పేర్లే పవిత్రం...ఈ మహిళా ఆర్టిస్టులు మాత్రం
సినీ ఇండస్ట్రీలో ఎఫైర్స్ అనేవి సర్వ సాధారణం. హీరో, హీరోయిన్ల మధ్య రొమాన్స్, ఎఫైర్లు చాలానే తెర మీదకు వచ్చాయి వస్తున్నాయి కూడా. సౌత్‌లో పోలిస్తే బాలీవుడ్ ఇలాంటివి కాస్తా ఎక్కువే అని చెప్పాలి. బాలీవుడ్‌లో హీరో, హీరోయిన్ల మధ్య రూమర్స్ చాలానే వినిపిస్తుంటాయి. ఇప్పుడున్న హీరో , హీరోయిన్లందరూ కూడా ఒకరితో రిలేషన్ మెయిన్‌టైన్ చేసి, మరొకరిని వివాహం చేసుకున్నా వారే. మెచురిటీ పేరుతో వారు శృంగారం గురించి కూడా బహిరంగంనే మాట్లాడుతుంటారు. తాజాగా ఎఫైర్ల గురించి సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతోంది.
ఇండస్ట్రీలో పవిత్ర పేరున్న మహిళా నటులు ఎఫైర్లు కొనసాగిస్తున్నారనేది దీని సారాంశం. పవిత్ర అనే పేరుకు చాలా కళంకం తెచ్చే పనులు చేస్తున్నారు కొంతమంది నటీమణులు. ఈ మధ్యకాలంలో పవిత్ర పేరుతో ఉన్న ఆర్టిస్టులు పలు ఎఫైర్లతో వార్తల్లో నిలిచారు. ఆ లిస్ట్‌ను ఓసారి పరిశీలిస్తే..మొదటగా నటి పవిత్ర లోకేష్ గురించి చెప్పుకొవాలి. నరేష్‌తో నాలుగో పెళ్లి వ్యవహారం ఆమె పరువు పూర్తిగా పోయేలా చేసింది.

నాలుగో పెళ్లి తర్వాత నరేష్‌తో పాటు పవిత్ర లోకేష్‌కు సైతం సినిమాల్లో అవకాశాలు తగ్గిపోయాయి. ఇక ఇటీవలే యాక్సిడెంట్‌లో చనిపోయిన పవిత్ర జయరాం. ఆమెకు పెళ్లై , ఇద్దరు పిల్లలున్నప్పటికి చందు అనే తోటి యాక్టర్‌తో ఎఫైర్ పెట్టుకుంది.పెళ్లయిన వ్యక్తితో ప్రేమలో పడి ఆక్సిడెంట్‌లో కన్నుమూసిన ఆమె గురించి ప్రస్తుతం లోకం చాలా చెడుగానే మాట్లాడుకుంటుంది.చందు జీవితం ఆమె వల్లే నాశనం అయ్యింది అంటూ ట్రోల్స్ కూడా గట్టిగా చేశారు.
తాజాగా కన్నడ ఇండస్ట్రీలో పవిత్ర గౌడ. కన్నడ స్టార్ హీరో దర్శన్ పవిత్ర గౌడ అనే నటితో ఎఫైర్ సాగించాడు. ఆమెను రేణుక స్వామి అనే వ్యక్తి కొంతకాలంగా లైంగికంగా వేధిస్తున్నాడు. రేణుక స్వామి తనని వేధిస్తున్నాడనే విషయాన్ని పవిత్ర గౌడ దర్శన్‌కు తెలియజేసింది. దీంతో రేణుక స్వామిని దర్శన్ హత్య చేయించినట్టు తెలుస్తోంది. ఈ కేసులో దర్శన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.దీంతో పవిత్ర పేరున్న వీరంతా కూడా పెళ్లయిన వ్యక్తులతో రిలేషన్షిప్ లో ఉన్నవారే కావడం విశేషం.












Click it and Unblock the Notifications