ఛాన్సుల కోసం తప్పట్లేదా.. చూపించడం ఒక్కటే దారంటున్న బాక్సింగ్ బ్యూటీ !!
తెలుగు, తమిళ, హిందీ ప్రేక్షకుల మనసుల్లో తన ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న నటి "రితికా సింగ్". నిజ జీవితంలో బాక్సింగ్ ఛాంపియన్‌గా పేరుపొందిన ఈ లేడీ.. తెరపై కూడా అదే ప్యాషన్‌తో దూసుకెళ్తుంది. ముంబైలో జన్మించిన రితికా సింగ్.. చిన్నతనం నుంచే బాక్సింగ్‌పై ఆసక్తి కనబరిచింది. తండ్రి కూడా బాక్సింగ్ కోచ్ కావడంతో ఆ క్రీడపై ఆమెకు ప్రత్యేకమైన చూపి జాతీయ స్థాయి బాక్సింగ్ పోటీల్లోసత్తా చాటింది.
సినీ కెరీర్..
తమిళ చిత్రం 'ఇరుదు సుట్రు' (2016) తో కెరీర్ మొదలు పెట్టింది. ఆ తర్వాత అదే సినిమా హిందీలో 'సాలా ఖడూస్' పేరుతో విడుదలై.. రితికాకు జాతీయస్థాయి గుర్తింపును తెచ్చిపెట్టింది. తమిళం, హిందీ తర్వాత రితికా సింగ్ తెలుగు ప్రేక్షకులను సైతం అలరించింది. విక్టరీ వెంకటేష్ సరసన 'గురు' (2017) సినిమాతో బాక్సర్ పాత్రలో ఆమె నటన ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ క్యారెక్టర్ ఆమెకు తెలుగులో మంచి గుర్తింపును తెచ్చిపెట్టింది.

ఆ తరువాత ఆమె 'శివలింగ', 'ఓ మై కడవలే', 'ఇన్ కార్' వంటి విభిన్న కథలతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఇటీవల వచ్చిన 'వెట్టయాన్' చిత్రంలో పోలీస్ ఆఫీసర్‌గా కనిపించింది. ఆ సినిమాలో సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రధాన పాత్రలో ఉండడంతో ఆమె పాత్ర పెద్దగా మెరవకపోయినా.. ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. ప్రస్తుతం ఆమె అరవింద్ స్వామి సరసన 'వనంగమూడి' సినిమాలో నటిస్తోంది.
హాట్ అండ్ బోల్డ్..
ఇటీవల ఆమె నటించిన సినిమాలు వరుసగా పెద్దగా సక్సెస్‌లు కాకపోవడంతో రితికా సింగ్ తన ఫోకస్‌ను సోషల్ మీడియాపైకి మళ్లించింది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె షేర్ చేసే ప్రతి ఫోటో అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఒకప్పుడు సాదాసీదా లుక్‌లో కనిపించిన రితికా, ఇప్పుడు కొత్తగా గ్లామర్ అవతారంలో మెరిసిపోతోంది. తన లేటెస్ట్ ఫోటోషూట్లలో ఆమె బోల్డ్ అండ్ కాంఫిడెంట్ పోజులు ఇస్తూ, ఫ్యాన్స్‌ను మంత్రముగ్ధులను చేస్తోంది.
గ్లామర్ గేట్లు ఎత్తేయడంతో రితికా సింగ్ ఫోటోలు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి. అలానే గ్లామర్ ఫోటోషూట్స్‌తో పాటు రితికా సింగ్ ఫిట్నెస్, బాక్సింగ్ ప్రాక్టీస్ వీడియోల్ని కూడా అప్పుడప్పుడు షేర్ చేస్తూ ఫాలోవర్స్ ని పెంచుకుంటుంది. మరి అందాల ఆరబోతతో అయిన ఈ భామకు ఛాన్స్ లు వస్తాయేమో చూడాలి.












Click it and Unblock the Notifications