పెళ్లైన నెలకే విడాకులు..నటి షాకింగ్ కామెంట్స్
తమిళ నటుడు రోబో శంకర్ కూతురు ఇంద్రజ ఒక్కసారిగా వార్తల్లో నిలిచారు. ఆమె ఇటీవలే వివాహం చేసుకున్నారు. అయితే ఆమె విడాకులు తీసుకుంటారనే వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వివరాల్లోకి వెళ్తే... రోబో శంకర్‌కు తమిళ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు ఉంది. బుల్లితెర షోల ద్వారా పాపులర్ అయిన రోబో శంకర్ తరువాత పలు సినిమాల్లో నటించి పాపులర్ అయ్యాడు.
తొలుత చిన్న సినిమాల్లో నటిస్తూ.. తన కెరీర్‌ను ప్రారంభించిన రోబో శంకర్..ఇప్పుడు పెద్ద హీరోల సినిమాల్లో నటించే స్టేజ్‌కి ఎదిగాడు. మారి, వాయై మూడి పేశవం, విశ్వాసం, ఎలెన్ను వందుట్టా వెల్లైకారన్ లాంటి చిత్రాలతో రోబో శంకర్ ఫుల్ పాపులారిటీని సంపాదించుకున్నాడు. ఇటీవలే రోబో శంకర్ తన కూతురు ఇంద్రజకు వివాహం చేశాడు. ఇంద్రజ కూడా పలు సినిమాల్లో నటించింది.

విజయ్ బిగిల్ చిత్రంలో ఫుట్ బాల్ ప్లేయర్‌గా నటించిన ఇంద్రజ ..విశ్వక్ సేన్ పాగల్ చిత్రంలో ఒక పాటలో మెరిసింది.తమిళ దర్శకుడు కార్తీక్‌తో ఇంద్రజ వివాహం జరిగింది. కూతురు పెళ్లి సింపుల్‌గా చేసిన రోబో శంకర్.. రిసెప్షన్ మాత్రం గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ రిసెప్షన్‌కి చాలా మంది సెలబ్రిటీలు సందడి చేశారు. కమల్ హాసన్, శివకార్తికేయన్ వంటి స్టార్ హీరోలు రిసెప్షన్‌కి హాజరై వధూవరులని ఆశీర్వదించారు.
అయితే ఇంద్రజ తన భర్తకు విడాకులు ఇస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారంపై ఇంద్రజ మండిపడ్డారు. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఇంకెన్ని రోజులుగా జంటగా ఇంటర్వ్యూలు చేస్తారో చూద్దాం అంటూ ఓ వ్యక్తి తమను ఉద్దేశించి కామెంట్ చేశాడని ఆమె తెలిపింది.తొందరలోనే విడాకులు కూడా తీసుకుంటారని అన్నాడని..అతని పేరు కూడా గుర్తు లేదని ఇంద్రజ శంకర్ తెలిపారు.

నాకు నా భర్త మూడు ముళ్లు వేయడం చూసి కూడా అలా అనడానికి నీకు మనసు ఎలా వచ్చిందని ఇంద్రజ శంకర్ అతన్ని ప్రశ్నించింది.. అసలు వేరొకరి జీవితంపై ఎలా కామెంట్ చేస్తారు..నాకు అర్థం కాక అడుగుతున్నాను. విడాకులు తీసుకునే దాన్ని అయితే పెళ్లి ఎందుకు చేసుకుంటాను. మా వివాహం అయి కూడా నెలరోజులు కాకముందే విడాకులు తీసుకుంటారని అనడం ఏంటని అతనిపై మండిపడింది. అతని మాటలకు నాకు చాలా బాధేసింది. ప్రస్తుతం నా భర్తతో సంతోషంగా ఉన్నాను. జీవితాంతం ఉంటాను కూడా అని ఇంద్రజ శంకర్ తెలిపింది. ప్రస్తుతం ఇంద్రజ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
-
హారర్ థ్రిల్లర్ సినిమా వచ్చేస్తుంది..గూస్బంప్స్ గ్యారెంటీ బాసూ -
ఇదేం టీజర్ రా బాబోయ్.. మహేష్ అన్నకొడుకు ఏడిపించాడు భయ్యా.. మరో ఆర్ఎక్స్ 100..! -
మళ్లీ వాయిదా.. "పెద్ది" మూవీ మరో 'హరిహర వీరమల్లు' కానుందా ??? -
పగలు మనిషి.. రాత్రి అయితే.. 'రాకా' లో అల్లు అర్జున్ క్యారెక్టర్ తెలిస్తే గూస్ బంప్స్..! -
అందరి ముందే నడుం గిల్లాడంటూ ఏడ్చేసిన తెలుగు బ్యూటీ.. -
పవర్ స్టార్ "OG" సీక్వెల్ షూటింగ్ షురూ.. టైటిల్ ఇదే ?? -
చిరంజీవికి సీనియర్ NTR సినిమాల్లో అదంటే మహా ప్రాణం.. ఎవరూ ఊహించనది -
పెళ్లిపై హీరో రామ్ కీలక ప్రకటన..!! -
అలా అమరావతిలో.. కొత్త సినిమా కోసం పవన్ కళ్యాణ్ నయా ప్లాన్ !! -
మౌళి "దొంగనా కొడుకు".. మైత్రీ మూవీస్ సంచలన ప్రకటన..!! -
ఆర్భాటంగా పెళ్లి ప్రకటన చేసిన స్టార్ హీరోయిన్.. తీరా చూస్తే షాకింగ్ ట్విస్ట్! -
ప్రభాస్ రోజూ తినే ఫుడ్ ఖర్చు ఎంతో తెలుసా ? అన్నీ వెరైటీలా ??











Click it and Unblock the Notifications