పవన్ ఫ్యాన్స్‌పై రేణు దేశాయ్ ఆగ్రహం

జనసేన అధినేత పవన్ కల్యాణ్ తొలిసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పవన్ కల్యాణ్ పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. దీంతో మెగా అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. ఈక్రమంలో పవన్ కల్యాణ్ కొడుకు అకిరా నందన్ వార్తల్లో నిలిచారు. పవన్ కల్యాణ్ ఎమ్మెల్యేగా విజయం సాధించిన తర్వాత ఆకిరా నందన్ సెంట్రర్ ఆఫ్ ది ఎట్రాక్షన్‌గా మారారు. పవన్ విజయం సాధించిన సమయంలో కూడా అకిరా తండ్రితోనే ఉన్నారు.

చంద్రబాబు, ప్రధాని మోదీని పవన్ కలిసిన సమయంలో అకిరా ఆయన వెంటే ఉన్నారు. దీంతో అకిరా నందన్‌పై అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్స్ వర్షం కురిపిస్తున్నారు. ఇప్పుడు అకిరాను PSPK2 అంటూ కామెంట్స్ చేస్తున్నారు.అకిరాను పవన్ కళ్యాణ్ 2 (PK 2) అంటూ అభిమానంగా పిలుచుకుంటున్నారు. అంతేకాదు తొందరగా హీరో అయిపో అన్న అని ఒకరు, ఎడిటర్ అవ్వండి అంటూ మరొకరు కామెంట్స్ చేస్తున్నారు. అయితే దీనిపై రేణు దేశాయ్ పవన్ ఫ్యాన్స్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు.

Renu Desai slams by pawan kalyan fans

ఆకిరాకు కాని.ఆయన తండ్రి పవన్ కల్యాణ్‌కు కానీ జూనియర్ పవన్ కళ్యాణ్ అని పిలిపించుకోవడం ఇష్టముండదు. మీ ఫీలింగ్స్‌ను ఆకిరా మీద బలవంతంగా రుద్దకండి అంటూ పవన్ ఫ్యాన్స్ చేసిన కామెంట్స్‌కు ఆమె రిప్లై ఇచ్చారు. ఆకిరా పుట్టిన దగ్గర నుంచి కూడా నేను అతనికి అభిమానిని..అతను ఎప్పుడు నటిస్తాడా అని నాకు ఎంతో అతృతుగా ఉంది. అయితే అంతకంటే ముందు నేను ఆయన తల్లిని. అతను ఏ నిర్ణయం తీసుకున్న గౌరవించాల్సిన బాధ్యత నాపై ఉందంటూ ఉందని రేణు దేశాయ్ చెప్పుకొచ్చారు. ఆకిరా సినీ ఎంట్రీపై ఇలాంటి చర్చలు పెట్టి చిరాకు తెప్పించకండి.. ప్లీజ్ అర్థం చేసుకోండంటూ తన పోస్ట్‌లో రాసుకొచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+