"పవన్" పోరాట శోకానికి అల్లాడిపోయిన "రీతూ" .. రియల్ కపుల్ కూడా సరిపోరు !
బిగ్ బాస్ సీజన్ 9కు త్వరలోనే ఎండ్ కార్డు పడనుంది. ప్రస్తుతం హౌస్ లో 9 మంది హౌస్ మేట్స్ మాత్రమే మిగిలారు. కాగా వారంతానికి చేరుకున్న తరుణంలో ఈ సీజన్ లో చివరి కెప్టెన్ అయ్యేందుకు కెప్టెన్సీ కంటెండర్స్ గా ఆరుగురు మిగిలారు. కళ్యాణ్, డీమాన్, ఇమ్మానుయేల్, దివ్య, సంజన, రీతూ కెప్టెన్సీ రేసులో ఉండగా.. ఈ క్రమంలోనే శుక్రవారం ఆరుగురికి టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. కానీ ఇక్కడే బిగ్‌బాస్ ఊహించని ఝలక్ ఇస్తూ ఎవరు కెప్టెన్ అవ్వాలి అని రేసులో లేని సభ్యులు డిసైడ్ చేయాలని ఆదేశించాడు.
కెప్టెన్సీ రేస్ టాస్క్..
కెప్టెన్సీ కోసం జరిగిన టాస్కులో సభ్యులు బజర్ మోగినప్పుడల్లా వాళ్ల ముందున్న కత్తిని తీసుకొని తాము కెప్టెన్‌గా చూడాలనుకుంటున్న వారికి తగిన కారణాలు చెప్పి కత్తి ఇవ్వాలి. సదరు కంటెండర్ కెప్టెన్ అవ్వడానికి అర్హత లేరని భావిస్తున్న వారిని రేసు నుంచి తప్పించాలి. మొదటి రౌండ్‌లో సుమన్ శెట్టికి కత్తి దక్కగా.. రీతూకి కత్తి ఇవ్వడంతో.. ఆమె సంజనని పొడిచి రేసు నుంచి తప్పించింది. అప్పుడు వారి మధ్య మరోసారి హీటెడ్ గొడవ జరిగింది.

నెక్స్ట్ రౌండ్‌లో భరణికి కత్తి దొరగ్గా డీమాన్ కి ఇవ్వడంతో.. ఇమ్మానుయేల్‌ని పొడిచి రేసు నుంచి తప్పించాడు. వీరిద్దరి మధ్య కూడా మాటల యుద్ధం జరగగా డీమాన్ మాటలకి ఇమ్మూ బాగా హర్ట్ అయ్యాడు. చివరికి నీ నుంచి ఊహించలేదంటూ ఇమ్మూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. మళ్లీ నెక్స్ట్ రౌండ్‌లో కత్తి తనూజకి దక్కగా రీతూ చేతికి ఇవ్వడంతో దివ్యని తప్పిస్తుంది. దివ్య - రీతూ మధ్య హీటింగ్ డిస్కషన్ జరగ్గా రీతూ, డీమాన్, కళ్యాణ్ రేసులో మిగిలారు. చివరికి సంజన చేతికి కత్తి దొరకడంతో కళ్యాణ్ కి ఇస్తుంది. దీంతో కళ్యాణ్ కత్తి తీసుకొని రీతూని పొడిచి రేసు నుంచి తప్పించాడు.
డీమాన్‌న చూసి రీతూ ఎమోషనల్..
ఇక చివరికి పవన్ - కళ్యాణ్ లలో కెప్టెన్ ఎవరో డిసైడ్ చేసేందుకు 'రోడ్ టూ కెప్టెన్సీ' అనే టాస్క్ ఇచ్చాడు బిగ్‌బాస్. అందులో భాగంగా గుంతలుగా ఉన్న రోడ్డుని.. ఇసుక, కంకరని ఉపయోగించి పూడ్చి లెవల్ చేయాలంటూ చెప్తారు. ఈ టాస్కుకి తనూజ సంచాలక్‌గా ఉంటుంది. బజర్ మోగగానే కళ్యాణ్-డీమాన్ చకచకా ఆడారు. కానీ డీమాన్ కాసేపటికే అలసిపోయి బ్యాక్ పెయిన్ వస్తుంది అంటూ పడిపోతాడు.

అప్పుడు డీమాన్ ని చూసి రీతూ పక్కకెళ్లి కాసేపు ఏడ్చింది. తర్వాత మళ్లీ వచ్చీ డీమాన్‌ని ఎంకరేజ్ చేసింది. మరోవైపు కళ్యాణ్ టాస్క్ పూర్తి చేసి.. ఫ్లాగ్ ఎగరేయకుండా డీమాన్ కోసం ఆగాడు. ఇక డీమాన్ తట్టుకోలేకపోవడంతో దివ్య వచ్చి పెయిన్ రిలీఫ్ స్ప్రే కూడా కొట్టింది. అయినా డీమాన్ పరిస్థితి ఏం మారకపోవడంతో కళ్యాణ్ టాస్క్ కంప్లీట్ చేసి కెప్టెన్ అవుతాడు. అప్పుడే డీమాన్ మెడికల్ రూమ్‌కి రండి అంటూ బిగ్‌బాస్ అనౌన్స్ చేశాడు. ఇక మెడికల్ రూమ్‌కి వెళ్తూ డీమాన్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. ట్రై చేశాను చాలా ట్రై చేశాను కానీ నా వల్ల కాలేదు అంటూ రీతూని పట్టుకొని ఏడ్చేశాడు.
మరోవైపు ఫిజికల్ టాస్కుల్లోనే కాదు స్ట్రాటజీ, మైండ్ టాస్కుల్లో గట్టి పోటీ ఇచ్చి ఆడతాడు. అందుకే మొదటి మూడు వారాల్లోనే రెండు సార్లు బ్యాక్ టూ బ్యాక్ కెప్టెన్ కూడా అవుతాడు. కానీ రీతూతో బాండింగ్ తర్వాత నుంచి డీమాన్ ఆట మారిపోయింది. ఇప్పుడేమో ఇలా నొప్పి కారణంగా ఓడిపోవడం అతని ఫ్యాన్స్ కి షాక్ ఇస్తుంది. ఇక ఈ వారం హౌస్ లో డబుల్ ఎలిమినేషన్ ఉండే అవకాశం ఉందని టాక్ వినిపిస్తుంది.
-
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా?












Click it and Unblock the Notifications