వరుణ్ తేజ్ పెళ్లిపై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్
మెగా కుటుంబంలో పెళ్లి సందడి కనిపిస్తుంది. మెగా బ్రదర్ నాగబాబు తనయుడు , హీరో వరుణ్ తేజ్ పెళ్లి ఫిక్స్ అయిన సంగతి అందరికి తెలిసిందే. హీరోయిన్ లావణ్య త్రిపాఠితో ప్రేమాయణం సాగించిన వరుణ్ తేజ్.. తమ ప్రేమను పెళ్లి పీటలు వరకు తీసుకువెళ్లాడు. వీరి పెళ్లికి ఇరు కుటుంబాలు అంగీకరించడంతో..మెగా ఇంట్లో పెళ్లి బాజాలు మోగనున్నాయి.
నవంబర్ 1న ఇటలీలో ఈ జంట ఏడు అడుగులు వేయబోతున్నారు. వరుణ్ తేజ్ - లావణ్య త్రిపాఠిల పెళ్లిని ఇటలీలో గ్రాండ్‌గా సెలబ్రేట్ చేయడానికి మెగా ఫ్యామిలీ సిద్దం అవుతుంది. ఇప్పటికే మెగా ఫ్యామిలీతో పాటు అల్లు ఫ్యామిలీ ఇటలీ బయలు దేరింది. చిరంజీవి, రామ్ చరణ్, సాయి ధరమ్ తేజ్, అల్లు అర్జున్ ఇలా మెగా హీరోలందరూ కూడా ఇటలీ చేరుకున్నారు.

పవన్ కల్యాణ్ కూడా తన భర్యతో కలిసి వరుణ్ తేజ్ పెళ్లి కోసం ఇటలీకి బయలుదేరారు. ఇదిలా వరుణ్ తేజ్ పెళ్లి గురించి పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ తాజాగా స్పందించారు. ఓ మీడియా ఛానెల్‌తో ఆమె మాట్లాడుతూ.. వరుణ్ తేజ్ వెడ్డింగ్‌కి తనకు కూడా ఆహ్వానం అందిందని.. అయితే ఆ పెళ్లికి తాను వెళ్లడం లేదని రేణు దేశాయ్ తెలిపారు.
నిహారిక పెళ్లికి కూడా తనకు ఇన్విటేషన్ వచ్చిందని..పిల్లల్ని పంపించాను కాని తాను మాత్రం ఆ పెళ్లికి వెళ్లలేదని రేణు దేశాయ్ వెల్లడించారు. వరుణ్ తేజ్ వివాహానికి కూడా పిలుపు వచ్చింది కాని .. తాను వెళ్లాలని అనుకోవడం లేదని రేణు దేశాయ్ వెల్లడించారు. వరుణ్ తేజ్‌కు నాకు మంచి అనుబంధం ఉందని..ఎనిమిదేళ్ల వయస్సు నుంచి నేను వరుణ్ తేజ్‌ను చూస్తున్నానని.. నా కళ్ల ముందే పెరిగాడని..నేను అతని పెళ్లికి వెళ్లకపోయిన.. నా బెస్ట్ విషెష్ ఎప్పుడు వరుణ్‌కు ఉంటాయని రేణు దేశాయ్ తెలిపారు.
-
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
IPL తొలి మ్యాచ్ లోనే సెన్సేషన్, ఎవరీ కూపర్ కనోలీ - సూర్యవంశీని డామినేట్ చేస్తూ..!! -
పాల ధరలు భారీగా పెంపు, ఒకే సారి - కొత్త రేట్లు ఇలా..!! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
Amaravati Bill: పార్లమెంట్ లో అమరావతి బిల్లు..! కాంగ్రెస్ స్టాండ్ ఇదే..! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
జన్మ నక్షత్రం మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
ఈ టైంలో కరెంట్ వాడితే బాదుడే, విద్యుత్ ఛార్జీల్లో మార్పులు - నేటి నుంచే అమలు..!!












Click it and Unblock the Notifications