రష్మిక పెళ్లిపై ప్రశ్న.. కాంతార స్టార్ షాకింగ్ రియాక్షన్!
నేషనల్ క్రష్ రష్మిక మందన, రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ నేడు(గురువారం) ఉదయపూర్‌లో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. వీరి పెళ్లి వేడుకలు ఒకవైపు ఘనంగా జరుగుతుండగా.. మరోవైపు రష్మిక గతం మళ్లీ చర్చల్లోకి వచ్చింది. ముఖ్యంగా రష్మికను కన్నడ ఇండస్ట్రీకి పరిచయం చేసిన దర్శకుడు, నటుడు రిషబ్ శెట్టి ఆమె పెళ్లిపై స్పందించిన తీరు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
రష్మిక పెళ్లిపై ప్రశ్న.. అడగ్గానే నవ్వుతూ వెళ్లిపోయిన రిషబ్!
రిషబ్ శెట్టి ప్రస్తుతం ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో 'జై హనుమాన్' చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా లాంచ్ సందర్భంగా మంత్రాలయంలో జరిగిన ఓ కార్యక్రమంలో రిషబ్ పాల్గొన్నారు. అక్కడ మీడియా ప్రతినిధులు ఆయనను వరుస ప్రశ్నలు అడిగారు. మొదట తన సినిమా గురించి ఓపిగ్గా సమాధానమిచ్చిన రిషబ్.. ఓ రిపోర్టర్ "సార్, రష్మిక మందన పెళ్లి చేసుకుంటున్నారు కదా.. మీకు ఆహ్వానం అందిందా?" అని అడగ్గానే తన ప్రవర్తన మార్చుకున్నారు. ఆ ప్రశ్నకు ఎటువంటి సమాధానం చెప్పకుండా, కేవలం ఒక చిన్న నవ్వు నవ్వి 'థాంక్యూ' అని చెప్పి అక్కడి నుంచి వెళ్లీపోయారు.

వివాదానికి కారణం ఏంటి?
రష్మిక మందన మొదటి సినిమా 'కిరిక్ పార్టీ'కి రిషబ్ శెట్టి దర్శకుడు. ఆ సినిమా హీరో రక్షిత్ శెట్టితో రష్మికకు 2017లో నిశ్చితార్థం జరిగింది, కానీ 2018లో అది రద్దయ్యింది. అప్పటి నుంచి రక్షిత్ శెట్టి స్నేహితులైన రిషబ్ శెట్టి, ప్రమోద్ శెట్టిలకు రష్మికకు మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. గతంలో ఒక ఇంటర్వ్యూలో రష్మిక తనను పరిచయం చేసిన నిర్మాణ సంస్థ పేరు చెప్పకుండా 'సోకాల్డ్ ప్రొడక్షన్ హౌస్' అని సైగ చేయడంతో రిషబ్ తీవ్రంగా హర్ట్ అయ్యారు. అప్పట్లో రిషబ్ స్పందిస్తూ.. "నాకు 'అలాంటి' నటీమణులు నచ్చరు, నేను కొత్తవారితో పనిచేయడానికే ఇష్టపడతాను" అని రష్మికపై పరోక్షంగా సెటైర్లు వేశారు.
ప్రమోద్ శెట్టి ఘాటు వ్యాఖ్యలు
ఇటీవలే రక్షిత్ శెట్టి మరో సన్నిహితుడు ప్రమోద్ శెట్టి కూడా రష్మిక పెళ్లిపై స్పందిస్తూ.. "ఆమె మాకు ఇన్విటేషన్ పంపదని మాకు తెలుసు, అది కొత్తేమీ కాదు. రక్షిత్ శెట్టి ఏమీ చాక్లెట్ దొరకలేదని బాధపడే చిన్న పిల్లాడు కాదు" అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై రష్మిక అభిమానులు సోషల్ మీడియాలో మండిపడుతున్నారు. ఏది ఏమైనా, గతాన్ని పక్కన పెట్టి రష్మిక-విజయ్ జోడీ ప్రస్తుతం తమ కొత్త జీవితాన్ని ప్రారంభించారు. నేడు ఉదయం 10 గంటలకు వీరి వివాహం ఘనంగా జరిగింది.












Click it and Unblock the Notifications