రెండో పెళ్లిపై బిగ్ అప్డేట్ ఇచ్చిన రేణు దేశాయ్..వాళ్ల కోసమే అంటూ కామెంట్
సోషల్ మీడియాలో ఇటీవల కాలంలో బాగా వినిపిస్తోన్న సెలబ్రిటీలలో రేణు దేశాయ్ కూడా ఒకరు. పవన్ కల్యాణ్‌తో విడిపోయిన తర్వాత రేణు దేశాయ్ తన ఇద్దరి పిల్లలతో పుణేలో సెటిల్ అయ్యారు. ఇండస్ట్రీకి దూరం అయినప్పటికీ సోషల్ మీడియా ద్వారా తన వ్యక్తిగత విషయాలను అభిమానులతో పంచుకుంటూనే ఉంటున్నారు.ఇదే సమయంలో తనని ట్రోల్ చేసి వారికి సైతం ఆమె తనదైనరీతిలో సమాధానం ఇస్తున్నారు. పవన్‌తో విడాకులపై ఆయన అభిమానులు పలుమార్లు రేణు దేశాయ్‌ను ఇబ్బంది పెట్టడం జరిగింది.
పవన్‌కు విడాకులు ఇచ్చి తప్పు చేశారని ఓ నెటిజన్ కామెంట్ చేయగా, మా పవన్ అన్నయ్యలాగా గొప్ప మనసు ఉన్నవారు అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. వీరిపై చేసిన కామెంట్స్‌పై రేణు దేశాయ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పవన్‌ను నేను వదిలేయలేదని..ఆయనే నన్ను వదిలేసి మరో అమ్మాయిని వివాహం చేసుకున్నారని చెబుతూ వారికి స్ట్రాంగ్ కౌంటరిచ్చారు.ఇదే సమయంలో సమాజంలో జరుగుతున్న తప్పులపై రేణు దేశాయ్ ఎప్పటికప్పుడు తనదైన శైలిలో స్పందిస్తుంటారు.

పవన్ కల్యాణ్‌తో విడాకులు తర్వాత ఆమె రెండో పెళ్లి చేసుకోవాలని భావించారు. కానీ ఆ సమయంలో పవన్ అభిమానుల నుంచి తీవ్ర విమర్శలు రావడంతో ఆమె తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. తాజాగా తన రెండో పెళ్లిపై రేణు దేశాయ్ స్పందించారు.తన రెండో పెళ్లి గురించి అభిమానులు ఆశగా ఎదురు చూస్తున్నారని ఆమె తెలిపారు.నేను నా వివాహం గురించి వందసార్లు మాట్లాడగలను. ఎందుకంటే ఇది ఖచ్చితంగా నా జీవితాన్ని, నా సన్నిహిత కుటుంబాన్ని ప్రభావితం చేస్తుంది. దయచేసి మీ విద్య, జర్నలిజం అనుభవాన్ని కొంతమంది పెద్దల రెండవ వివాహం కోసం ఉపయోగించవద్దు. ఎందుకంటే ఇది సమాజం లేదా శాంతిభద్రతలను ప్రభావితం చేయదంటూ రేణు దేశాయ్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చింది.ప్రస్తుతం తన పిల్లలు కెరీర్ మీద దృష్టి సారించానని, వాళ్లను ఓ దారి చేర్చిన తర్వాత తన రెండో పెళ్లిపై ఓ నిర్ణయం తీసుకుంటానని రేణు దేశాయ్ గతంలో తెలిపారు.
ఇక రేణు దేశాయ్ విషయానికి వస్తే.. రేణు దేశాయ్ చాలాకాలం తర్వాత తెలుగు సినిమాలో నటించారు. రేణు దేశాయ్ ఇటీవల తన సెకండ్ ఇన్నింగ్స్‌ను స్టార్ట్ చేశారు. రవితేజ హీరోగా వచ్చిన టైగర్ నాగేశ్వరరావు సినిమాలో రేణు దేశాయ్ ఓ ముఖ్య పాత్రలో నటించింది. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బొల్తా కొట్టింది. ఇక ఇటీవలే ఆమె తన తర్వాత సినిమా గురించి కీలక ఆప్డేట్ ఇచ్చారు. ఏడాది తర్వాత మళ్లీ మేకప్ వేసుకుంటున్నానంటూ తన కొత్త సినిమా గురించి అధికారికంగా ప్రకటించారు.అయితే ఎవరి సినిమాలో నటిస్తుందో మాత్రం వెల్లడించలేదు. మొత్తానికి ఏడాది తర్వాత రేణు దేశాయ్ తిరిగి సినిమాల్లో నటించడానికి సిద్ధం కావడంతో ఆమె అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
-
మరో కొత్త కాన్సెప్ట్..? గ్యాప్ ఇవ్వు అన్న కాస్తా..! -
ఆ సినిమా వదులుకోవడమే ప్రభాస్ కెరీర్‌కు ‘శ్రీరామరక్ష’ -
తెలుగులో ఇంత బోల్డ్ కంటెంటా...బాబోయ్ అన్ని ఆ సీన్లే..! -
అలిగిన `స్వీటీ`ని ఇంటికి భోజనానికి పిలిచిన విజయ్- రష్మిక -
ఉగాది నుంచి మీన రాశి, కుంభరాశి వారి జాతక ఫలం -
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
మోదీ కేబినెట్ లోకి జనసేన, ఏపీలో బీజేపీకి మరో మంత్రి పదవి - ఆయనకే ఛాన్స్..!! -
మందుబాబులకు కిక్ ఇచ్చే కబురు- ఏప్రిల్ 1 నుండి.. -
విజయ్, త్రిష పెళ్లి డేట్ ఫిక్స్.. ఎన్నికలకు ముందే..!! -
T20 World Cup Final: అచ్చిరాని స్టేడియంలో కివీస్ తో ఫైనల్-పిచ్ లో కీలక మార్పు..! -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
T20 World Cup: భారత్ కు అదే మైనస్, మాకు ప్లస్-ఫైనల్ పై తేల్చేసిన కివీస్ కెప్టెన్..!












Click it and Unblock the Notifications