ఇంటెన్స్ కోర్టు డ్రామాతో మెంటలెక్కించేశారుగా..!

తమిళ స్టార్ హీరో శరత్ కుమార్ కూతురుగా చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది "వరలక్ష్మి శరత్ కుమార్". తనదైన నటనతో తమిళ్ లోనే కాకుండా తెలుగులోనూ అభిమానులను సంపాదించుకుంది. తెలుగులో రవితేజ నటించిన క్రాక్, తేజ సజ్జా హనుమాన్, బాలయ్య వీర సింహారెడ్డి సినిమాల్లో నటించి ప్రేక్షకులకు మరింత చేరువైంది. ప్రస్తుతం పలు సినిమాల్లో నటిస్తున్న ఈ భామ.. రీసెంట్ గానే తన బాయ్ ఫ్రెండ్ ని పెళ్లి చేసుకొని వైవాహిక జీవితం లోకి అడుగుపెట్టింది.

కాగా ఇప్పుడు వరలక్ష్మి తన కెరీర్‌లో తొలిసారిగా దర్శకురాలిగా మారి రూపొందించిన చిత్రం "ఎస్. సరస్వతి". మొదట ఈ సినిమాకు "సరస్వతి" అనే పేరు పెట్టినా.. సెన్సార్ బోర్డు అభ్యంతరాల కారణంగా విడుదలకు ముందు దీనిని "ఎస్. సరస్వతి"గా మార్చారు. ప్రముఖ నటులు ప్రకాశ్ రాజ్, ప్రియమణి, నాజర్, రాధికా శరత్ కుమార్, రావు రమేష్ వంటి వారు కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కోర్ట్‌రూమ్ డ్రామా, సైకాలజికల్ ఎలిమెంట్స్ కలిసి ఈ మూవీపై అంచనాలు క్రియేట్ చేశాయి. తల్లి తన కుమార్తెకు జరిగిన అన్యాయానికి న్యాయం కోసం చేసే పోరాటం నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీ ఆడియన్స్ ని మెప్పించిందో లేదో తెలుసుకుందాం..

s-saraswathi-movie-starring-actress-radhika-sarath-kumar-review-and-rating-also-positives-negatives

సినిమా కథ..

లక్ష్మి (వరలక్ష్మి శరత్ కుమార్) ఒక ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తూ సింగిల్ పేరెంట్‌గా తన 12 ఏళ్ల కూతురు సరస్వతి (నివేష్క నాయుడు)తో కలిసి ఉంటుంది. ఒకరోజు సరస్వతి పుట్టినరోజు సందర్భంగా తన కూతురుని స్కూల్‌లో దింపి వెళ్లి.. తిరిగి వచ్చేసరికి కనిపించదు. విచారణ చేయగా ఆ స్కూల్ యాజమాన్యం "మీ కూతురు మా స్కూల్‌లో చదవడం లేదు" అని చెప్పడంతో లక్ష్మి షాక్ అవుతుంది. కానీ అదే రోజు రాత్రి స్కూల్ ప్రిన్సిపల్ గదిలో నుంచి వచ్చిన ఫోన్ కాల్‌తో అక్కడికి వెళ్లిన లక్ష్మి, తన కూతురు పలుకుబడి ఉన్న ముగ్గురు వ్యక్తుల చేతిలో దారుణంగా అత్యాచారానికి గురై చనిపోయిన విషయం తెలుసుకుని తీవ్ర విషాదంలో మునిగిపోతుంది.

తన కుమార్తె పరువు పోకూడదనే ఉద్దేశంతో ఆ విషయం ఎవరికీ చెప్పకుండా ఆమె మృతదేహాన్ని తానే శ్మశానానికి తీసుకెళ్లి పూడ్చిపెడుతుంది. తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో కేసు ముందుకు సాగదు. ఈ పరిస్థితుల్లో ప్రముఖ క్రిమినల్ లాయర్ రామానుజం (ప్రకాశ్ రాజ్) ఈ కేసును ఎందుకు తీసుకున్నాడు? లక్ష్మి 'ఫాంటసీ ప్రోన్ డిజార్డర్' అనే మానసిక సమస్యతో ఎలా పోరాడింది? తన కూతురికి న్యాయం కోసం తల్లి ఎలాంటి త్యాగాలు చేసింది? సెకండాఫ్‌లో కనిపించే ప్రియమణి పాత్రకు ఈ కథతో ఉన్న సంబంధం ఏమిటి? అనేది సినిమా స్టోరీ.

