"రామ్ చరణ్ అంటే తప్పులేదు..? శివాజీ అంటే తప్పేంటి..?"
టాలీవుడ్ హీరో శివాజీ.. హీరోయిన్ల వస్త్రధారణపై చేసిన వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించిన విషయం తెలిసిందే. 'దండోరా' సినిమా ప్రీ- రిలీజ్ ఈవెంట్స్ లో హీరో శివాజీ ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే శివాజీ కామెంట్స్ నెట్టింట వైరల్ కావడంతో ఆయనపై ఇతర హీరోయిన్లు, నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు. హీరోయిన్లు తమ డ్రెస్ లను ఎంపిక చేసుకోవడమనేది వారి వ్యక్తిగత విషయం.. దానిపై కామెంట్లు చేయడం సరికాదని కొందరు నెటిజన్లు విమర్శిస్తుండగా.. మరికొందరు మాత్రం శివాజీ చెప్పింది నిజమే కదా అని అంటున్నారు.
అయితే హీరో శివాజీ వ్యాఖ్యలపై.. బిగ్‌బాస్ సీజన్-8 కంటెస్టెంట్, ఆర్జే శేఖర్ బాషా తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. "చాలా మంది శివాజీ వ్యాఖ్యలను తప్పుబడుతున్నారు.. అయితే పెద్ది సినిమాలో చికిరి.. చికిరి.. పాటను అందరూ ఎంజాయ్ చేశారు. చాలా మంది అమ్మాయిలు రీల్స్ పెట్టారు. అందులో.. సరుకు సామాన్లు చూసి ఎనకే వస్తా చికిరి చికిరీ అదీ పాట.. అన్న లిరిక్స్ ఉన్నాయి. ఇవాళ్టి వరకూ ఈ లిరిక్స్ పై ఎవరూ కామెంట్ పెట్టలేదు. మనిషిని టార్గెట్ చేయాలనుకుంటే కోడిగుడ్డు మీద ఈకలు పీకొచ్చు. అయితే ఆయన ఇచ్చిన మెసేజ్ ను క్లియర్ కట్ గా చూడండి. ఆయన వాడిన భాష అభ్యంతరకరం.. దానికి ఆయన క్షమాపణ చెబితే సరిపోతుంది.." అని శేఖర్ బాషా చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ ఇన్ స్టా రీల్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
అలాగే అనూ అమీ అనే యంగ్ నటి కూడా ఇదే వ్యవహారంపై తన ఇన్ స్టా ఖాతాలో ఓ రీల్ పోస్టు చేసింది. అందులో.. " సామాన్లు అనే పదం మీకు అంత ప్లాబ్లమ్ అవుతుందా..? మరి మొన్న చికిరి చికిరి సాంగ్ లో సరుకు, సామాన్లు అనే పదాలు వచ్చినప్పుడు ఎందుకు ఎంజాయ్ చేశారు. సామాన్లు అనే పదం ఎలా పెడతారు అని అప్పుడు ఎందుకు ఫైట్ చేయలేదు.. ఆరోజు ఎక్కడికి పోయారు. ఇప్పుడు ఓ మనిషి.. మిమ్మల్ని పద్దతిగా ఉండండి అంటే తప్పైపోయింది. ఓ పని చేయండి.. విప్పుకుని తిరగండి అంటే ఆ మనిషి గ్రేట్ అయిపోతాడు కదా మీకు" అని అనూ అమీ తన కామెంట్ పెట్టింది. ఆమె వ్యాఖ్యలు సామాజిక మాధ్యమంలో వైరల్ అవుతున్నాయి.

అయితే ఇప్పటికే శివాజీ వ్యాఖ్యలపై మంచు మనోజ్, మంచు లక్ష్మి, చిన్మయి, యాంకర్ అనసూయ తదితరులు స్పందించారు. శివాజీ చేసిన వ్యాఖ్యలను తీవ్ర స్థాయిలో తప్పుబట్టారు. మరోవైపు దండోరా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో తాను చేసిన వ్యాఖ్యలపై శివాజీ మీడియాకు వివరణ ఇచ్చారు. ఆవేశంలో రెండు పదాలు నోరు జారానని అన్నారు.. ఆడబిడ్డలకు క్షమాపణలు.. నా స్టేట్ మెంట్ కు కట్టుబడి ఉన్నా.. అని తెలిపారు.












Click it and Unblock the Notifications