రెబల్ స్టార్ ఫ్యాన్స్ గెట్ రెడీ.. దసరా గిఫ్ట్ వచ్చేస్తుందోచ్ !!!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కి ప్రపంచ వ్యాప్తంగా ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది. ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ స్వింగ్ లో దూసుకుపోతున్నారు ఈ హీరో. బాహుబలి సినిమాతో వరల్డ్ వైడ్ గా అభిమానులను సంపాదించుకున్న ఆయన.. సలార్, కల్కి సినిమాలతో తన స్టామినా ఏంటో మరోసారి నిరూపించుకున్నాడు. ప్రస్తుతం మారుతితో రాజా సాబ్‌.. హను రాఘవపూడి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నారు.

"రాజా సాబ్" సినిమాలో మాళవిక మోహనన్ తో పాటు.. నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. అలాగే సంజయ్ దత్, మురళి శర్మ, అనుపమ్ ఖేర్ లు కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు. రీసెంట్ గానే ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా మూవీ టీజర్ రిలీజ్ చేశారు. ఈ టీజర్లో ప్రభాస్ వింటేజ్ లుక్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. ప్రభాస్ కామెడీ, రొమాంటిక్ ట్రాక్, హీరోయిన్ల గ్లామర్ యాడ్ అప్ అని చెప్పాలి. వీఎఫ్ఎక్స్, బీజీఎం అదిరిపోగా.. కెమెరా వర్క్ మాత్రం పీపుల్స్ మీడియా గ్రాండియర్‌ను చూపించాయి. దీంతో మూవీపై రోజురోజుకీ అంచనాలు పెరిగిపోతున్నాయి.

rebel-star-prabhas-raja-saab-movie-trailer-release-update-from-makers

ట్రైలర్ రిలీజ్‌కు రెడీ..

ఇప్పటికే చివరి దశ పనులు పూర్తి చేసుకుంటున్న ఈ మూవీకి సంబంధించి ట్రైలర్ విడుదల కోసం అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ ఉత్కంఠకు చెక్ పెడుతూ, మేకర్స్ సెప్టెంబర్ 29వ తేదీ సాయంత్రం 6 గంటలకు 'ది రాజా సాబ్' ట్రైలర్ విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఒక పోస్టర్ ఊ కూడా రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్‌ను ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఎంపిక చేసిన కొన్ని థియేటర్లలో స్క్రీన్ చేయనున్నారని సమాచారం. దీంతో రెబల్ స్టార్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు.

ఫ్యాన్స్‌కి డబుల్ ట్రీట్..

కాగా ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా మరొక సర్ప్రైజ్ కూడా రెడీ అవుతోంది. అక్టోబర్ 23న ఆయన బర్త్‌డే రోజున 'ది రాజా సాబ్' ఫస్ట్ సాంగ్ విడుదల చేయనున్నట్లు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేత టి.జి. విశ్వప్రసాద్ ప్రకటించారు. దీంతో అభిమానులకు ఈ దసరా సీజన్ నుంచి బర్త్‌డే వరకు వరుస ట్రీట్స్ రానున్నాయి. ఈ చిత్రం డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+