Same To Same: వీరిద్దరు జిరాక్స్ కాపీ బాసూ..!
తెలుగు సినీ పరిశ్రమలో ఒకప్పుడు అగ్ర కథానాయికగా, ఆ తర్వాత రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్‌గా పేరు తెచ్చుకున్న రోజా సెల్వమణి గురించి తెలియని వారుండరు. సినిమాలకు దూరమైనా, బుల్లితెరపై, రాజకీయాల్లో ఆమె చురుగ్గా కనిపిస్తుంటారు. అయితే, ఇప్పుడు చర్చ అంతా ఆమె కూతురు అన్షు రెడ్డి గురించే.
చిన్నతనం నుంచే అద్భుతమైన ప్రతిభను కనబరిచిన అన్షు, రచయిత్రిగా పేరు తెచ్చుకుంది. ఇప్పుడు ఆమె అందం, స్టైల్ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. అచ్చం తల్లికి జిరాక్స్ కాపీలా ఉండే అన్షు రెడ్డి, తాజాగా ఒక ఈవెంట్‌లో ర్యాంప్ వాక్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. హీరోయిన్లకు ఏ మాత్రం తీసిపోని విధంగా ఆమె ధరించిన దుస్తులు, ఆమె అందం చూసి నెటిజన్లు ఆశ్చర్యపోయారు. రోజా కూడా ఈమె అందం ముందు సరితూగదంటూ కామెంట్లతో సోషల్ మీడియాలో ఆమె ఫొటోలు వైరల్ అవుతున్నాయి.

తాజాగా అన్షు తన సోషల్ మీడియాలో కొన్ని ఫొటోలను షేర్ చేసింది. ఈ ఫొటోల్లో అన్షును చూస్తుంటే ..వింటేజ్ రోజాని చూసినట్టే ఉంది. అచ్చం తల్లి మాదిరిగానే కనిపించి అభిమానులకు అన్షు గట్టి షాకే ఇచ్చింది. అన్షు ఫొటోలను చూసిన అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.రోజా ఇండస్ట్రీకి వచ్చిన తొలినాళ్లలో ఎలా ఉన్నారో అన్షు ప్రస్తుతం అలానే ఉన్నారని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.
అన్షు రెడ్డికి హీరోయిన్ మెటీరియల్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆమె నటన, డ్యాన్స్ ప్రతిభ ఎలా ఉన్నాయో తెలియదు కానీ, అవే కనుక తోడైతే, ఆమెను ఇండస్ట్రీలో ఆపడం కష్టమని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇటీవల కాలంలో చాలా మంది కొత్త హీరోయిన్లు ఎంట్రీ ఇచ్చి, ఒకటి రెండు హిట్లతోనే స్టార్ ఇమేజ్ పొందుతున్నారు. వారితో పోలిస్తే, అన్షు రెడ్డి అందం, స్క్రీన్ ప్రెజెన్స్ మరింత ఆకట్టుకునేలా ఉన్నాయి. భవిష్యత్తులో ఆమె సినీ రంగంలోకి వస్తుందా లేదా అనేది చూడాలి.
ఒకవైపు తల్లి రోజా బుల్లితెరపై మళ్లీ రీ-ఎంట్రీ ఇచ్చి రెండు షోలకు న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తూ దూసుకుపోతుంటే, మరోవైపు కూతురు అన్షు అందంతో, ప్రతిభతో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇద్దరూ తమ రంగాల్లో సత్తా చాటుతుండటం విశేషం. అన్షు సినీ రంగ ప్రవేశం ఎప్పుడు జరుగుతుందో తెలుసుకోవడానికి అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.












Click it and Unblock the Notifications