రాఖీ భాయ్‌తో జ‌త క‌ట్ట‌నున్న రౌడీ బేబీ...

కెజిఎఫ్ సినిమాతో కన్నడ సూపర్ స్టార్ యష్ భారీ విజ‌యాన్నే త‌న ఖాతాలో వేసుకున్నారు. చివరిగా ఆయ‌న 'కేజీఎఫ్2' (KGF2)తో ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేశారో అంద‌రికి తెలిసిందే. ఈ సినిమా అనంత‌రం ఏడాదిన్నర తర్వాత తన నెక్ట్స్ ప్రాజెక్ట్ పై ఈ మ‌ధ్య‌నే అనౌన్స్ మెంట్ చేశారు. Yash19కి సమయం వచ్చిందని, డిసెంబర్ 8న మూవీ టైటిల్ ను రివీల్ చేయబోతున్నట్టు మూవీ స‌భ్యులు అధికారికంగా ప్రకటించారు. అయితే, ఈ సినిమాలో రాఖిభాయ్‌తో జోడిగా రౌడీ బేబి చేస్తున్నట్లు స‌మాచారం.

లేడీ పవర్ స్టార్ సాయిపల్లవి న‌ట‌న గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఒక్క సినిమాతోనే త‌న టాలెంట్ ఏంటో నిరూపించుకుంది ఈ అమ్మ‌డు. మలయాళం నుంచి హీరోయిన్ గా గుర్తింపు దక్కించుకున్నఈ న‌టి తెలుగులో ఫిదా వంటి బ్లాక్ బాస్టర్ సినిమాలు చేసింది. ఆ సినిమా త‌ర్వాత మిడిల్ క్లాస్ అబ్బాయి', 'పడి పడి లేచే మనసు', 'లవ్ స్టోరీ', 'శ్యామ్ సింగరాయ్', 'విరాటపర్వం' వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్ష‌కుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుంది. గ్లామర్ పాత్రలకే దూరంగా ఉంటూ కేవ‌లం నటనకు ప్రాధాన్యమున్న పాత్ర‌ల‌నే ఎంచుకుంటుంది ఈ అమ్మ‌డు. ప్రస్తుతం సాయిప‌ల్ల‌వి ఒక రెండు మూడు చిత్రాలతో బిజిగా ఉంది. ఇప్ప‌డు ఆమె ఖాతాలో మ‌రోచిత్రం రాబోతుంది. న‌టుడు య‌ష్ సినిమాలో సాయిప‌ల్ల‌విని తీసుకుంటున్న‌ట్లు స‌మాచారం.

Rowdy baby to pair up with Rakhi Bhai...

యష్ సినిమాలో సాయిప‌ల్ల‌వి : సాయిపల్లవికి భారీ ఫిల్మ్ నుంచి ఆఫర్ వచ్చినట్టు తెలుస్తోంది. కెజిఎఫ్ న‌టుడు య‌ష్ హీరోగా తెర‌కెక్కున్నసినిమాలో సాయిప‌ల్ల‌విని తీసుకోనున్న‌ట్లు స‌మాచారం. ఇది ఫైన‌లా? కాదా? అన్న‌ది మ‌రికొద్ది రోజుల్లో తెలియ‌నుంది. మరోవైపు ఈ సినిమా దర్శకులు ఎవరనేది కూడా తెలియాల్సి ఉంది. న‌టి సాయి పల్లవి మాత్రం తమిళంలో శివకార్తీకేయ 21వ చిత్రం షూటింగ్‌లో బిజిగా ఉన్నారు. ఆ సినిమాతో పాటు అక్కినేని యంగ్ హీరో నాగచైతన్య 'తండేల్' చిత్రంలో కూడా ఆమె నటిస్తోంది. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై వ‌స్తున్న ఈ సినిమాను అల్లు అరవింద్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు 'కార్తీకేయ2' దర్శకుడు చందూ మొండేటి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+