పవన్ కల్యాణ్‌కు రేణు దేశాయ్ షాక్..ఆ పార్టీ తరుఫున ప్రచారం..పోస్ట్ వైరల్

పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ మరోసారి వార్తల్లో నిలిచారు. గతంలో కంటే ఆమె ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కువగా కనిపిస్తున్నారు. పవన్ కల్యాణ్‌తో విడిపోయిన తరువాత రేణు దేశాయ్‌ తన ఇద్దరి పిల్లలతో పుణేలో సెటిల్ అయ్యారు. ఇండస్ట్రీకి దూరం అయినప్పటికీ సోషల్ మీడియా ద్వారా తన వ్యక్తిగత విషయాలను అభిమానులతో పంచుకుంటూనే ఉన్నారు.

పవన్ కల్యాణ్‌తో విడిపోయిన తరువాత రేణు దేశాయ్‌ రెండో పెళ్లి చేసుకోవాలని ప్రయత్నించింది. పుణేకు చెందిన ఓ వ్యాపారవేత్తను ఆమె రెండో వివాహం చేసుకోవాలని భావించింది. దీనికి సంబంధించిన ఫొటోలను కూడా రేణు దేశాయ్‌ విడుదల చేసింది. అయితే పవన్ కల్యాణ్ అభిమానులు రేణు దేశాయ్‌ రెండో పెళ్లి చేసుకోవడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. అసభ్యకరంగా మెసేజ్‌లు పెట్టారు. దీనిపై రేణు దేశాయ్ వారికి గట్టిగానే కౌంటరిచ్చింది.

renu desai support to bjp candidate madhavi latha

మీ అభిమాన హీరో మరో పెళ్లి చేసుకోవచ్చు కానీ.. నేను చేసుకుంటే తప్పా అంటూ అభిమానులను ప్రశ్నించింది. ఇక రేణు దేశాయ్ ఇటీవలే తన సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టారు. రేణు దేశాయ్‌ చాలాకాలం తరువాత తెలుగు సినిమాలో నటించింది. రేణు దేశాయ్ ఇటీవల తన సెకండ్ ఇన్నింగ్స్‌ను స్టార్ట్ చేసింది. రవితేజ హీరోగా తాజాగా నటించిన టైగర్ నాగేశ్వరరావు సినిమాలో రేణు దేశాయ్‌ ఓ ముఖ్య పాత్రలో నటించింది. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బొల్తా కొట్టింది. రేణు దేశాయ్ రాజకీయలపై తనదైనశైలిలో స్పందిస్తున్నారు.

ఆమె ఇటీవలే తన సోషల్ మీడియాలో ఓ వీడియోను షేర్ చేసింది. తన చేతి మీద ఉన్న టాటూను తన ఇన్‌‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. కొన్నిసార్లు పదాల కంటే చిత్రాలు బిగ్గరగా మాట్లాడతాయంటూ ఆ ఫొటోకు క్యాప్షన్ రాసుకొచ్చింది. దీనికి 'ఎలక్షన్ 2024' అనే హ్యాష్ టాగ్‌ను జతచేసింది. రేణు దేశాయ్ తన చేతిపై బీజేపీ గుర్తును టాటూగా వేయించుకోవడంతో ఆమె ఆ పార్టీకి మద్దతుగా ఈ పోస్ట్ చేసిందని నెటిజన్లు అభిప్రాయపడ్డారు.

రేణు దేశాయ్ తాజాగా చేసిన ఓ పోస్ట్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఆమె బీజేపీ అభ్యర్థి మాధవీలతకు మద్దతుగా నిలిచారు.మాధవీలత స్ట్రాంగ్ ఉమన్ అని పేర్కొంటూ ప్రశంసించారు. చాలా రోజుల తర్వాత ఇలాంటి మహిళను చూశానని చెప్పింది. అయితే ఈ పోస్ట్ కోసం తాను ఎవరి దగ్గర డబ్బులు తీసుకోలేదని, తనకు అనిపించిందే షేర్ చేశానని తెలిపింది. తన మాజీ భర్త పవన్ కల్యాణ్‌కు మద్దతు తెలపకుండా పక్క రాష్ట్రంలో ఉన్న బీజేపీ అభ్యర్థికి మద్దతిస్తూ రేణు దేశాయ్ పోస్ట్ పెట్టడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+