ఆ స్టార్ ఫ్యామిలీ ఇంటి కోడలిగా శ్రీలీల..కన్ఫామ్ చేసిన తల్లి..?
టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ ఎవరైనా ఉన్నారంటే అది కచ్చితంగా శ్రీలీల అనే చెప్పాలి. మరే హీరోయిన్‌కు సాధ్యం కానీ విధంగా వరుస సినిమాల్లో నటించి స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది. తెలుగు ఇండస్ట్రీలో శ్రీలీల పేరు మొన్నటి వరకు మార్మోగిపోయింది.తెలుగు ఇండస్ట్రీని శ్రీలీల ఓ ఊపు ఊపింది.పెళ్లి సందD సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన శ్రీలీల..ఆ తర్వాత ధమాకా , భగవంత్ కేసరి,వంటి సూపర్ హిట్లను తన ఖాతాలో వేసుకుంది. శ్రీలీల ఉంటే సినిమా హిట్ అనే అంతలా దర్శక -నిర్మాతలు ఫిక్స్ అయిపోయారంటే ఆమె క్రేజ్ ఎంతలా మారిపోయిందో అర్థం చేసుకోవచ్చు. యంగ్ హీరోలతో పాటు, సూపర్ స్టార్ మహేష్ బాబు వంటి హీరోతో సైతం యాక్ట్ చేసింది ఈ అమ్మడు. అయితే గత కొంతకాలంగా శ్రీలీల హవా తగ్గిందనే చెప్పాలి. ఆమె నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఫెయిల్ కావడంతో శ్రీలలకు ఆఫర్లు తగ్గాయి.
అయితే తెలుగులో అవకాశాలు తగ్గినప్పటికీ, తమిళ, హిందీ భాషల్లో అమ్మడుకు వరుస అవకాశాలు దక్కుతున్నాయి. రీసెంట్‌గా తమిళ స్టార్ అజిత్ 'గుడ్ బ్యాడ్ అగ్లీ' మూవీలో హీరోయిన్‌గా సెలెక్ట్ అయిందనే వార్తలొచ్చాయి. శివ కార్తికేయన్ కొత్త సినిమాలో కూడా శ్రీలీల ఛాన్స్ కొట్టేసింది.ఇది ఇలా ఉండగానే ఇప్పుడు బాలీవుడ్ ఎంట్రీకి కూడా శ్రీలీల రెడీ అయిపోయింది. స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ కొడుకు ఇబ్రహిం ఖాన్ ప్రస్తుతం 'దిలర్' మూవీ చేస్తున్నాడు. ఇందులో శ్రీలీలని హీరోయిన్‌గా తీసుకున్నారు. కార్తిక్ ఆర్యన్‌తో కలిసి మరో బాలీవుడ్ సినిమాలో నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా టీజర్ విడుదల చేయడం జరిగింది. ఈ రెండు సినిమాలు హిట్ అయితే శ్రీలీల పంట పండినట్లే.

ఇదిలా ఉంటే గతంలో శ్రీలీల ఓ ఇంటర్య్వూలో మాట్లాడుతూ. ఎవరితోనైనా ప్రేమలో ఉన్నారా అని అడిగిన ప్రశ్నకు శ్రీలీల అవుననే సమాధానం ఇచ్చింది. తాజాగా అమ్మడు బాలీవుడ్ హీరోతో ప్రేమలో ఉందని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇటీవల కార్తీక్ ఆర్యన్ మాట్లాడుతూ ..నేను ఇప్పటికే ప్రేమలో మూడుసార్లు విఫలమయ్యాను. అందుకే నాలుగోసారి మళ్లీ ప్రేమలో పడ్డాను. అయితే ఈసారి ఇంతకు ముందులాగా కాకూడదని కోరుకుంటున్నాను అంటూ తెలిపారు. శ్రీలీల,కార్తీక్ ఆర్యన్ ఇద్దరు ప్రస్తుతం ఓ సినిమాలో నటిస్తున్నారు. దీంతో వీరిద్దరు ప్రేమలో ఉన్నారంటూ ప్రచారం జరుగుతోంది. శ్రీలీల కూడా ఇటీవల ముంబైలోనే ఎక్కువ దర్శనం ఇస్తుంది.
కార్తీక్ ఆర్యన్ ఇంట్లో జరిగిన ఫంక్షన్‌లో కూడా శ్రీలీల తళుక్కున మెరిసింది. దీంతో వీరిద్దరు డేటింగ్ చేస్తున్నారంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి. సరిగ్గా ఈ సమయంలోనే కార్తీక్ ఆర్యన్ తల్లి చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. ఒక మంచి డాక్టర్ అయితే మా అబ్బాయికి జోడిగా ఉంటుంది ..అలాంటి అమ్మాయి మా ఇంటి కోడలిగా రావాలని కోరుకుంటున్నాం అంటూ తెలిపారు. శ్రీలీల ప్రస్తుతం డాక్టర్ చదువుతోంది. ఈ విషయం అందరికి తెలిసిందే.కార్తీక్ ఆర్యన్ తల్లి చేసిన కామెంట్స్‌తో వీరిద్దరు డేటింగ్‌లో ఉన్నారని అంతా ఫిక్స్ అయిపోయారు.నేరుగా చెబితే బాగోదని ఇలా హింట్ ఇచ్చి ఉంటుందా అని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.మరి ఈ ప్రచారంపై శ్రీలీల ఎలా స్పందిస్తుందో చూడాలి.












Click it and Unblock the Notifications