిటీ ఇస్తున్నారు. ఆ ఫొటోలో ఉన్న అమ్మాయి తమన్నా బెస్ట్ ఫ్రెండ్ , మేకప్ ఆర్టిస్ట్ బిల్లి మానిక్ అని చెబుతున్నారు. ప్రభాస్ తన ఫ్రెండ్స్ తో ఎలా క్లోజ్ గా ఉంటారో తెలిసిందే.. ఈ క్రమంలోనే ఆమెతో సరదాగా అలా ఫోటో దిగినట్టు తెలుస్తోంది. దాంతో ప్రభాస్ రిలేషన్ షిప్ న్యూస్ కి ఇప్పుడు చెక్ పడినట్లు అయ్యింది.
మరోవైపు ఫుల్ స్వింగ్ లో దూసుకుపోతున్న ప్రభాస్.. నెక్స్ట్ సినిమాలు లైనప్ చూస్తే అందరూ ఆశ్చర్యపోవడం ఖాయం అనే చెప్పాలి. ప్రస్తుతం మారుతితో రాజా సాబ్.. హను రాఘవపూడి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నారు. ఆ తర్వాత సందీప్ రెడ్డితో 'స్పిరిట్'.. సలార్ 2, కల్కి 2 చిత్రాలలో నటించనున్నారు. ప్రెజెంట్ ఓ పక్క రాజాసాబ్ సినిమా రిలీజ్ కి రెడీ అవుతున్న నేపధ్యంలో.. బ్యాలెన్స్ షూట్ కూడా కంప్లీట్ చేయాలనే బిజీగా గడుపుతున్నారు. మరో పక్క తన డేట్స్ ని హను రాఘవపూడి డైరెక్షన్ లో చేస్తున్న ఫౌజీ సినిమాకి కూడా కేటాయిస్తున్నారు.
ఈ సినిమాలో మాళవిక మోహనన్ తో పాటు.. నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. అలాగే సంజయ్ దత్, మురళి శర్మ, అనుపమ్ ఖేర్ లు కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిసన్నారు. త్వరలోనే ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన ప్రభాస్ ఫస్ట్ లుక్ కి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.
-
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
ఓటీటీలోకి తెలుగు కామెడీ మూవీ.. నాన్ స్టాప్ నవ్వుల జాతర షురూ..! -
దద్దరిల్లిన "BB జోడీ".. గ్రాండ్ ఫినాలేలో పర్ఫామెన్స్ పూనకాలే.. విన్నర్స్ వాళ్లే ?? -
ఆమె నటించిన సినిమాలన్నీ ఫ్లాప్.. కానీ బిలియనీర్‌గా రాజభోగాలు -
సమంత పీఆర్ గుట్టు రట్టు.. ఆ ఒక్క మాటతో అడ్డంగా దొరికిపోయారు! వీడియో -
బాలయ్య సినిమాలో బోల్డ్ బ్యూటీ..! -
పేద విద్యార్దుల చదువు కోసం మంచు లక్ష్మీ ఇంత చేస్తున్నారా..? -
అన్న హీరో.. చెల్లి నిర్మాత.. "బరి" వీడియో వైరల్ !! -
"దానికోసం రోజూ ఫోర్స్ చేయలేను.. అందుకే విడిగా ఉంటున్నాం".. భర్తపై ఓపెన్ అయిన హీరోయిన్ -
ప్రశాంత్ వర్మ మ్యాజిక్.. అక్షయ్ ఖన్నా రోల్ మామూలుగా లేదుగా! -
ఇకపై "నో".. పవన్ మూవీ కారణంగా నటుడి సంచలన నిర్ణయం -
‘ధురంధర్2’ హిట్ అయినా.. రాబోయే బాక్సాఫీస్ తుఫానులన్నీ తెలుగు సినిమాలవే












Click it and Unblock the Notifications