విడాకుల బాటలో నయనతార..? పెళ్లి పెద్ద పొరపాటు అంటూ పోస్ట్
సౌత్‌లో స్టార్ హీరోయిన్ అంటే అందరికీ ఠక్కున గుర్తుకు వచ్చేది నయనతారనే. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో నటిస్తూ నయనతార స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. ముఖ్యంగా తమిళనాట నయనతార క్రేజ్ వేరు. అక్కడ స్టార్ హీరోలతో సమానంగా పాపులారిటీని సంపాదించుకుందామె. లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో నటిస్తూ స్పెషల్ క్రేజ్ తెచ్చుకుంది.
నయనతార దర్శకుడు విఘ్నేష్ శివన్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. విఘ్నేష్ శివన్ కన్నా ముందు శింబు, ప్రభుదేవాలతో ప్రేమయాణం సాగించింది ఈ హ్యాట్ బ్యూటీ. అయితే పెళ్లి తరువాత నయనతార హవా కాస్తా తగ్గిందనే చెప్పాలి. వివాహం తరువాత నయనతార జీవితం అంత సాఫీగా సాగలేదనే చెప్పాలి. పెళ్లి తరువాత నయనతార పలు వివాదాల్లో నిలిచింది.

సరోగసి ద్వారా పిల్లలను కనడం పెద్ద దుమారమే సృష్టించింది. ఈ సమస్య ముగిసి వెంటనే నయనతార నటించిన అన్న పూరణి అనే సినిమా హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయంటూ కొందరు కోర్టు వరకు వెళ్లారు. నయనతారకు పెళ్లి తరువాత కష్టాలు మొదలవుతాయని .. ఆమె విడాకులు తీసుకోవడం ఖాయమని గతంలోనే ప్రముఖ వేణు స్వామి చెప్పడం జరిగింది.
ఇప్పుడు దానికి తగ్గట్టుగానే నయనతార అడుగులు వేస్తున్నట్టు స్పష్టం అవుతుంది. నయనతార తాజాగా తన సోషల్ మీడియాలో ఓ పోస్ట్‌ను షేర్ చేసింది. ఆ పోస్ట్‌లో వైవాహిక జీవితం గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది నయనతార.
#Nayanthara posted this and deleted. Nayan, blink twice if you’re in trouble pic.twitter.com/X5GpPsXzvu
— Suria🧘🏽 (@suria____) July 2, 2025
'తెలివి తక్కువ వ్యక్తిని పెళ్లి చేసుకున్నప్పుడు మ్యారేజ్ అనేది పెద్ద మిస్టేక్. నీ భర్త చేసే పనులకు నువ్వు బాధ్యత వహించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పురుషులు సాధారణంగా మెచ్యూర్ కాదు. నన్ను ఒంటరిగా వదిలేయండి. నేను ఆల్రెడీ చాలా ఫేస్ చేశా మీవల్ల' అంటూ నయనతార తన పోస్ట్‌లో రాసుకొచ్చింది. అయితే ఆమె ఈ పోస్ట్ ఎవర్ని ఉద్దేశించి పెట్టారనేది మాత్రం వివరణ ఇవ్వలేదు.
దీంతో నయనతార తన భర్తకు విడాకులు ఇవ్వడానికి రెడీ అవుతున్నారంటూ నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఏడేళ్లపాటు రిలేషన్‌లో ఉండి మరీ విఘ్నేశ్ శివన్‌ను నయనతార పెళ్లాడింది. 2022 జూన్‌లో వీరు వివాహబంధంలోకి అడుగుపెట్టారు. జ్యోతిషుడు వేణు స్వామి చెప్పింది చెప్పినట్టుగానే నయనతార జీవితంలో జరుగుతుందని నెటిజన్లు అభిప్రాపడుతున్నారు. మరి విడాకులపై వస్తున్న వార్తలపై ఈ జంట ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.












Click it and Unblock the Notifications