మూవీ విశ్లేషణ..

'ఎస్. సరస్వతి' కథ సింపుల్ అయినప్పటికీ భావోద్వేగానికి ప్రాధాన్యతనిచ్చిన కోర్ట్‌రూమ్ డ్రామాగా తెరకెక్కింది. ఫస్ట్ హాఫ్‌లో కథను స్థిరంగా ముందుకు తీసుకెళ్లడం వల్ల ప్రేక్షకుల్లో కొంత ఉత్కంఠ ఏర్పడుతుంది. అయితే కథ ముందుకు సాగుతున్న కొద్దీ చాలా సన్నివేశాలు ఊహించగలిగేలా ఉండడం వల్ల ప్రభావం కొంత తగ్గినట్లు అనిపిస్తుంది. సెకండాఫ్ మరింత గ్రిప్పింగ్‌గా ఉండాల్సిన చోట కొంచెం సాగదీసినట్లు అనిపిస్తుంది. ముఖ్యంగా కోర్ట్‌రూమ్ సీన్స్‌లో మరింత బలమైన వాదనలు, డ్రామాటిక్ టెన్షన్ ఉంటే సినిమా ప్రభావం ఇంకా పెరిగేది. కథలో ఉన్న పాయింట్ బలంగా ఉన్నప్పటికీ స్క్రీన్‌ప్లే కొన్ని చోట్ల తడబడినట్లు కనిపిస్తుంది. ముఖ్యంగా నిందితుడిగా ఉన్న వ్యక్తి తానే తన కేసును వాదించుకోవడం వంటి సన్నివేశాలు లాజికల్‌గా ప్రశ్నలు లేవనెత్తుతాయి.

అయితే ఒక తల్లి తన బిడ్డకు న్యాయం కోసం చేసే పోరాటాన్ని దర్శకురాలిగా వరలక్ష్మి భావోద్వేగంతో చూపించడంలో కొంతవరకు విజయవంతమైంది. కొన్ని ఫ్లాష్‌బ్యాక్ సీన్స్‌ను ఇంకా బలంగా రాసుంటే ఎమోషనల్ ఇంపాక్ట్ మరింత పెరిగేది. అలాగే సీరియస్ కథనంలో పాటలు పెట్టడం కథా ప్రవాహాన్ని కొద్దిగా దెబ్బతీసింది.

నటీనటుల ప్రదర్శన..

లక్ష్మి పాత్రలో వరలక్ష్మి శరత్ కుమార్ నటిగా మంచి ప్రదర్శన ఇచ్చింది. తల్లి పాత్రలో ఆమె చూపించిన భావోద్వేగాలు, కోర్ట్ సీన్స్‌లో చూపిన ఆవేశం సినిమాకు ప్రధాన బలం. దర్శకురాలిగా కూడా తనలోని మరో కోణాన్ని ఆమె చూపించగలిగింది.

ప్రకాశ్ రాజ్ లాయర్ రామానుజం పాత్రలో తన అనుభవాన్ని చూపించారు. అయితే ఆయన స్థాయి నటుడి నుంచి ఆశించేంత పవర్‌ఫుల్ డైలాగ్స్‌కు పాత్రలో ఎక్కువ స్కోప్ లేకపోవడం కొద్దిగా నిరాశ కలిగిస్తుంది.

ప్రియమణి, రాధికా శరత్ కుమార్, నాజర్, రావు రమేష్, మురళీ శర్మ వంటి నటులు తమ పాత్రల పరిమితిలోనే కనిపించినప్పటికీ కథకు బలం చేకూర్చారు.

జీవా అతిథి పాత్రలో కనిపించి తన పాత్రకు న్యాయం చేశాడు.

సాంకేతిక అంశాలు..

సంగీత దర్శకుడు తమన్ అందించిన పాటలు పెద్దగా గుర్తుండిపోయేలా లేవు. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మాత్రం కొన్ని సన్నివేశాల్లో ఓకే అనిపిస్తుంది. ఏ.ఎం. ఎడ్విన్ సాకే సినిమాటోగ్రఫీ సాధారణ ప్రేక్షకులకు కొంచెం వింతగా అనిపించవచ్చు. నిర్మాణ విలువలు మాత్రం డీసెంట్‌గా ఉన్నాయి.

కంక్లూజన్..

మొత్తంగా చూస్తే 'ఎస్. సరస్వతి' ఒక భావోద్వేగభరితమైన మెడికో-కోర్ట్‌రూమ్ డ్రామా.

రేటింగ్..

2.5/5

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+