"రాబిన్ హుడ్" రివ్యూ.. ట్విట్టర్ రివ్యూ
నటీనటులు:నితిన్, శ్రీలీల జంటగా నటిస్తున్నారు.రాజేంద్ర ప్రసాద్, వెన్నెల కిషోర్ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.ఆస్ట్రేలియన్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ కూడా ప్రత్యేక పాత్రలో నటించారు.
దర్శకత్వం: వెంకీ కుడుముల
నిర్మాణ సంస్థ: మైత్రీ మూవీ మేకర్స్
సంగీతం: జివి ప్రకాష్ కుమార్.
వరుస ఫ్లాప్‌లతో సతమతం అవుతున్నారు యంగ్ హీరో నితిన్. ఆయన తాజాగా నటించిన చిత్రం "రాబిన్ హుడ్". శ్రీలీల హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాకు వెంకీ కుడుముల దర్శకత్వం వహించారు. గతంలో నితిన్, వెంకీ కుడుముల దర్శకత్వంలో భీష్మ సినిమా వచ్చింది. బాక్సాఫీస్ వద్ద ఆ సినిమా మంచి విజయాన్ని నమోదు చేసింది. తిరిగి వీరిద్దరి కాంబినేషన్‌లో "రాబిన్ హుడ్" రావడంతో ప్రేక్షకులకు ఈ సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. టీజర్, ట్రైలర్ ఆకట్టుకోవడంతో సినిమాపై సగటు ప్రేక్షకుడు అటెన్షన్ కూడా పెరిగింది. పైగా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ ప్రత్యేక పాత్రలో కనిపించనుండటంతో సినిమాపై అంచనాలు రెట్టింపు అయ్యాయి. శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమాపై నెటిజన్లు తమ రియాక్షన్ తెలియజేస్తున్నారు. మరి సినిమా ఎలా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
కథా నేపథ్యం:
ఈ సినిమా ఒక వినోదాత్మకమైన యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందించబడింది.నితిన్ ఇందులో ఒక ప్రత్యేకమైన పాత్రలో కనిపించనున్నారు.హీరో మానిప్యులేటర్. ఫిజికల్ స్ట్రెంత్ కంటే మెంటల్ స్ట్రెంత్ స్ట్రాంగ్ అని నమ్మే వ్యక్తి.సినిమాలో ఫస్ట్ 20 నిమిషాలు క్యారెక్టర్ ఇంట్రడక్షన్ కోసం రకరకాల గెటప్స్ అలరిస్తాయి.20 నిమిషాల తర్వాత కథ పూర్తిగా మారిపోతుంది. చాలా డిఫరెంట్‌గా ఉంటుంది.
సినిమా మొత్తం రెగ్యులర్ ఇంటర్వెల్స్‌లో ఫన్ ఉంటుంది. ఫ్యామిలీ అంతా కలిసి చూడదగ్గ ఎంటర్టైనర్ ఇది.

ప్రత్యేక అంశాలు:
డేవిడ్ వార్నర్ ప్రత్యేక పాత్రలో నటించడం ఈ సినిమాకు ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.ఈ సినిమాలో రాజేంద్ర ప్రసాద్‌ది చాలా ఇంపార్టెంట్ రోల్. ఆయన సెక్యూరిటీ ఏజెన్సీ నడుపుతుంటారు. హీరో ఆయన్ని మానిప్యులేటర్ చేసి ఓ సీరియస్ వరల్డ్‌లోకి తీసుకెళ్తాడు. ఆయన అమాయకంగా అందులో ఇరుక్కుపోతాడు. ఈ క్యారెక్టర్ రాసినప్పటి నుంచి ఆయననే ఊహించుకున్నారు.
శ్రీలీల క్యారెక్టర్ రెండో టైపు (నవ్వుతూ). తనను చాలా ఇంటెలెక్చువల్ అనుకునే అమ్మాయి. చాలా ఫన్నీగా ఉంటుంది. ఆ క్యారెక్టర్‌లో చాలా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. జివి ప్రకాష్ కుమార్‌తో వర్క్ చేయాలని ఎప్పటినుంచో ఉంది. ఆయన కరెక్ట్ టైమ్‌కు మ్యూజిక్ డెలివరీ చేసే కంపోజర్. ఇప్పటికే పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. బీజీఎం కూడా ఎక్స్‌ట్రార్డినరీగా చేశారు. "అదీ డా" సర్‌ప్రైజ్ పాట కూడా కథలో భాగంగానే వస్తుంది.
ప్రేక్షకుల స్పందన:
సినిమా విడుదలైన తర్వాత, ట్విట్టర్ లో ప్రేక్షకుల స్పందన మిశ్రమంగా ఉంది.కొంతమంది ప్రేక్షకులు సినిమాను ఆదరిస్తుంటే, మరికొందరు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. సినిమాలోని కామెడీ, యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులను అలరిస్తున్నాయి. కొందరు ఫస్ట్ హాఫ్ కామెడీ బావుందని, సెకండ్ హాఫ్ లో ఎమోషన్స్ బాగా పండాయని చెప్పారు.కొందరు సెకండ్ హాఫ్ బోరింగ్ గా ఉందని చెప్పారు. నితిన్, శ్రీలీల నటనకు ప్రశంసలు దక్కుతున్నాయి. ఈ సినిమా ఎలా ఉందో తెలుసుకోవాలంటే సినిమాను చూడాల్సిందే.












Click it and Unblock the Notifications