తిక్క ప్రశ్న అడిగిన రిపోర్టర్..చెప్పుతో కొట్టిన స్టార్ హీరోయిన్

ఇప్పుడున్న మీడియా రిపోర్టర్లు హీరో, హీరోయిన్లను పిచ్చి పిచ్చి ప్రశ్నలు అడుగుతున్నారు. కానీ అప్పట్లో హీరో,హీరోయిన్లంటే ఓ గౌరవం ఉండేది. ఇలాగే ఓ హీరోయిన్‌ను రిపోర్టుర్ పిచ్చి ప్రశ్న అడగడంతో ఆమె ఏకంగా అతన్ని చెప్పుతో కొట్టిన ఘటన అప్పట్లో పెద్ద సంచలనం సృష్టించింది. పిచ్చి ప్రశ్న అడగడంతో తిక్కలేసిన హీరోయిన్ సదరు రిపోర్టర్ని చెప్పుతో కొట్టి తన కోపాన్ని తీర్చుకుంది. ఇలా రిపోర్టర్ని కొట్టిన హీరోయిన్ మరెవ్వరో కాదు అలనాటి నటి వాణిశ్రీ. ఇప్పుడైతే చాలామంది హీరోయిన్లు వస్తున్నారు కానీ గతంలో హీరోయిన్ల పరిమిత సంఖ్యలోనే ఉండేవారు. ముఖ్యంగా పాతకాలం నాటి హీరోయిన్లు అంటే మొదటిగా గుర్తుకు వచ్చేది సావిత్రి. ఆ తర్వాత ప్రముఖంగా వినిపించిన పేర్లలో వాణిశ్రీ కూడా ఒకరు.

కెరీర్ స్టార్టింగ్‌లో చిన్న చిన్న రోల్స్‌లో నటించిన వాణిశ్రీ ఆ తర్వాత హీరోయిన్‌గా మారారు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ, శోభన్ బాబు వంటి హీరోలతో నటించి స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు దక్కించుకున్నారామె. ముఖ్యంగా అక్కినేని- వాణిశ్రీలది సూపర్ హిట్ కాంబినేషన్. అప్పట్లో వీరిద్దరి కాంబినేషన్‌కు మంచి డిమాండ్ ఉండేది. ఇప్పటి తరానికి వాణిశ్రీ నటన గురించి పెద్దగా తెలియకపోవచ్చు కానీ అప్పట్లో ఆమె నటనకు వీరాభిమానులు ఉండేవారు. ముఖ్యంగా తెర మీద పొగరుబోతుగా కనిపించాలంటే ఒన్ అండ్ ఒన్లీ ఆప్షన్ వాణీశ్రీనే.

reporter asked a tough question star heroine hit with a shoe

ఎప్పుడు కూల్‌గా ఉండే వాణీ శ్రీ..ఒకసారి ఏకంగా రిపోర్టర్ని చెప్పుతో కొట్టి సంచలనం సృష్టించారు. ఓ సినిమా వేడుక విషయంలో సదరు సీనియర్ రిపోర్టర్ అడిగిన తిక్క ప్రశ్నకి రేగిన వాణిశ్రీకి పిచ్చ కోపం వచ్చిందట. తన కోపాన్ని తట్టుకోలేక చెప్పుతీసి వెంటనే ఆ రిపోర్టర్ని కొట్టేశారట. ఇది అప్పట్లో పెద్ద సంచలనంగా మారింది. కొన్ని పత్రికలు ఆమెకి వ్యతిరేకంగా ఆర్టికల్స్ రాసేవట.అందులో ఒక పత్రిక పేరు 'బొగ్గు శ్రీ'.కేవలం వాణిశ్రీని ఏడిపించడం కోసమే ఈ పత్రికనే నిర్వహించేవారట.

వాణిశ్రీ నలుపుగా ఉండడంతోనే బొగ్గు శ్రీ అనే పేరుతో ఆ పత్రిక నడిచేదట.అందులో వాణిశ్రీ గురించి ఇష్టం వచ్చిన రాతలు రాసే వారట.అప్పటికే తెలుగు, తమిళం సినిమాలతో బిజీగా ఉన్న వాణిశ్రీకి ఈ విషయం తెలియదట. అయితే ఓ క్షణంలో ఆమెకి ఈ విషయం తెలియడంతో సదరు పత్రికపై మండిపడ్డారట. ఆ పత్రికకు సంబంధించిన విలేకరు ఒకరు వాణిశ్రీ కి ఎదురుపడి, పిచ్చి ప్రశ్న అడగడంతో తిక్క రేగిన వాణిశ్రీ అతన్ని చడా మడా తిట్టేసి, తన కాలికొన్న చెప్పును తీసి వాయించేశారట. ఈ ఘటన తర్వాత ఆ పత్రిక కనుమరుగయ్యింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+