అందుకోసమే ప్రెగ్నెంట్‌ అయ్యానంటున్న యంగ్ హీరోయిన్..!

రెజీనా కసాంద్రా.. 'శివ మనసులో శృతి' చిత్రంతో తెలుగు సినీ పరిశ్రమలో అడుగుపెట్టారు. ఆ తర్వాత 'సుబ్రహ్మణ్యం ఫర్ సేల్', 'పవర్', 'ఎవరు', 'జో అచ్యుతానంద' వంటి విజయవంతమైన చిత్రాలతో టాలీవుడ్‌లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అలానే తమిళంలో 'నిర్కొండ పార్వై', 'విదాముయార్చి' వంటి చిత్రాలు.. హిందీలో 'జాట్', 'కేసరి చాప్టర్ 2' వంటి బాలీవుడ్ ప్రాజెక్టుల్లో ఆమె నటన మరింత మంది ప్రేక్షకులకు చేరువ చేశాయి. ప్రస్తుతం ఆమె పలు చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. కాగా రీసెంట్ గానే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రెజీనా.. ఓ సరదా సంఘటనను బయటపెట్టింది. దీంతో ఆమె చెప్పిన విషయం సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ గా మారింది.

రెజీనా ఏం చెప్పారంటే..

తనకు ఆహారం అంటే ప్రాణం అని.. అయితే అదే సమయంలో నేను ఏమి తింటున్నానో, ఎంత తింటున్నానో చాలా జాగ్రత్తగా చూసుకుంటానని తెలిపారు. షూటింగ్ టైమ్‌లో తాను ఎప్పుడూ లంచ్ బాక్స్ తెచ్చుకుంటానని కూడా వెల్లడించారు. ఎందుకంటే తనకు తినే సమయం కూడా ఒక సెలబ్రేషన్ లాంటిదే" అని అన్నారు.

regina-cassandra-shocking-comments-goes-viral-on-media

బెంగళూరులో ఒక షూటింగ్ సందర్భంగా ఆమెకు బెంగాలీ స్వీట్ అయిన "మిష్టి దోయ్" (తీపి పెరుగు) తినాలనే బలమైన కోరిక కలిగిందని చెప్పారు. ఆ డెజర్ట్ కోసం నగరంలో పలు స్వీట్ షాపులు తిరిగినా, ఎక్కడా దొరకలేదని.. చివరికి ఒక షాపు వద్దకు చేరుకోగా, అప్పటికే అది మూసివేశారని వాపోయారు. షాపు ఉద్యోగి 'ఇప్పుడే క్లోజ్ అయింది మేడమ్, సర్వ్ చేయలేము' అని చెప్పడంతో.. కొంతసేపు అయోమయానికి గురై అప్పుడు సరదాగా ఒక చిన్న అబద్ధం చెప్పినట్టు రివీల్ చేశారు.

తాను గర్భవతిని అని.. స్వీట్ తినాలనే కోరిక (Craving) తీవ్రంగా ఉందని.. దయచేసి ఒక్క బౌల్ అయినా ఇవ్వండి" అని అడిగినట్టు చెప్పుకొచ్చారు. ఆ మాట విన్న వెంటనే షాపు యజమాని ఆశ్చర్యపోయి, వెంటనే షాపును తిరిగి తెరిచి, ఆమెకు 'మిష్టి దోయ్' సర్వ్ చేశాడన్నారు. అయితే రెజీనా చెప్పిన ఈ సంఘటనను విన్న అభిమానులు సోషల్ మీడియాలో తెగ కామెంట్లు చేస్తున్నారు. కొందరు "మిష్టి దోయ్ కోసం ఇంత కష్టమా!" అని నవ్వులు పూయిస్తుంటే.. మరికొందరు "రెజీనా లాంటి స్టార్స్ కూడా ఇలాంటి చిన్న అబద్ధాలు చెబుతారంటే చాలా క్యూట్‌గా ఉంది" అని కామెంట్ చేస్తున్నారు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+